July

రాహుల్‌ పాదయాత్రకు అడ్డంకి

నేడు అనంతపురం ఓబులదేవరచెరువు నుంచి రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో టిడిపి కార్యకర్తలు నిరసన తెలిపారు. పాదయాత్రలో భాగంగా రాహుల్‌ మామిళకుంటపల్లి, దేబురాపల్లి, కొండకమర్లలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. రాహుల్‌గాంధీ పర్యటనపై చంద్రదండు ఆందోళన చేసింది. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు దగ్గర చంద్రదండు కార్యకర్తలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దీంతో చంద్రదండు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పీఆర్‌సీ చెల్లింపులలో దోపిడీ

రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ ప్రకటించిందని ఉద్యోగులు సందడి చేసుకుంటుంటే... ఆ చెల్లింపుల మాటున ట్రెజరీ ఉద్యోగులు పెద్ద ఎత్తున దోపిడీకి తెరతీశారు. ప్రతి ఉద్యోగి నుంచీ అధికారికంగా రూ. 500 మామూళ్లు వసూ లు చేస్తున్నారు. ‘ప్రభుత్వం పదో పీఆర్‌సీలో 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు ఉద్యోగుల బేసిక్‌ రెట్టింపు అవుతుంది. అటువంటప్పుడు మాకు రూ.500 ఇవ్వడం పెద్ద లెక్క కాదు’ అని ట్రెజరీ ఉద్యోగులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కొత్త కాదని, ప్రతి కొత్త పీఆర్‌సీకి ఈ తరహా ప్రత్యేక బాదుడు మామూలేనని ఉద్యోగులు వాపోతున్నారు.

ఆదర్శ పాఠశాలల అసలు నిజాలు

''ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజాస్వామిక ప్రభు త్వాలు విద్యారంగం మీద సామాజిక అభివృద్ధి దృక్పథంతో పెట్టుబడులు పెట్టినప్పుడే నిరక్షరాస్యతా మహమ్మారిని పారద్రోలగలమని, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని సెనెగల్‌ రాజధాని డాకర్‌లో 2000లో జరిగిన ప్రపంచ విద్యా సదస్సు తీర్మానించింది.'' తీర్మానాన్ని మన దేశం కూడా ఆమోదించింది. కానీ నేడు మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అపసవ్య విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి దాపురిస్తోంది. ప్రత్యేకించి మన రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

సీఎం వ్యాఖ్యలు అభ్యంతరకరం:మధు

విజయవాడ:సింగపూర్‌ ఇంజనీర్లు తయారుచేసిన రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీర్లు తయారు చేయలేరన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఇక్కడి ఇంజనీర్లను అవమానించారన్న మధు.. ఈ ముఖ్యమంత్రికన్నా సింగపూర్‌ మంత్రులే మేలన్న విషయాన్ని చంద్రబాబే పరోక్షంగా ప్రకటించినట్లు అయిందని ఎద్దేవా చేశారు.

రెండంకెల వృద్ధి సాధ్యమా..!

రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖా మంత్రి వ్యవసాయంలో రెండంకెల అభివృద్ధి (డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌) సాధిస్తామనీ, దానికోసం అన్ని ఏర్పాట్లూ చేశామనీ ప్రచార హోరు మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హడావుడి చూస్తే 'ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు' ఉంది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిని అరికట్టలేని ప్రభుత్వం మరి రెండంకెల ప్రగతి గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? గడిచిన దశాబ ్దకాలంలో కనీసం 4 శాతం వృద్ధి రేటు సాధించలేక పోయాము. ఇప్పుడు ఏకంగా రెండంకెల ప్రగతి సాధిస్తామని చెబుతున్నారు.

జంషెడ్‌పూర్‌ మత ఉద్రిక్తతలపై సిపిఎం ఆందోళన

 రాంచి : ఉక్కు నగరమైన జంషెడ్‌పూర్‌లో తలెత్తిన మత ఉద్రిక్తతలపై సిపిఎం జార్ఖండ్‌ రాష్ట్ర కార్యదర్శివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలోని మాంగో ఏరియాలో శాంతి భద్రతలకు సంబంధించిన ఒక సంఘటన వల్ల మత ఉద్రిక్తత నెలకొందని పేర్కొంది. బిజెపికి చెందిన మతోన్మాద సంస్థలు నగరమంతటా మత సామరస్యతను దెబ్బ తీస్తున్నాయని, ఆ సంస్థల నేరపూరితమైన, రెచ్చ గొట్టే కార్యకలాపాల వల్ల పరిస్థితి చాలా తీవ్రంగా మారుతోందని పేర్కొంది. దీనిపై మౌనంగా ఉండడం ద్వారా ప్రభుత్వం ఆ శక్తులను పరోక్షంగా ప్రోత్సహి స్తున్నట్లు వుందని పేర్కొంది. 
 

చతికిలపడుతున్న చిన్నపరిశ్రమల రంగం

పారిశ్రామికాభివృద్ధిలో పెద్ద పాత్ర పోషించే చిన్న పరిశ్రమల పరిస్థితి నయా ఉదారవాద విధానాల యుగంలో పరమ అధ్వానంగా తయారైందని ఎంతమంది మొత్తుకున్నా పెడ చెవిన పెట్టిన పాలకులకు సరికొత్త సర్వేలు కళ్ళు తెరిపిస్తాయి అనుకోవాలి. చాలా పరిశ్రమలు ఇప్పటికే దివాళా తీయగా, మరి కొన్ని ఈసురోమంటూ మూతపడే దిశలో వున్నాయి. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మేక్‌ ఇన్‌ ఇండియా ఆచరణలో సేల్‌ ఇన్‌ ఇండియాగా మారిపోయింది.

చనిపోతాం..అనుమతించండి..!

‘మా ఆత్మ గౌరవాన్నయినా పునరుద్ధరించండి.. లేదా మమ్మల్ని చనిపోవడానికైనా అనుమతించండి’ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఈ అప్పీల్ చేసింది ఎవరోకాదు. మధ్యప్రదేశ్‌ను కుదిపేస్తున్న వ్యాపం కుంభకోణం బాధిత విద్యార్థులు. ప్రీమెడికల్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన ఐదుగురు విద్యార్థులపై అనేక రకాలుగా ఛీటింగ్ ఆరోపణలు రావడంతో ఈ భావోద్వేగపూరిత అప్పీల్ చేశారు. తాము స్వీయ ప్రతిభతో ప్రవేశ పరీక్షల్లో పాస్ అయినప్పటికీ అక్రమ మార్గంలోనే అడ్మిషన్లు సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపారు.

Pages

Subscribe to RSS - July