October

సిపిఎంపై ఆరెస్సెస్‌ తప్పుడు ప్రచారం

కేరళ ఉత్తర ప్రాంతంలో హింసారాజకీయాలకు పాల్పడుతున్న ఆరెస్సెస్‌ తమ కార్యకర్తలను సిపిఎం హత్య చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేయటం విడ్డూరంగా వుందని సిపిఎం పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ కార్యకర్తలపై సిపిఎం దాడులు చేస్తోందంటూ తెలంగాణాలోని హైదరాబాద్‌లో ఆరెస్సెస్‌ అఖిల భారత కార్యకారి మండల్‌ సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని పొలిట్‌బ్యూరో తప్పుపట్టింది. వాస్తవ పరిస్థితులకు, తీర్మానానికి భారీ వ్యత్యాసం వుందని తెలిపింది.

అమెరికా ఆంక్షలకు భయపడం

రష్యా ప్రభుత్వాన్ని బెదిరించేందుకు అమెరికా ఆంక్షల ఆస్త్రాన్ని ప్రయోగించిన పక్షంలో వాటిని ఎదుర్కొనేందుకు తమ దేశం అన్ని విధాలా సంసిద్ధమై ఉందని మాస్కో ప్రభుత్వం ప్రకటించింది. రష్యా ఆర్ధిక శాఖ డిప్యూటీ మంత్రి సెర్జీ ర్యబ్‌కోవ్‌ తమ ప్రభుత్వ సన్నద్ధతను వెల్లడిస్తూ అమెరికా నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి తమ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలను సిద్ధం చేస్తున్నారని, అమెరికా స్పందనకు తగినట్టుగా రష్యా కూడా ప్రతిస్పందన చర్యలు తీసుకోగలదని ఆయన స్పష్టంచేశారు. 

విజయవాడ 31వ డివిజన్‌లో ప్రజా చైతన్య పాదయాత్ర

విజయవాడ కొండ ప్రాంతాల్లోని ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ చేస్తానని ఎన్నికల సమయంలో చేసిన హామీని అమలు చేయాలని కోరుతున్న కమ్యూనిస్టులపై చంద్రబాబు అవకులు చెవాకులు పేలుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు.31వ డివిజన్‌ తల్లీపిల్లల సంరక్షణా వికాస కేంద్రం వీధిలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజినీ, ఆ డ్రైనేజీలోనే మంచినీటి పైపులైన్లు ఉండటాన్ని పరిశీలించారు. ఏసురత్నం వీధి కొండ ప్రాంత ప్రజలతో మాట్లాడిన సందర్భంలో మహిళలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

నెక్కంటి ఆక్వా ఫ్యాక్టరీలో మరోప్రమాదం

నెక్కంటి ఆక్వా ఫ్యాక్టరీలో మరో సారి ప్రమాదం సంభవించింది.గ్యాస్ లీక్ అయి 27మంది కార్మికులు తీవ్రంగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వీరింకా డిశార్జ్ కాకముందే మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మంగళవారం అస్వస్థతకు గురయినవారికి న్యాయం చేయాలని ఫ్యాక్టరీ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు.

245 మండలాల్లో కరువు

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఏడు జిల్లాల్లోని 245 మండలాలను కరువు మండలాలుగా శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం జీవో ఎంఎస్‌ నెం.9ను జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాలకు నష్టదాయకం

కృష్ణా జలాల పంపిణీని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు పరిమితం చేస్తూ కృష్ణా జలాల వివాదాలపై నెలకొల్పిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ బుధవారం వెలువరించిన తీర్పు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రయోజనాలకు శరాఘాతం. ఉమ్మడి ఏపీ విభజనతో నదీ పరీవాహక రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఏపి నాలుగుకు పెరగగా, నీటి పంపిణీ పంచాయతీ నుంచి మహారాష్ట్ర, కర్నాటకలను ట్రిబ్యునల్‌ మినహాయించడం సహజ న్యాయ సూత్రాలకు, అంతర్జాతీయ నీటి చట్టాలకు పూర్తి విరుద్ధం.

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి

ఎన్టీపీసీ సోలార్‌ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. జిల్లాలోని కదిరి నుంచి ఎన్‌పీ కుంట వరకు ఆయన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీ సోలార్‌ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, బాధితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని రాఘవులు డిమాండ్‌ చేశారు. బాధిత రైతులతో రాఘవులు ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా భూ నిర్వాసితులకు ప్రభుత్వం.. రూ.లక్షల పరిహారం ప్రకటించడం దారుణమన్నారు. రైతులకు అండగా సీపీఎం పోరాడుతుందని చెప్పారు.

Pages

Subscribe to RSS - October