పార్టీ కార్యక్రమాలు

Thu, 2015-06-25 12:37

ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. బుధవారం కడపలోని సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలం తక్కువగా ఉన్నప్పటికీ అధికారం, డబ్బు వినియోగించి ఎన్నికల్లో గెలవాలని టిడిపి యత్నిస్తోందన్నారు.
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు రూ. 50 లక్షలు అప్పచెబుతూ టిడిపి కన్నంలో దొంగలా దొరికిందన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఎలాంటి పోరాటమూ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం...

Wed, 2015-06-17 13:00

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని నిరసిస్తూ మంగళవారం విజయవాడ బీసెంట్‌ రోడ్డులో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మద్యం భూతం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 'నూతన మద్యం పాలసీని ఉపసంహరించుకోవాలి, వద్దు వద్దు మద్యాంధ్రప్రదేశ్‌, మంచినీరు నిల్‌-మద్యం పుల్‌' అంటూ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.ముందుగా సిపిఎం నగర కార్యాలయం నుంచి ఆందోళనకారులు ప్రదర్శనగా బీసెంటర్‌ రోడ్డులోని అన్సారీపార్కు వద్దకు చేరుకున్నారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు డి.విష్ణువర్ధన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ, ప్రజల జీవితాలు, వారి ప్రాణాలతో చెలగాటమాడే...

Pages