July

స్మృతి తొందరపాటు నిర్ణయాలే కారణమా

దేశ వ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమాలు చెలరేగడానికి ఆమె తొందరపాటు నిర్ణయాలు కారణమయ్యాయని బీజీపీ అధిష్టానం గుర్తించడంతోనే ఆమె శాఖపై వేటు పడింది. ముఖ్యంగా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల్లో అలజడికి ఆమె తీసుకున్న నిర్ణయాలే కారణమన్న విషయం తెల్సిందే.

బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు..?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు విడతలుగా భేటీ అయ్యారు. కోర్ కమిటీ భేటీ తర్వాత అమిత్ షా తన ఛాంబర్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. సమావేశం తర్వాత ఓ సీనియర్ నేత అసంతృప్తితో వెళ్లిపోయారని సమాచారం. ఈ కీలక సమావేశానికి మంత్రి కామినేని శ్రీనివాస్ ను పార్టీ హైకమాండ్ ఆహ్వానించకుండా దూరంగా ఉంచింది. 

బిజెపితో సర్దుకు పోవాల్సిందే:బాబు

ఆలయాల కూల్చివేత వ్యవహారంతో పాటు పలు అంశాల్లో బీజేపీ నేతలు ప్రభుత్వ ప్రతిష్ట దిగజారేలా వ్యవహరిస్తున్నారని టీడీపీి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.బీజేపీ నేతల పోకడలతో పార్టీకి, ప్రభుత్వానికీ చెడ్డ పేరు వస్తోందని ముఖ్యమంత్రి దృష్టికి నాయకులు తీసుకెళ్లగా, ప్రస్తుత పరిస్థితుల్లో సర్దుకుపోవాలని ఆయన సూచించినట్లు సమాచారం.

హార్ధిక పటేల్‌ ఆరు నెలల బ‌హిష్క‌ర‌ణ‌

పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఆందోళన సందర్భంగా హింస తలెత్తిన కేసులో హార్ధిక పటేల్‌కు బెయిల్ లభించింది. రాష్ట్రానికి దూరంగా ఆరు నెలల పాటు ఉండాలనే కండీషన్‌పైన గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఏపీలో ప్రజాసాధికార సర్వే..

 ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజాసాధికార సర్వేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం తన నివాసం నుంచి లాంఛనంగా ప్రారంభించారు.దాదాపు 30వేల మందితో ఆరు వారాలపాటు సర్వే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ సర్వే ద్వారా పౌరులకు సంబంధించి వివిధ శాఖల్లో ఉన్న సమాచారాన్నంతా ఒక చోటకి తీసుకురావడంతో పాటు ప్రతి ఒక్కరికి సంబంధించిన కుల, మత, ప్రాంత, సామాజిక, ఆర్థిక పరమైన అంశాలు సర్కారు వద్ద సమగ్రంగా నమోదు కానున్నాయి.

గుజరాత్‌లో పట్టు కోసం కేజ్రివాల్‌

గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంత రైతులను జులై 9న కలవనున్నారు.

రాజధాని భూములు ప్రైవేటు వర్సిటీలకు

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలో 15 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిలో ప్రధానంగా మూడు ప్రైవేటు యూనివర్సిటీలు ఉ‍న్నాయి. ఎస్ఆర్ఎం, విట్, అమిటీ యూనివర్సిటీలు తమ క్యాంపస్లను అమరావతిలో నెలకొల్పడానికి వీలుగా వాటికి భూములను కేటాయించారు.

కొవ్వాడ అణువిద్యుత్ కు వ్యతిరేకంగా

శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో నిర్మించనున్న అణు పార్కుతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లనుందని సిపి ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు తెలి పారు.  సైట్‌ సెలక్షన్‌ కమిటీ నిర్ణ యం చేయకుండా రైతుల నుంచి భూములు తీసుకునే అది ప్ర‌కారం ప్రభుత్వానికి లేదన్నారు. గుజరాత్‌లోని మితివిర్ధిలో నిర్మించాల్సిన అణుపార్కును కొవ్వాడకు తరలిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం జూన్‌ నాలుగున ప్రకటించిందని, మోడీ-ఒబామా ఒప్పందం జూన్‌ ఏడున జరిగిందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందా? లేదా? అనేది చెప్పడం లేదని తెలిపారు. టిడిపి తక్షణమే తన వైఖరిని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

రోహిత్‌ చట్టంపై జేఎన్‌యూలో సదస్సు

 ఈ నెల 15, 16 తేదీలలో క్యాంపస్‌లో విద్యార్థి సంఘం ఆధర్వంలో నిర్వహించబోయే సదస్సులో దేశవ్యాప్తంగా 35కు పైగా యూనివర్సిటీల నుంచి విద్యార్థులు, కార్యకర్తలు దీనికి హాజరవబోతున్నారు. జేఎన్‌యూ విద్యార్థి నేతలు 'రోహిత్‌ చట్టం' కోసం దేశవ్యాప్త సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Pages

Subscribe to RSS - July