పార్టీ కార్యక్రమాలు

Sat, 2015-07-25 09:50

తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడున్నర వేల మంది కార్మికులను అరెస్టు చేశారు. పలుచోట్ల లాఠీఛార్జీలు జరిపారు. విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావుసహా పలువురు వామపక్ష నేతలు సొమ్మసిల్లి పడిపోయారు. పిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామ కృష్ణ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబలేసు సహా వేలాది మందిని అరెస్టు చేశారు. విశాఖలో 2,500 మందినీ, రాష్ట్రంలో కలెక్టరేట్ల వద్ద మరో వెయ్యి మందినీ అరెస్టు చేశారు. 

Fri, 2015-07-24 15:33

తమ సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరశిస్తూ సీపీఎం నాయకులు మునిసిపల్ కార్మికులతో కలిసి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. భారీగా వచ్చిన కార్యకర్తలు..కార్మికులతో కలెక్టర్ కార్యాలయం అట్టుడికింది. సీఎం డౌన్..తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేశారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను..కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు పిడిగుద్దులు.. బలప్రయోగం చేయడంతో సీపీఎం నేత బాబురావు,...

Thu, 2015-07-23 19:20

నేడు మున్సిపల్ కార్మికల కలెక్టరేట్ల ముట్టడికి మద్దతు తెలియచేస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సమ్మెను అణచివేయాలని రాష్ట్ర కాబినెట్ తీసుకున్న నిర్ణయం దారుణమన్నారు. రాష్ట్ర మంత్రే ఈ ప్రకటన చేయడం సిగ్గుచేటని,ప్రభుత్వం కార్మికుల సమ్మెను పరిష్కరించకుండా రాజకీయం చేస్తే ఇది ఒక్క కార్మికుల సమస్య గానే కాక రాజకీయ సవాల్ గా కూడా స్వికరించాల్సివస్తుందన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే నెల రోజులైనా ఆందోళనలకు సిద్ధమన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.ప్రభుత్వం వెంటనే కార్మిక జెఎసి తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసారు .. 

Wed, 2015-07-22 10:34

మాస్టర్‌ప్లాను నివేదిక ప్రకారం ప్రసుత్తం గ్రామాలు తరలిస్తామంటున్నారని, రేపు ఉన్న ప్రజలనూ తరలించేస్తారని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు అన్నారు. గ్రామాల్లో రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి, నాయకులు నవీన్‌ప్రకాష్‌తో కలిసి పర్యటించారు. ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు ఆందోళనకు దిగడంతో ఎక్కడిక్కడ నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకూ ఊరుకునేది లేదని, ఎంతవరకైనా వెళతామని హెచ్చరించారు. వరదలొచ్చినా వారు ఇక్కడే ఉన్నారని, నష్టపోయారని, ఇప్పుడు కొద్దిమంది లాభం కోసం తరిమేస్తామంటే ఎలా వెళతారని ప్రశ్నించారు. ప్రభుత్వం పేదలను, ముఖ్యంగా దళితులను ఇక్కడ నుండి తరిమేసే ప్రక్రియ...

Tue, 2015-07-21 11:37

మున్సిపల్‌ ఉద్యోగు లు, కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. మున్సిపల్‌ జేఏసీ నాయకులు ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్య క్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మాట్లాడుతూ మున్సిపల్‌ ఉద్యోగుల్లో అధిక శాతం దళితులే ఉన్నారన్నారు. వారికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కూడా అటకెక్కించిన ఘనత చంద్ర బాబు ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. గతే డాది ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిగి న సందర్భంలో మున్సిపల్‌ కార్మికులకు కూడా వేతనాలు పెంచుతామని చంద్రబాబు వాగ్దానం చేశారని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్‌ ఉద్యోగుల ఆందోళనను అణచివేయడానికి...

Mon, 2015-07-20 16:43

నాడు సాగించిన స్వాతంత్య్రోద్యమం తరహాలోనే మరో పోరాటం సాగాల్సిన అవసరముందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపునిచ్చారు. స్వాతంత్య్రమొచ్చి 65 ఏళ్లు దాటినా అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని రూపొందించాల్సిన బాధ్యత వామపక్షాలపైనే ఉందని సూచించారు. ఆ దిశగా తాము కృషి చేస్తామని తెలిపారు. ఆదివారం అనంతపురం నగరంలోని వికె.మెమోరియల్‌ హాలులో 'అనంతపురం జిల్లా కమ్యూనిస్టు సీనియర్‌ నాయకుల కుటుంబ సభ్యుల సమ్మేళనం' జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.ఇంతియాజ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్‌ కమ్యూనిస్టు నాయకులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 80...

