July

వ్యాపం లో మరో కోణం

వ్యాపం కుంభకోణాన్ని తానే తొలిసారిగా గుర్తించానని, ఆడ్మిషన్లు; రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని తెలిసిన వెంటనే దర్యాప్తుకు ఆదేశించానని గొప్పలు చెప్పుకుంటున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు వ్యతిరేకంగా దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. అసలు దర్యాప్తు ఆలస్యానికి ముఖ్యమంత్రే కారణమని రికార్డులు చూపిస్తున్నాయి. కుంభకోణం సంగతి సిఎంకు ముందే తెలుసని, ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన దర్యాప్తును ఆలస్యం చేశారని రికార్డులు చూపిస్తున్నాయి.

సోషలిజంతోనే సమస్యలు పరిష్కారం:పాటూరు రామయ్య

  ప్రజాసమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పాటూరు రామయ్య పేర్కొన్నారు. ఇందుకోసం ముందు నుంచి కృషి చేస్తున్న కమ్యూనిస్టు నాయకులను స్మరించు కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతపురం జిల్లాలో గుత్తిరామకృష్ణ అటువంటి మార్గదర్శ కుడే నని తెలిపారు. స్వాతంత్య్ర సమర యోధులు, అనం తపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థా పకుల్లో ఒకరైన గుత్తి రామకృష్ణ శతజయంతి వేడుక లను సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ నిర్వహిం చింది.

టిడిపి మరో ఆగడం

ష్ట్రంలో రోజు రోజుకు అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు తారాస్థాయికి చేరుకుంటున్నా యి. కృష్ణా జిల్లా ముసునూరు మహిళా తహశీల్దారు వనజాక్షిపై టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఆయన అనుయాయుల దాడి, చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగళ్లు మహిళా తాహశీల్దారు నారాయ ణమ్మను ఓ సర్పంచ్‌ దుర్భాషలాడిన సంఘటనలు మరువక ముందే కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఒంటిమిట్టలో తాగునీళ్లు అందడం లేదని నిలదీసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ప్రభుత్వ విప్‌, రాజంపేట ఎమ్మెల్యే సాక్షిగా టిడిపి మండల అధ్యక్షుడు దాడిచేశాడు. ఆ ప్రాంతంలో పోలీసులు ఉన్నా ఈ సంఘటనను చూసీచూడనట్లు వదిలేయడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి.

కార్మికులపై" ఎస్మా" ప్రయోగం

హైదరాబాద్: నగరంలో సమ్మెకు దిగిన కార్మికులు విధులకు రంజాన్, బోనాల పండుగను, అలాగే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే విధుల్లో చేరాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ సోమేశ్‌కుమార్ శుక్రవారం మరోసారి సూచించారు. ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మెకు దిగిన కార్మికులకు నాటి నుంచి సమ్మె ముగిసే వరకు నో వర్క్ నో పేను అమలు చేస్తామని చెప్పుకొచ్చిన ఆయన శనివారం కార్మికులకు వర్కింగ్ డేగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

సాంస్కృతిక రాజధానిగా విశాఖ

 విభజన నేపథ్యంలో విశాఖను సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టినట్టు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం సాయంత్రం ఎంవిపిలో విశాఖ జూనియర్స్‌ పేరిట ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ భవిష్యత్‌లో విశాఖ అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందనుందన్నారు. విశాఖ జూనియర్స్‌ పోటీలు నిర్వహించడం అభినందనీయమని, వీటివల్ల బాలలలో ప్రతిభ పాటవాలను వెలికితీసేందుకు దోహదం చేస్తాయని తెలిపారు.

భారత జనాభా 127,42,39,769

భారత దేశ జనాభా శనివారం నాటికి 127,42,39,769కు చేరుకుంది. శనివారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని అచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు దేశ జనాభా ఇది. దేశ జనాభా ఏడాదికి 1.6 శాతం చొప్పున పెరుగుతోందని, ఇదిలాగే కొనసాగితే 2050 నాటికి మన దేశం చైనాను సైతం దాటి పోయి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘జనసంఖ్య స్థిరతా కోశ్’ (ఎన్‌పిఎస్‌ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం చైనా జనాభా దాదాపు 139 కోట్లు ఉంది. భారత దేశంలో జనాభా చైనాకన్నా ఎక్కువ వేగంగా పెరుగుతోందని ఈ సంస్థకు చెందిన అధికారి ఒకరు చెప్పారు.

