భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఒక్క ఎకరా కూడా గుంజుకో నివ్వబోమని, అడ్డగోలు భూ సేకరణను కలిసికట్టుగా అడ్డుకుందామని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. బలవంతపు భూ సేకరణపై రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పేదోళ్ల భూములే దొరికాయా అని చంద్రబాబుని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి పేరుతో 13జిల్లాల్లోనూ చంద్రబాబు 15లక్షల ఎకరాలు భూసేకరణ చేపడుతున్నాడని, దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు అవేదన చెందుతున్నారని తెలిపారు. అవసరాలకు మించి భూములు గుంజుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయి ఉద్యమం జరగబోతుందని, దీనికి అందరూ సమాయత్తం కావాలని పిలుపు నిచ్చారు....
పార్టీ కార్యక్రమాలు
అభివృద్ధికి పేదల గుడిసెలు అడ్డంకి కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు అన్నారు. భవానీపురం కరకట్ట సౌత్ ప్రాంతమైన భవానీఘాట్ నుండి పున్నమి హాోటల్ వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబూరావు మాట్లాడుతూ కరకట్ట వాసులు వారం రోజుల్లోగా ఇళ్లను ఖాళీచేసి జెఎన్‌యుఆర్‌ఎం ఇళ్లకు తరలివెళ్లాలని నగరపాలకసంస్థ అధికారులు నోటీసులు జారీచేయటం సిగ్గుచేటన్నారు. దాదాపుగా 40 సంవత్సరాలుగా నగరానికి దగ్గరగా వుండి ఏదోఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారిని ఏక్కడో దూరంగా పడేస్తే వారి జీవన భృతి కష్టతరంగా మారుతుందన్నారు. ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరికి రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా...
అసైండ్, సీలింగ్ సాగుదారులకు వెంటనే కౌలు చెక్కులు ఇవ్వాలని , పట్టాభూమితో సమాన ప్యాకేజి ఇవ్వాలని కోరుతూ అమరవతి (రాజధాని) ప్రాంతంలో సిపిఎం నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు..శాంతియుతంగా దీక్షలు చేస్తున్న దళితులు, సిపిఎం నాయకుల్ని పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి స్టేషనుకు తరలించారు.వీరిపై 144 సెక్షన్ కింద పోలీసులు కేసులు నమోదు చేసారు.
బందరు పోర్టు భూముల ప్రభావిత గ్రామాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విస్తృతంగా పర్యటించారు.భూ బ్యాంక్ పేరుతో రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తోందని నిప్పులు చెరిగారు. బందరు తీరంలో 30 వేల ఎకరాలు సమీకరిస్తోందని, ఇందులో 14 వేల ఎకరాల ప్రైవేటు భూములున్నట్లు చెబుతూ మిగిలిన 16 వేల ఎకరాల్లో సాగుచేసుకుంటున్న రైతులకు మొండిచెయ్యి చూపించేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. సాగుదారులకు అండగా ఉంటామని, పోరాటం చేసి ప్రభుత్వ తీరును ఎండగడతామని బాధితులకు భరోసా ఇచ్చారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు అధ్యక్షతన సోమ, మంగళవారాల్లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవాడలో నిర్వహించారు.విద్య, వైద్యాన్ని రైతుల భూములనూ కార్పొరేట్ రంగానికి ధారాదత్తం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కార్పొరేట్ పరిపాలన ప్రవేశపెడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు విమర్శించారు. ఉన్నత విద్య బాధ్యత తమది కాదనీ, దాన్ని కార్పొరేట్ రంగం సామాజిక బాధ్యతగా భóుజస్కం ధాలపై వేసుకోవాలని ఉపాధ్యాయ దినోత్సవం నాడు స్వయానా ముఖ్యమంత్రే చెప్పారని మధు గుర్తు చేశారు. తదనుగుణంగానే ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిందన్నారు. పెద్ద సంఖ్యలో పాఠశా లలు, సంక్షేమ...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్ మీదుగా సాగిన ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు, ఏఐటి యుసి, ఐఎప్‌టి యు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియుసి, ఐఎన్‌టియుసి, ఏఐసిసిటియుసి, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ఈ ర్యాలీకి అగ్రభాగాన ఉండి నడిపించారు. సిపిఎం, సిపిఐ...
