February

విమ్స్‌ హాస్పటల్‌ను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి. - పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎం.వి.యస్‌.శర్మ

విమ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎం.ఎల్‌.సి శ్రీ ఎం.వి.ఎస్‌.శర్మ డిమాండ్‌ చేశారు. విమ్స్‌ను ప్రారంభించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) చేస్తున్న 48 గంటల నిరాహారదీక్షా శిభిరాన్ని నేడు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ నిమ్స్‌ తరహాలో విమ్స్‌ను అభివృద్ధి చేయాలని, సామాన్య ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తేవాలని కోరారు. గోదావరి పుష్కరాలకు 1600 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు ప్రభుత్వం విమ్స్‌కు 100 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

పేద‌లకు ఇళ్ళు, స్థ‌లాల కోసం ఉద్యమం., మార్చి 16 ఛ‌లో విజ‌య‌వాడ జ‌య‌ప్రదానికై జ‌రిగే పాద‌యాత్ర‌లు, సైకిల్ ర్యాలీ, ధ‌ర్నా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొనండి.

పట్టణీకరణ పెరిగిపోతున్న నేపద్యంలో పేద ,మధ్య తరగతి ప్రజకు ఇళ్ళు, ఇళ్ళపట్టాలు, పట్టాల‌ రిజిస్టేషన్లకై వామపక్షపార్టీల‌ ఆధ్వర్యంలో మార్చి 16న ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టాల‌ని వామపక్షాలు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తీర్మానించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల సమస్య పరిష్కారం కోసం  ఆందోళన చేపట్టనున్నట్లు వెల్ల‌డించారు.  ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించేందుకు  ముందుగా ఫిబ్రవరి 26న ధర్నాలు, 28వ తేది నుండి మార్చి 9 వరకు పాదయాత్రలు,  మార్చి 12న సైకిల్‌ ర్యాలీలు నిర్వహించాల‌ని పిలిపునిచ్చారు.  ఈ మేరకు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వామపక్ష నేతలు తీర్మానాలు  చేశారు.

కడపలో రాయలసీమ బస్సుయాత్ర..

బాబొస్తే జాబొస్తుందంటూ కల్లబొల్లిమాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అడ్డం తిరిగారు.. బాబుకేమో వాస్తవంగా జాబొచ్చింది.. ఇక్కడ ఎంఎల్‌ఏగా ఓడిపోయిన ముద్దుకృష్ణమనాయుడుకీ ఎంఎల్‌సిగా చోటు దక్కింది.. జాబ్‌ ఇస్తారని నమ్మి ఓటేసిన జనానికేమో కష్టాలొచ్చాయి' అంటూ వామపక్ష నాయకులు ఉద్ఘాటించారు. రాయలసీమ బస్సు యాత్రకు మూడో రోజు చిత్తూరు జిల్లాలో అడుగడుగునా ఆదరణ లభించింది. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి గాలేరు-నగరి వస్తే తప్ప ఇక్కడ ప్రజల మనుగడ సాధ్యం కాదన్నారు.

విషం చిమ్ముతున్న 'దివీస్‌'

 దివీస్‌ లేబొరేటరీ.. పరిసర ప్రాంతాలను విషతుల్యం చేస్తోంది. ఒకప్పుడు పిల్లా, పాపలతో సంతోషంగా గడిపే కుటుంబాలిప్పుడు బతుకు తెరువులేక అల్లాడుతున్నాయి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీని వాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం భీమిలి మండలం చిప్పాడ పంచాయతీలో దివీస్‌ లేబొరేటరీ ఉంది. ఇది దశాబ్దంన్నరగా ఔషధాలకు అవసరమైన పౌడరు ను ఉత్పత్తి చేస్తోంది. ఈ కంపెనీ వెలువరించే వాయు, జల రసాయనాల కాలుష్యంతో భీమిలి మండలంలోని 17 గ్రామాలకు చెందిన జనం టిబి, కీళ్ల నొప్పులు, గుండె, కంటి, కిడ్ని, శ్వాసకోశ వంటి వ్యాధుల బారినపడుతున్నారు.

బాబును జైలుకు పంపుతా:వైగో

తమిళనాట తాము అధికారంలోకి వస్తే... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని జైలుకు పంపుతామని ఎండీఎంకే పార్టీ నేత వైగో సంచలన వ్యాఖ్య చేశారు. ఇటీవల తిరుపతి సమీపంలో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్ ను ప్రస్తావించారు. ఎర్రచందనం కూలీల పేరిట 20 మంది అమాయక తమిళ కూలీలను చంద్రబాబు ప్రభుత్వం ఎన్ కౌంటర్ చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్ కౌంటర్ పేరిట తమిళులను చంపేసిన ఏపీ సీఎం చంద్రబాబును... తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా జైలుకు పంపుతామని ఆయన సంచలన ప్రకటన చేశారు.

ఖమ్మంలో సత్తాచాటేందుకుCPM

పోరాటాల ఖిల్లా ఖమ్మంలో కార్పొరేషన్‌కు ఎన్నికల హడావుడి షురూ అయింది. అభ్యర్ధుల ఎంపికలో పార్టీలన్నీ బిజీబిజీగా ఉంటే.. ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గత మూడు ఎన్నికల్లో పీఠం దక్కించుకున్న సీపీఎం మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తోంది. 

ఏపి అసెంబ్లీ సమావేశాలు మార్చి 5న..

అసెంబ్లీ సమావేశాలు మార్చి ఐదున ప్రారంభమవుతాయని, 10న బడ్జెట్‌ ప్రవేశపెడతామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. కలెక్టర్ల సదస్సలో ఆయన మాట్లాడుతూ 15 నెలల్లోనే రాష్ట్రంలో రెండంకెల వృద్ధి సాధించామని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మండలాల వారీగా జిఎస్‌డిపి నమోదు చేస్తామని వెల్లడించారు.

కన్నయ్య పై మళ్లీ దాడి చేస్తాం..

మూడు గంటలపాటు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యను చితకబాదినట్టు ఇండియాటుడే మీడియా సంస్థ నిర్వహించిన స్ట్రింగ్‌ ఆపరేషన్‌లో ముగ్గురు న్యాయవాదులు చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. ఆ ముగ్గురు లాయర్లలో విక్రమ్‌ సింగ్‌ చౌహాన్‌, యష్‌పాల్‌ సింగ్‌, ఓం శర్మ ఉన్నారు. మేం అతడిని వదిలి పెట్టం. అతడిని చితకబాదుతాం. నాపై ఎన్ని కేసులు మోపినా లెక్కచేయను. వాడిపై పెట్రోల్‌ బాంబుతో దాడి చేస్తాను. నాపై హత్యానేరం నమోదైనా ఏమాత్రం వెనుకాడబోను...అని యశ్‌పాల్‌ సింగ్‌ అన్నారు

ఏచూరిని ఆహ్వానించిన నేపాల్‌ ప్రధాని..

భారత్‌, నేపాల్‌ సంబంధాలపై నేపాల్‌ ప్రధానితో ఏచూరి చర్చించారు. రెండు దేశాల మధ్య మైత్రీ బంధం మరింత బలపడాలని కోరినట్లు చెప్పారు. గతంలో నేపాల్‌ రాజ్యాంగ సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితుల నుంచి మళ్ళీ యథాతథస్థితికి చేరుకోవడానికి సిపిఎం జోక్యంతోనే జరిగిందన్న అంశం చర్చకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంలో నేపాల్‌కు రావాల్సిందిగా ఏచూరిని నేపాల్‌ ప్రధాని కోరారు. 

Pages

Subscribe to RSS - February