July

ఆగస్టు 1 నుండి 14 వరకు సి పి యం ఆధ్వర్యంలొ జరిగే రాజకీయ ప్రచార కార్యాక్రమాన్ని జయప్రధం చేయండి:- జిల్లా కార్యధర్శి పాశం రామారావు

సి పి యం కేంద్రకమిటీ పిలుపులొ మేరకు జిల్లాలో వివిధ అంశాలపై ప్రత్యామ్నాయా విధానలను ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో బి జె పి రాష్ట్రంలో టి డి పి పార్టీలు ఆధీకారంలొకి రావడనికి అవినీతిలేని స్వచ్చమైన పరిపాలన అందిస్తామని, దేశన్ని అభివృద్ది పధంలో నడిపిస్తామని వాగ్ధానం చేశారు. కాని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవినీతి కుంభకోణాలలో మునిగిపొయారు. లలీతమొడికి వీసాకి సాహయం చేయటంలొ,వ్యాపం కుంభకోణంలో బి జె పి పాత్ర ఉంది. రాష్ట్రంలో ఇసుక, వొటుకు-నొటు వంటి పలు అవినీతి కర్యాక్రమాలలో తి డి పి కురుకుపొయింది.

లలిత్‌మోదీపై రాజ్యసభలోగందరగోళం

లలిత్‌ మోదీ వ్యవహారంపై రాజ్యసభలో గందరగోళం నెలకొనడంతో సభ అరగంట వాయిదా పడింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే లలిత్‌మోదీ విషయమై చర్చకు కాంగ్రెస్‌ పట్టుబట్టింది. వీసా వివాదంపై చర్చకు సిద్ధమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేసినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ సభను వాయిదా వేశారు.

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, విపక్ష నేతలు సమావేశాలకు హాజరయ్యారు. లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, ఇటీవల వరంగల్ ఎంపీ స్థానానికి కడియం శ్రీహరి చేసిన రాజీనామాను ఆమోదించినట్టు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడంతో కడియం ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

వ్యాపంపై ఫిర్యాదుచేస్తే బదిలీ

బిజెపి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి విక్రమ్‌ వర్మ మీద సిబిఐకి ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే ప్రభుత్వ వైద్యుడు ఆనంద్‌ రారుని ఇండోర్‌ నుంచి ధార్‌ జిల్లాకు బదిలీ చేశారు. ఘజియాబాద్‌లోని సంతోష్‌ మెడికల్‌ కాలేజిలో ఎంబిబిఎస్‌ సీటు వచ్చిన కుమార్తెను విక్రమ్‌ వర్మ తన పలుకు బడిని ఉపయోగించి భోపాల్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజికి బదిలీ చేయించుకున్నారని ఆరోపిస్తూ రారు సిబిఐ ముందు ఒక ఫిర్యా దు దాఖలు చేశారు. ఇండోర్‌లోని ఆరోగ్య శాఖకు చెందిన ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు డెప్యుటేషన్‌ మీద వచ్చిన ఆయన్ని ఆదివారం బదిలీ చేశారు..

ఆత్మహత్యల 'భారతం'

 భాతదేశాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతల్లో ఆత్మహత్యలు ప్రధానంగా ముందుకు రావడం ఆందోళన కలిగించే విషయం. పలు కారణాలతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారు సంవత్సరానికి లక్షకు మించి పోవడం కలచివేసే అంశం. కొన్నేళ్లుగా ఆత్మహత్యల పరంపర కొనసాగడంపై ఏలికలు తేలిగ్గా తీసుకోవడం దారుణం. ఏదైనా ప్రమాదంలోనో, హఠాత్తుగా సంభవించే అనారోగ్యంతోనో చనిపోతే అర్థం చేసుకోవచ్చు. కానీ జీవితంలో సమస్యలు ఎదుర్కోలేక కుంగిపోయి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం బాధాకరం కాగా, అలాంటి వారు వేలు దాటి లక్షలకు చేరడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.

Pages

Subscribe to RSS - July