July

' మన్‌ కీ బాత్‌ ' మహామాయ

 ప్రజలందరూ తనను దేశ ప్రధానిగా చేశారని, తనలోని సాధారణ మనిషి లక్షణాల వల్ల కొన్నిసార్లు ప్రజల్లో ఒక్కడై పోతానని ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారు. 60 ఏళ్ళలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలో పూర్తి చేస్తామనడానికి ఎంతో ధైర్యం కావాలని గత నెల 28న ఆకాశవాణి ద్వారా ప్రచారమయ్యే మన్‌ కీ బాత్‌ (మనసులో మాట) కార్యక్రమంలో అన్నారు. తనను తానే గొప్పవాడిగా పొగుడుకునే వారికి ఎవరైనా పోటీలు నిర్వహిస్తే ప్రపంచంలో మోడీకి ప్రథమ బహుమతి లభించవచ్చు. మనసులో మాట కార్యక్రమంలో మాట్లాడుతూ బేటీ బచావో, బేటీ పఢావో (బాలికను కాపాడండి, చదివించండి) అంటూ బాలికలను రక్షించడానికి ప్రచారం చేయలన్నారు.

ఉత్తి మాటలతో విద్యరాదు

రాజమండ్రిలో 2015 జులై 22న జరిగిన ప్రాంతీయ విద్యా సదస్సులో మీరు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాభివృద్ధికి పలు నిర్ణయాలు, ఆదేశాలు జారీ చేశారు. సంతోషం. రాష్ట్ర అభివృద్ధికి విద్యాభివృద్ధి ఎంతో కీలకం. నేడు మన రాష్ట్రంలో అక్షరాస్యత 67.41 శాతం మాత్రమే ఉంది. రాష్ట్ర సగటు కంటే ఆరు జిల్లాలు, దేశ సగటు అక్షరాస్యత (74.04 శాతం) కంటే 12 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో 60 శాతం కూడా లేదు. రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించాలన్నారు. సుమారు 60 ఏళ్ళలో సాధించలేనిది నాలుగు సంవత్సరాలలో సాధించడం సాధ్యమా? దానికి తగిన ప్రణాళిక ఏది? నిధులు ఏవి?

ఒక తప్పును కప్పిపుచ్చడానికి...

 తప్పు జరిగినప్పుడు ఒప్పుకుంటే ఆ ఒక్క తప్పుకే పరిమితం కావొచ్చు. అదే తప్పును కప్పిపుచ్చుకోవాలనుకొంటే మాత్రం తప్పు మీద తప్పు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం మన రాష్ట్రప్రభుత్వం ఆ రెండవ పనిలో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నది. గోదావరి పుష్కరాల తొలిరోజున జరిగిన తొక్కిసలాటలో 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులు-అన్నీ తానై పుష్కర ఏర్పాట్లు చూసిన సిఎం, ఆయన మంత్రివర్గ అనుచరులు కాదట! వి.వి.ఐ.పిలు, వి.ఐ.పిల సేవలో తరిస్తూ ప్రజా భద్రతను, బాధ్యతను గాలికి వదిలిన అధికారులూ కాదట! పుష్కర ఘాట్‌లో వ్యాపించిన ఒకానొక వదంతి కారణంగా ఆ ఘోరం జరిగిందట.

బిసి సబ్‌ప్లాన్‌ ఎందుకు?

అన్ని స్థాయిల్లోని నిర్ణాయక స్థానాల్లో, ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న అన్ని వ్యవస్థల్లో, సంపద, మౌలికరంగాలపై ఆధిపత్యంలో బిసిలు పూర్తిగా అధమస్థానంలోకి నెట్టబడ్డారు. ఇప్పటికీ ఉత్పాదకను అందిస్తూ అత్యధిక స్వయం ఉపాధితో దేశ అభివృద్ధికి బిసిలు తోడ్పడుతున్నారు. దానికి తోడు చట్టసభల్లో కేవలం 18 శాతం స్థానాలు, పాలనా వ్యవస్థ లోని పై స్థాయి ఉద్యోగుల్లో 8 శాతం, న్యాయశాఖలో 6 శాతం, దేశంలోని అతిపెద్ద వెయ్యి కంపెనీల్లోని నిర్వహణా బోర్డులలో 3 శాతం కన్నా తక్కువ భాగస్వామ్యానికి పరిమితమయ్యారు. 

