భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు )
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం : విజయవాడ,
తేది : 15 డిసెంబర్, 2023.
ఎమ్మెల్సీ సాబ్జి మృతికి సంతాపం
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఉద్యమ ప్రముఖ రాష్ట్ర నాయకులు షేక్ సాబ్జి గారి దుర్మరణం పట్ల సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నది. ఆయన మరణం ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని నష్టం. ఆకివీడులో అంగన్వాడీ సమ్మెకు మద్దతు తెలిపి తిరిగి భీమవరంలో అదే కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.