భారత్, చైనాల మధ్య అభివృద్ధిలో పోలికలు ఈనాటివి కావు. రెండు దేశాలూ రెండేళ్ల తేడాతో విముక్తి పొందడం, జనాభాలో, ఆర్థికాభివృద్ధిలో దాదాపు ఒకే విధంగా ఉండడం వల్ల ఈ పోలికలు నాటి నుండి నేటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్ర పూర్వం చైనా భారత కన్నా వెనుకబడి ఉండేది. సోషలిస్టు నిర్మాణం తరువాతా, 1980 దశకంలోనూ చైనా అప్రతిహత అభివృద్ధి సాధించడంతో భారత్‌ను అధిగమించి ముందుకు పోయింది. గత 20 ఏళ్లకు పైగా రెండంకెల అభివృద్ధితో నడుస్తున్న చైనా వేగం మందగించిందనీ, భారత్ వచ్చే ఏడాది అభివృద్ధిలో దాన్ని అధిగమిస్తుందనీ ఆర్థిక పండితులు, సంస్థలు చెబుతున్నాయి.