June

ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంపుపై ఆందోళన ..

విశాఖ ప్రజలకు భారంకానున్న ఆస్థి పన్ను, చెత్త పై పన్ను రద్దు చేయాలని శాంతియుతంగా విశాఖ జివిఎంసి కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న సిపిఎం నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్న పోలీసులు.. సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, జగన్, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి.క్రిష్ణారావు, మాజీ కార్పోరేటర్ బొట్టా ఈశ్వరమ్మ సహా పలువురు అరెస్టు. అరెస్టు చేసిన సిపిఎం నాయకులను బేషరత్తుగా విడుదల చేయాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్.

పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై విశాఖలో నిరసన

పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు,మందులు ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వామపక్ష పార్టీల  ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన చేపట్టారు. బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క మే నెలలోనే 22 సార్లు పెంచారని, కరోనా నేపధ్యంలో సామాన్యుల జీవితాలు దుర్బరం అయ్యాయని, ఇటువంటి సమయంలో ప్రజలను ఆదుకోవడానికి చర్యలు చేపట్టకపోగా ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమన్నారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని వాపోయారు.

Pages

Subscribe to RSS - June