July

ఆఫ్రికా దేశాల పర్యటనకు ప్రధాని..

 ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడమే ధ్యేయంగా ఐదురోజుల ఆఫ్రికా పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణం కానున్నారు. జులై 7 నుంచి 11వరకు మొజాంబిక్‌, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యాలలో పర్యటిస్తారు.

రవాణా రంగాన్ని ప్రయివేటుపరం..

రోడ్డు రవాణా, భద్రత ముసాయిదా బిల్లు (2015) లక్ష్యం మోటార్‌ రవాణా రంగాన్ని మొత్తంగా ప్రయివేటుపరం చేయడమేనని కేంద్ర కార్మిక సంఘాలు ఆరోపించాయి. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును వ్రవేశపెట్టాలని కొందరు ఎంపీలు లేఖ రాయడం ఆశ్చర్యకరమని సీఐటీయూ, అఖిల భారత రోడ్డు రవాణా కార్మిక సమాఖ్య (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌)లు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

ఏచూరికి 'రామచంద్రన్‌' అవార్డు

 ప్రజాసేవలో విశేష కృషికి గాను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని 'ఎన్‌. రామచంద్రన్‌ స్మారక అవార్డు'తో సత్కరించారు. కేరళకు చెందిన ప్రఖ్యాత పాత్రికేయుడు ఎన్‌. రామచంద్రన్‌ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎన్‌. రామచంద్రన్‌ పౌండేషన్‌ను ఏర్పాటు చేశారు.

జన్‌ధన్‌ తరహాలోఎపి సొంతబీమా

దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తిరపు కార్డులు ఇవ్వాలన్న ఆధార్‌ విధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం లేనట్టు కనిపిస్తోరది. అరదుకే సొరతంగా అరదరికీ ఒక నంబర్‌ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం యూనిక్‌ ఐడెరటిటీ ఫర్‌ రెసిడెరట్స్‌ పేరిట ఒక విధానాన్ని ప్రకటిరచిరది. దీనిపై ప్రత్యేక సర్వే కూడా నిర్వహిరచాలని నిర్ణయిరచిరది. అలాగే కేదద్రం అమలు చేస్తున్న జన్‌ధన్‌ యోజన పథకానికి దీటుగా రాష్ట్రంలోకూడా మరో బీమా పథకానికి సమాలోచనలు చేస్తోరది. దీనికోసం ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయి.

హోదా రాదని బాబుకూ తెలుసు

ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం నాయకుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆ హోదా రాదని, చంద్రబాబు సహా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెలేలందరికీ ముందే తెలిసినా ప్రజలను నమ్మించేందుకు ప్రయత్ని స్తున్నారని అనంతపురం ఎంపీ జె.సి.దివాకరరెడ్డి అభిప్రాయ పడ్డారు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశం సందర్భంగా శనివారం విజయవాడ వచ్చిన ఎంపీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దివాకరరెడ్డి మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడు ఒకవిధంగా, ఉనప్పుడు మరో విధంగా మాట్లాడటం సరికాదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

క్రిడా కార్యాలయం ముట్టడి

కౌలు చెక్కులివ్వాలని డిమాండ్‌ చేస్తూ అసైన్డ్‌, సీలింగ్‌ భూముల రైతులు తుళ్ళూరు క్రిడా కార్యాలయాన్ని ముట్టడించారు. లైబ్రరీ సెంటర్‌ నుండి ర్యాలీ నిర్వహించి క్రిడా కార్యాలయం ఎదుట గంటకు పైగా బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పేద వ్యవసాయ కూలీలకు రూ. 2,500 పింఛన్‌, అసైన్డ్‌, సీలింగ్‌ భూముల రైతులకు కౌలు చెక్కులివ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్రిడా ప్రాంత సిపిఎం కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు, సిపిఎం డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఎం.రవి, నాయకులు జొన్నకూటి వీర్లంకయ్య, నవీన్‌ప్రకాష్‌ ఆందోళనకు మద్దతు తెలిపారు.

ర్యాగింగ్‌పైరగిలినవిద్యార్థులు

నాగార్జున యూనివర్సిటి బిఆర్క్‌ విద్యార్థిని రిషితేశ్వరి మృ తికి కారకులైన దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని, సిట్టింగ్‌ జడ్జితో ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘ నేతలు రోడ్డెక్కారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చం ద్రబాబు స్పందించి బాధ్యులైన వారిని అరెస్టు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు,అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులకు మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకొన్నాయి.

ప్ర‌త్యేక హోదా కై ఉద్య‌మం...సిపిఎం రాష్ట్ర క‌మిటి

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర మంత్రి ఈ రోజు లోక్‌సభలో ప్రకటించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్రకమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.
రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బ్లిుపై చర్చ సందర్భంగా ఆ నాటి ప్రధాని చేసిన ప్రకటన, నాటి ప్రతిపక్ష పార్టీ నాయకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాని రాష్ట్రకమిటి డిమాండ్‌ చేస్తున్నది.

Pages

Subscribe to RSS - July