November

కాలుష్యంపై ఎన్‌జీటీ సీరియస్

దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య తగ్గింపుకై చేపడుతున్న చర్యల పట్ల ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై ఎన్‌జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పదేళ్లకు మించిన వాహనాలను నిలిపివేసి.. కాలుష్య నియంత్రణకు సమగ్రమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.

కేజ్రీవాల్‌, రాహుల్‌ అరెస్టుపై ఏచూరి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని అరెస్ట్‌ చేయటం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికర సంకేతాలను పంపుతున్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి విమర్శించారు. మాజీ సైనికులు దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్న ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌ (ఓఆర్‌ఓపీ) విధానంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసగా మాజీ సైనికుడు రామ్‌కిషన్‌ గ్రేవల్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం ఇక్కడి కళామందిర్‌లో జరిగిన అబ్దుల్‌ హలీమ్‌ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఏచూరి మాట్లాడారు.

విలీన మండలాల సమగ్రాభివృద్ధిని కోరుతూ పాదయాత్ర..

ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణంపై సమావేశాలు ఏర్పాటు చేస్తారేగానీ ముంపు మండలాల గిరిజనుల ఘోష మాత్రం పట్టించుకోవడం లేదు. 2018 లోగ పోలవరం పూర్తీ చేస్తామంటున్న ప్రభుత్వం ఏడుమండలాల ప్రజలకు ప్యాకేజి,పునరావాసం కల్పించకుండా వారిని జలసమాధి చేయాలని చూస్తోందని విలీన మండలాల సమగ్రాభివృద్ధి కొరకు చేపట్టిన పాదయాత్రలో రాష్ట్ర సర్కార్ పై మండిపడిన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబురావు తదితరులు..

దివీస్ ఫార్మా కంపెనీని తొలిగించాలి..

తూర్పుగోదావరి జిల్లా దానవాయిపేట నుంచి దివీస్‌ కంపెనీని తొలిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.కంపెనీని తొలగించకపోతే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.తొండంగి మండలం దానవాయిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివీస్‌ కంపెనీకి వ్యతిరేకంగా దానవాయిపేటలో సీపీఎం నిర్వహించతలపెట్టిన సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎంరాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు 200 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ద‌ళిత‌, మ‌త్స్య‌కారుల సమస్యలపై పాదయాత్ర

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా క‌నిపిస్తున్న కాకినాడ స్మార్ట్ సిటీ వాసుల స‌మ‌స్య‌ల‌పై సీపీఎం ఉద్య‌మం ప్రారంభించింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల సాధ‌న కోసం పాద‌యాత్ర సాగిస్తోంది. కాకినాడ‌లో ఇంద్ర‌పాలెం వంతెన వ‌ద్ద ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యురాలు బేబీరాణి జెండా ఊపి యాత్ర‌ను ప్రారంభించారు. ద‌ళిత సంఘాల నేత‌లు రామేశ్వ‌ర రావు సహా ప‌లువురు మ‌ద్ధ‌తు తెలిపారు.న‌గ‌రంలోని ద‌ళిత‌, మ‌త్స్య‌కార పేట‌ల్లో పేరుకుపోయిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని నేత‌లు డిమాండ్ చేశారు.

Pages

Subscribe to RSS - November