October

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులకు వ్యతిరేకంగా

కేరళ వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వంపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. సిపిఎం కార్యాలయాలపై ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి గూండాల దాడులను సిపిఎం కార్యకర్తలు, నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే సిపిఎంపై దాడులకు పాల్పడుతున్నారని, 90 ఏళ్ల దేశ చరిత్రలో ఉన్నడూ లేని విధంగా ఒక రాజకీయపార్టీ కార్యాలయాల ముందు మరో రాజకీయ పార్టీ ఆందోళనలు నిర్వహించడం ఇదే తొలిసారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు.

కౌల్దారు రుణాల్లో మాట తప్పిన ప్రభుత్వం : సిపిఎం

జిల్లా వ్యాప్తంగా ఉన్న కౌలురైతులకు వెంటనే పంటరుణాలు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. అమరావతి కళ్లం బ్రహ్మయ్య స్మారకభవనంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది కౌలురైతులుండగా కేవలం 30 వేల మందికే కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చారని అన్నారు. పది వేల మందికి మాత్రమే పంటరుణాలు మంజూరు చేశారని అన్నారు. ఎన్నికల ముందు ప్రతి కౌలురైతుకు గుర్తింపుకార్డులిచ్చి పంటరుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాటతప్పిందని అన్నారు. బ్యాంకులో రుణాలు మంజూరుకు ఆటంకం కలిగిస్తున్నారని జిల్లా ప్రభుత్వం జోక్యం చేసుకుని రుణాలు మంజూరు చేయించాలని కోరారు. గుంటూరు మార్కెట్‌యా ర్డులో వ్యవసాయ మార్కెట్‌ పద్ధతి ప్రకారం కొనుగోలు చేస్తామని ప్రకటించారని దీంతో వ్యాపారులు నెలరోజుల నుంచి సమ్మె చేస్తున్నారని వెంటనే ఆసమస్యను పరిష్కరించి కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. లక్షలాది ఎకరాల భూములను రైతుల వద్దనుంచి సేకరిస్తూ వాటిని కార్పొరేట్‌ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని విమర్శిం చారు. అనంతపురం నుండి అమరా వతి ఎక్స్‌ప్రెస్‌లైన్‌ నిర్మాణానికి రూ.26 వేల ఎకరాల భూములను సేకరిస్తున్నారని 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరి హారం ఇవ్వాలని కోరారు. సిపిఎం ఏరియా కార్యదర్శి బి.సూ రిబాబు మాట్లాడుతూ క్రోసూరు మండలం బయ్యవరంలో దళితులపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.

ఉగ్రవాదానికి మూలాలెక్కడ ?

ఉరి ఉగ్రవాద దాడి తరువాత దేశంలో పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదం పై చర్చ సాగుతుంది. కాశ్మీర్‌ లోయలో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశ భక్తి పేరుతో ఉన్మాదాన్ని ప్రేరేపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. సర్జికల్‌ దాడుల తరువాత ఆ ఘనత తమదేనని లాభాల వేట మొదలయ్యింది. పనిలో పనిగా ఏదేశ వస్తువులు కొనాలో, వద్దో చర్చ జరుగుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు అనేక విషయాల్లో సాగినట్టుగానే ఉగ్రవాద విషయం లోనూ వాస్తవాలు కప్పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.

Pages

Subscribe to RSS - October