కాలుదువ్వితే దీటైన జవాబిస్తాం

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్‌లో భీకర దాడికి పాల్పడి ఎస్పీ సహా ఏడుగురిని కాల్చిచంపడంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో స్పందించారు. పాకిస్తాన్‌తో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని, అయితే భారతదేశ ప్రతిష్ఠను సవాలు చేస్తే పాక్‌కు గట్టిగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. సిఆర్‌పిఎఫ్ 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, పాక్‌తో భారత్ సత్సంబంధాలను కోరుకుంటున్నప్పటికీ ఇటువంటి సీమాంతర తీవ్రవాద ఘటనలు పదే పదే ఎందుకు కొనసాగుతున్నాయో అర్థం కావడం లేదన్నారు.

కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం

తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడున్నర వేల మంది కార్మికులను అరెస్టు చేశారు. పలుచోట్ల లాఠీఛార్జీలు జరిపారు. విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావుసహా పలువురు వామపక్ష నేతలు సొమ్మసిల్లి పడిపోయారు. పిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామ కృష్ణ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబలేసు సహా వేలాది మందిని అరెస్టు చేశారు.

MPఅసదుద్దీన్‌పై క్రిమినల్‌కేసు..

రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న ఎంపీ అసదుద్దీన్‌పై క్రిమినల్‌ కే సు నమోదు చేయాలని వీహెచ్‌పీ నేత రామరాజు డిమాండ్‌ చేశారు. తెలుగు రాష్ర్టాల్లో పుష్కరాల పేరుతో రూ.11 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. పుష్కరాల్లో తెలుగు రాష్ర్టాలు ఖర్చు పెట్టిన నిధులతపై శ్వేత పత్రం విడుదల చేయాలని రామరాజు కోరారు.

ఏపీకి 2వేల కోట్ల నష్టం

అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలైతే మరింత కష్టకాలం తప్పదు. తెలంగాణలో మందుబాబులకు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అక్కడి సర్కార్‌ కసరత్తు మొదలుపెట్టింది. ఈ విధానం అమల్లోకి వచ్చి.. సారా ప్యాకెట్ల(సాచెట్లు) తరహాలో చీప్‌లిక్కర్‌ మద్యం దుకాణాల్లోకి ప్రవేశిస్తే.. ఏపీ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ఆందోళన చెందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఏపీకి చెందిన ప్రధానమైన ఐదు జిల్లాల్లో తెలంగాణ చీప్‌లిక్కర్‌ ఏరులై పారనుంది.

రైతు ఉసురు తీస్తున్న ఆధార్‌

ఆధార్‌ కార్డులు రైతుల ఉసురు తీస్తున్నాయి. రైతులకు అమలు చేస్తున్న అన్ని పథకాలకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం అన్నదాతలకు గుదిబండగా మారింది. రుణ మాఫీ మొదలుకొని విపత్తు సాయం వరకు ఏ లబ్ధి పొందాలన్నా ఆధార్‌నే అర్హత చేసింది సర్కారు. దీంతో అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ కేవలం ఆధార్‌ లేని కారణంగా లక్షలాది మంది రైతులు ప్రభుత్వ సాయానికి దూరవుతున్నారు. ఆధార్‌ లేని వారే కాకుండా సాంకేతిక కారణాలతో ఆధార్‌ నెంబర్‌ ఉన్నా సాఫ్ట్‌వేర్‌లో మ్యాచ్‌కాని వారు సైతం ప్రభుత్వ లబ్ధి పొందలేకపోతున్నారు.

Pages

Subscribe to RSS - July