పంచగ్రామాల భూసమస్యపై టిడిపి ప్రభుత్వం కేబినెట్‌లో చర్చించడాన్ని సిపిఎం స్వాగతిస్తోందని ఆ పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు అన్నారు. కేబినెట్ ప్రకటనతో కేవలం 12149 మందికే ఉపశమనం లభిస్తుందని, మరింత ఉదారంగా వ్యవహరించి జిఒ జారీ చేస్తే ఎక్కువ మంది పేదలకు న్యాయం జరగుతుందన్నారు. 60 గజాల లోపు వరకు ఉన్న నివాసాలను మాత్రమే ఉచితంగా క్రమబద్ధీకరించి, మిగిలిన వాటిని వర్గీకరించి డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. అక్కడితో ఆగకుండా 61 నుంచి 300 గజాల వరకు 1998 నాటి భూ విలువలో 70 శాతం డబ్బులపై 9 శాతం వడ్డీ కట్టాలని ప్రకటించడం సబబు కాదన్నారు. సోమవారం ఉదయం విశాఖ జిల్లా సిపిఎం కార్యాలయంలో నగర కార్యదర్శి బి.గంగారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు...
ప్రభుత్వ బలవంతపు భూసేకరణను నిరసిస్తూ రాజధాని ప్రాంతం పెనుమాక రైతులతో వామపక్ష్య నాయకులు సమావేశమయ్యారు.ఈసమావేశానికి రైతులు భారీగా తరలివచ్చారు.ఎలాంటి పరిస్థితిలో భూములు ఇచ్చేది లేదని రైతులు తేగేసి చెప్పారు. సిపియం రాష్ర్ట కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం స్వయంగా ప్రభుత్వం చేయడం సిగ్గుచెటన్నారు.ప్రభుత్వం రైతుల భూములు లాక్కోవాలని చూస్తే రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఏళ్లతరబడి సాగు చేసుకొంటున్న భూములను పేదల నుంచి బలవంతంగా తీసుకునే సత్తా ప్రభుత్వంతోపాటు ఎవరికీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలాకిలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రభావిత ప్రాంతాలైన సన్యాసిరాజుపేట, ఓదిపాడు, తోటాడ గ్రామాల్లో శుక్రవారం ఆయన పరిశీలించారు. పోలాకి మండల కేంద్రంలో రైతులతో మాట్లాడారు. జిఒ 1307 ప్రకారం బలవంతంగా భూములు లాక్కోవడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 35 థర్మల్ ప్రాజెక్టులున్నాయని, రాష్ట్రావసరాలకు సరిపడా విద్యుదుత్పత్తి ఉండగా, ఇంకా కొత్త పవర్ ప్లాంట్ల అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
ఏపీ రాజధాని కోసం ప్రభుత్వం భూసేకరణను వెంటనే విరమించుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్రకార్యవర్గ సభ్యుడు బాబురావు డిమాండ్ చేశారు. గ్రామ కంఠాల పరిధిని విస్తరింపచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ. సీఆర్డీఏ కార్యాలయాన్ని రైతు సంఘాలు, సీపీఎం నేతలు ముట్టడించారు. సీఆర్డీఏ కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. 140 ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకు సరిపోతుందన్నారు. కానీ రాజధాని పేరుతో ఇప్పటికే లక్షాపదివేల ఎకరాల సమీకరించారని అది చాలదని ఇప్పుడు మరో 3వేల ఎకరాలను సేకరిస్తోందని బాబురావు మండిపడ్డారు. రాజధాని పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. సింపూర్, జపాన్ కంపెనీలకు భూములను తాకట్టు...
పేదల ఇళ్ళను తొలగించడానికి వస్తే ధైర్యంగా ఎదుర్కో వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వెంకటేశ్వర్లు పేదల ను కోరారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగస ముద్రం పంచాయతీలోని 54 ఎకరాల ప్రభుత్వ బంజరు భూ ముల్లో బుధవారం వందలాది మంది పేదలు గుడిసెలు వేశా రు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 1263లోని 54 ఎకరాల ప్రభుత్వ బంజరులో ఇంటి స్థలం కోసం పేదలు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు నిర్లక్ష్యం వహించారని, దీంతో ఓపిక నశించి ఆ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు. గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని ఆయన డి మాండ్ చేశారు. ప్రతి కుటుంబానికీ రెండున్నర లక్షల రూపా యలతో పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలన్నారు...
నూజెండ్ల మండలంలోని ముక్కెళ్లపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం 5-1లోని ప్రభుత్వభూమిని పేదలకు పంపిణీ చేసి పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. మంగళవారం గ్రామంలోని ప్రభుత్వభూములను ట్రాక్టర్‌తో దున్ని ఎర్రజండాలు పాతి ఆక్రమించారు. పాలక పార్టీలు ఎన్నికలకు ముందు పేదలందరికీ ఇళ్లస్థలాలు, సాగుభూములు ఇస్తామని వాగ్దానం చేసి, నేడు భూములన్నీంటిని కార్పొరేట్ సంస్థలకు కట్టబట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అనేక చోట్ల ప్రభుత్వ భూములకు పెత్తందార్లు పట్టాలు పుట్టించి లక్షలరూపాయలకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలకు పట్టాలివ్వాలని లేనిచో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. భూమిని దున్నే...