July

రాజకీయాల కోసమే దళితుల విభజన

రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను విభజించే కుట్రలు పన్నుతున్నార ని మాల మహానాడు మండిపడింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాల మహానాడు చేపట్టిన నిరసన కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అనేది సుప్రీం కోర్టు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల తీర్పులకు విరుద్ధమన్నారు.

కనీస వేతనాల చట్టాన్నిసవరించండి

రాష్ట్రంలో తక్షణమే కనీస వేతనాల సలహా మండలిని ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు. పదేళ్లుగా కనీస వేతనాల చట్టాన్ని సవరించలేదన్నారు. దీంతో ప్రతి నెలా కార్మికులు రూ.500 కోట్లు నష్ట పోతున్నట్లు తెలిపారు. 65 షెడ్యూల్స్‌లోని కార్మికులు, అంగన్‌వాడీ వర్కర్లు, విఆర్‌ఎ, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంఎ గఫూర్‌ విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును గురువారం కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. 

గుజరాత్‌ నమూనాపై జాతీయ సదస్సులో విమర్శలు..

అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్‌ విధానాల ఫలితంగానే గుజరాత్‌ నమూనా రూపుదిద్దుకుందని భూమి అధికార్‌ ఆందోళన్‌ పేర్కొంది. గత మూడు రోజులుగా ఇక్కడ సాగుతున్న భూమి అధికార్‌ ఆందోళన్‌ జాతీయ సదస్సులో భాగంగా గుజరాత్‌ అభివృద్ధి నమూనాను బట్టబయలు చేసేందుకు ప్రత్యేక సమావేశం జరిగింది. గత 17 ఏండ్లుగా రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో అమలు జరుగుతున్న అభివృద్ధి విధానాల చీకటి పార్శ్వాలను ఈ సమావేశం ప్రముఖంగా ప్రస్తావించింది. రైతుల, కార్మికుల, ఆదివాసీల, దళితుల హక్కులను కాలరాస్తూ ఈ గుజరాత్‌ నమూనా ఆవిర్భవించిందని సమావేశంలో వక్తలు స్పష్టంచేశారు.

ఎంపీలకు రెట్టింపు వేతనాలు..!

కేంద్ర మంత్రుల బృందం సిఫారసులకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపితే ఎంపీల జీతాలు 100 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.50 వేలు వేతనంగా ఇస్తున్న మొత్తాన్ని రూ.లక్షకు పెంచాలని మం త్రుల బృందం తమ ప్రతిపాదనలను క్యాబినెట్‌కు నివేదిం చింది. వేతనాలపై గతంలో నియమించిన ఎంపీల కమిటీ సిఫారసులకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. ఇక ప్రధాని మోడీ కూడా అంగీకరిస్తే ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందే అవకాశ మున్నది.

బీజేపీ పాలనలో దళితులపై దాడులు..

కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత దళితులపై దాడులు తీవ్రమయ్యాయని బీఎస్పీ అధినేత్రి, ఎంపీ మయావతి ఆరోపించారు. గుజరాత్‌లోని యునా పట్టణంలో దళిత యువకులపై జరిగిన పాశవిక దాడి ఘటనను ఆమె రాజ్యసభలో సోమవారం లేవనెత్తారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి, మయావతికి స్వల్ప వాగ్వాదం జరిగింది. రాజ్య సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన తరువాత చైర్మన్‌ అనుమతితో ఈ అంశంపై మాయవతి మాట్లాడారు. 

పెల్లెట్‌ గన్స్‌ వాడకం ఆపండి : సీపీఐ

కాశ్మీర్‌లో నెలకొన్న అశాంతిపై పీడీపీ-బీజేపీ కూటమి మౌనం సహించరానిదని సీపీఐ విమర్శించింది. రాష్ట్రంలో మామూలు పరిస్థితులు నెలకొల్పడానికి తక్షణం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ జాతీయ సమితి ఒక తీర్మానంలో డిమాండ్‌ చేసింది.కాశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు దెబ్బతినిపోవడానికి కారణం పీడీపీ-బీజేపీ కూటమేనని సీపీఐ ఆరోపించింది.పెల్లెట్‌ గన్స్‌ వాడకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసింది.

కాశ్మీర్‌ ఘటనపై అఖిలపక్షం వేయాలి:ఏచూరి

కాశ్మీర్‌ అంశంపై చర్చ జరపాలని నోటీసులు ఇచ్చిన ఏచూరి తొలుత మాట్లాడుతూ... కాశ్మీర్‌ ప్రజలకు ప్రస్తుతం డాక్టర్లు అత్యవసరం కానీ రక్షణ దళాలు కాదని అన్నారు. అధిక రక్షణ దళాలను ఉపయోగించడం వల్ల పరిస్థితిని ఏమైనా అదుపులోకి తీసుకొచ్చామా అని ప్రశ్నించారు. పాకిస్తాన్‌ ఏమైనా కుట్రలు పన్నితే.. దాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టండి. అంతే తప్ప ఈ పేరుతో అమాయక కాశ్మీరీలను భయబ్రాంతులకు గురిచేయవద్దని కోరారు. కాశ్మీర్‌ అంశంపై అఖిల పక్షం వేయాలని డిమాండు చేశారు. 

Pages

Subscribe to RSS - July