మాజీ ఎంపీ హైడ్రామా..!

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. స్థానిక సెయింట్‌పాల్‌ చర్చి మైదానంలో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ చేపట్టిన దీక్షను రెండో రోజే పోలీసులు భగ్నం చేయడం.. ఆ సమయంలో హర్షకుమార్‌ తన వద్దనున్న తుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరపడం.. వంటి ఘటనలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నగరంలో సీఎం పర్యటన కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజమండ్రి నగరంలో ముస్లింలకు షాదిఖానా, క్రైస్తవులకు శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో హర్షకుమార్‌ శుక్రవారం దీక్ష ప్రారంభించారు. దీక్షకు పలువురు కాంగ్రెస్‌, వైసీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.

వ్యసనం

వలదు వలదన్న వాటికే మనుషులు అలవాటు పడతారు. కాదు కాదన్న వాటి చెంతకే  చేరుతారు. నిషేధిత పనుల మీదనే మనుషులకు ఆకర్షణ ఎక్కువ. సమాజం ఒప్పని పనులు చేయకూడదని తెలిసినా వాటి వైపే మొగ్గు చూపుతారు. తప్పని తెలిసినా వాటికి లొంగిపోతారు. అలవాటు అన్నది వదిలిపెట్టడానికి వీల్లేనంతగా పరిణమిస్తే వ్యసనమవుతుంది. ఆ వ్యసనానికి బానిసలయితే కోలు కోవడం కష్టం. అందువల్లనే మన పెద్దలు సప్త వ్యసనాలకు దూరంగా ఉండటం క్షేమకరమని చెప్పారు. పురాణాలు, శాస్త్రాలు చెప్పిన ఈ ఏడు వ్యసనాల్లో జూదం, మాంసభక్షణం, మద్యపానం, వేశ్యాసంగమం, వేట, దొంగ తనం, పరస్త్రీలపై లౌల్యం ఉన్నాయి. ఇవే గాక ఇతరులు మరికొన్ని వ్యసనాల గురించి ప్రస్తావించారు.

రమ్స్‌ఫెల్డ్‌కు జ్ఞానోదయం

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ నిర్దేశానుసారం ఇరాక్‌పై దాడి చేయటం ద్వారా చాలా పెద్ద పొరపాటు జరిగిందని అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రమ్సఫెల్డ్‌ కథనం. 2003లో ఇరాక్‌పై దాడికి ఈ రమ్స్‌ఫెల్డే నాయకత్వం వహించారు. ఇన్నాళ్ళ తరవాత బహిరంగంగా ఇరాక్‌లో అమెరికా చెప్పిన ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టింప జేయటానికి బుష్‌గారి నిర్డేశాను సారం యుద్ధం మొదలబెట్టటం పూర్తిగా తప్పని ఆయన ప్రకటిం చారు. ఇరాక్‌లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పాలనే పేరిట అక్కడి అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను అధికారం నుంచి తొలగించి హత్య చేయటం అర్థం లేని, గందరగోళ చర్యని అన్నారు.

మన విద్యారంగం పయనమెటు?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలోనే కాదు, ఏదేశమేగినా ఎందు కాలిడినా మన రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడుతుంటారు. అభివృద్ధి గురించి ఆయన చెప్పే విషయాలు పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా చదువుతున్నాం. టీవీల్లో గంటల తరబడి వింటున్నాం. అభివృద్ధి అనగానే ఆయన చెప్పేది సింగపూర్‌, జపాన్‌ల గురించి. ఈ మధ్య చైనా గురించి కూడా చెబుతున్నారు. మన రాష్ట్రాన్ని సింగపూర్‌లాగా, జపాన్‌, చైనాల్లాగా అభివృద్ధి చెస్తాననే ముందు ఏ జాతి అయినా అభివృద్ధి చెందడానికి అతి ముఖ్యమైన, కీలకమైన రంగం గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. విద్యాభివృద్ధి అనేది ఆర్థికాభివృద్ధికీ, పేదరిక నిర్మూలనకూ అత్యంత కీలక విషయం.

Pages

Subscribe to RSS - July