Sat, 2015-07-18 12:44

రానున్న పార్లమెంటు సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.ఇప్పటికే దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్న భూ సేకరణ చట్టానికి సవరణ బిల్లుతో పాటు, ఎస్సీఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సవరణ, సరుకులు, సేవల బిల్లు (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ -జిఎస్‌టి) బిల్లు వీటిలో కీలకమైనాయి. పన్నుల విధానంలో పెనుమార్పులు తీసుకువచ్చే జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేస్తోందని, రాష్ట్రాల ప్రభుత్వాలతో, ఆర్థిక శాఖ మంత్రులతో అనేక దఫాలు చర్చించి,కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినప్పటికీ స్థూలంగా అంగీకరించారంటూ...

Thu, 2015-07-16 16:30

కృష్ణాజిల్లా‌లోని మైలవరం మండలం వెల్వడంలో సీపీఎం బృందం పర్యటించింది. ఫీల్డ్ లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీ భూములను పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ... రాజధాని పేరుతో పేదల భూములు లాక్కొని పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరు మారకుంటే సహించమని స్పష్టం చేశారు. దేవినేనిఉమ‌కు మంత్రి పదవి వచ్చాక పేదల్ని పట్టించుకోవట్లేదన్నారు. మా ప్రాణాలు పోయినా పేదలకు భూములు దక్కేలా చేస్తామని హెచ్చరించారు.

Thu, 2015-07-16 11:20

పట్టణ సమస్యలపై రాష్ట్రంలోని మున్సిపల్‌ పట్టణాల్లో ఆందోళనలు నిర్వహిం చాలని సిపిఎం రాష్ట్రకమిటీ నిర్ణయించింది. సిపిఎం పట్టణ బాధ్యుల రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఆగస్టు 1 నుంచి 14 వరకు పట్ట ణ సమస్యలపై క్యాంపెయిన్‌లు, ఆందోళనలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణ యించింది. ఈ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి పి మధు హాజరయ్యారు. పట్టణ సమస్యలపై పోరాడాల్సిన అవశ్యకతను ఆయన వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న మెగాసిటీలు, స్మార్ట్‌సిటీలు, అమృత్‌ పట్టణాలు అన్నీ కూడా పట్టణాల్లో మౌలిక సదుపాయాలను ప్రైవేటీకరింటి వ్యాపారమయం చేయ డం కోసం ఉద్దేశించినవేనని చెప్పారు. మౌలిక సదుపాయాల ప్రైవేటీకరణ వల్ల పట్టణ ప్రజలు, తీవ్ర...

Thu, 2015-07-16 11:04

పెట్టుబడిదారుల దోపిడీ వల్లే కొన్ని ప్రాంతాలు వెనుకబడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తంచేశారు. వారి దోపిడీని అరికట్టి అభివృద్ధికి పార్టీ శ్రేణులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తిరుపతి సుందరయ్య నగర్‌లోని ఎంబి భవన్‌లో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ.. సామ్రాజ్య వ్యవస్థను, భూస్వామి వ్యవస్థను వ్యతిరేకించే వారిని కలుపుకుని ఉద్యమించాలన్నారు. గ్రామీణ వ్యవస్థలో నెలకు ఐదువేల రూపాయలకు మించి ఆదాయం రాని వారు 50 శాతానికి పైగా ఉన్నారన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు ప్రత్యామ్నాయం వైపు అడుగులేస్తున్నారని, కలిసొచ్చేవారిని కూడగట్టుకుని...

Wed, 2015-07-15 12:35

రైతుల భూములతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పూనుకుంటోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్‌ కాల్పుల ఘటనకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సమితి, మత్స్యకారుల ఐక్యవేదిక ఆధ్వర్యాన సోంపే టలో మంగళవారం నిర్వహించిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. విజయ నగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న విమానా శ్రయానికి ఐదు వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించా రు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచుగా తిరుగుతున్న సింగపూర్‌ అంతర్జాతీయ విమానా శ్రయం కూడా 1200 ఎకరాల్లోనే నిర్మించారని గుర్తుచేశారు. రైతులనుంచి తీసుకున్న భూములతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చూస్తోందని విమర్శించారు....

Wed, 2015-07-15 11:19

ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల వల్లే పుష్కర ఘాట్‌లో ప్రజలు తొక్కిసలాటలో చనిపోయారనీ, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంపీ మిడియం బాబూరావు డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాడ సానుభూతి తెలిపారు. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలనీ, ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ కోరారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, పుష్కరాల్లో మిగిలిన రోజులైనా ఎలాంటి అపశృతీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలోని క్షతగాత్రులు, బంధువులను ఆయన మంగళవారం పరామర్శించారు. ప్రభుత్వమూ, పోలీసులూ, అధికారుల అతి ప్రవర్తన వల్లే ఇదంతా జరిగిందనీ, నాయకులను...

Pages