July

ఈనెల24న రాహుల్ పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 24న పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓడిసి నుండి కొండకమర్ల వరకు ఐదు గ్రామాల్లో పది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని ఏపిపిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. రఘువీరారెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ పక్షం నాయకుడు సి.రామచంద్రయ్య, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర్‌రావు, జెడి శీలం ఈరోజు ఉదయం రాహుల్ గాంధీతో సమావేశమై ఆయన అనంతపురం జిల్లా పర్యటన గురించి చర్చించారు. రాహుల్ గాంధీ అదేరోజు డబురవాలి పల్లిలో మహిళా డ్వాక్రా సంఘాలతో సమావేశమై మహిళల సమస్యలపై చర్చిస్తారన్నారు.

ఇరకాటంలో మోడీ ప్రభుత్వం

వివాదాస్పద భూ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు నీతి ఆయోగ్‌ పాలనా నిర్వాహక మండలి సమావేశాన్ని ఒక వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ఉపయోగించుకున్నారు. ఈ విష యాన్ని ముందే గ్రహించిన తొమ్మిది మంది కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు బుధవారం నాటి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటిం చారు. ఈ తొమ్మిది మంది కాంగ్రెస్‌ సిఎంలతో సహా 12 మంది ముఖ్యమంత్రులు ఈ సమావే శానికి గైర్హాజరయ్యారు. గైర్హాజరైన కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల్లో తమిళనాడు, బెంగాల్‌, ఒడిషా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వున్నారు.

వాణిజ్య కేంద్రంగా అమరావతి

ఆసియా వాణిజ్య కేంద్రంగా అమరావతి మారనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. జపాన్‌లో వ్యాపారవేత్తల బృందం, ప్రభుత్వ ప్రతినిధులూ వాణిజ్య కేంద్రాల రాజధానిగా అమరావతి రూపుదిద్దుకునే అవకాశ ముందని చెప్పినట్లు తెలిసింది. తమ రాజధాని కంటే అధునాతనమైన, ఉత్తమమైన రాజధానిని ఏర్పాటు చేసేందుకూ అవకాశాలున్నాయని జపాన్‌ ప్రతినిధులు తెలిపారని క్రిడా కమిషనర్‌ ఎన్‌.శ్రీకాంత్‌ చెబుతున్నారు. మాస్టర్‌ ప్లానొచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలుపెట్టేందుకు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు జపాన్‌ సంస్థలు ఉత్సాహంగా ఉన్నాయని తెలిపారు.

విషకౌగిలి

ఆరెసెస్ దాని రాజకీయ పక్షమైన బిజెపి గురించి ఎన్నో రహస్యాలు ఎన్నో వాస్తవాలు విషకౌగిలో బహిర్గతమయ్యాయి.. 1991 లో జరిగిన ఎల్ కె అద్వాని రామ్ రధ యాత్ర ఎలా మత విద్వేషాలను రెచ్చగొట్టి 1992 డిసెంబర్ అయోధ్యలో బాబ్రీ మసీదు విద్వంసానికి దారి తీసిందో "రామ్ కె నామ్" చూపెట్టగా అదేకాలంలో రచించబడ్డ "విషకౌగిలి" ఆ విద్వంసకారుల శిక్షణ సంస్థను బట్టబయలు చేసింది .. ఆరెసెస్ లో దశాబ్ద కాలం పాటు ముఖ్య కార్యకర్తగా పనిచేసిన వేయిరేకుల పద్మంలోంచి ఒక్కొక్క బ్రాంతి దళం రాలిపోతుండగా మతోన్మాద కౌగిలి నుండి మానవత్వం వొడిలోకి ప్రస్థానం చేసిన " విశ్వం " కె ఇది సాధ్యం.. 

మరో 'థర్మల్‌' కుంపటి

 'మాకొద్దీ తెల్లదొరతనం/ దేవా, మా ప్రాణాలను త్రుంచి/మా మానాలను హరియించే/మాకొద్దీ తెల్ల దొరతనం' అన్న ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ పుట్టిన గడ్డ మీదే జపాన్‌ కంపెనీ సుమిటోమి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. సిక్కోలు భూమి, ఆస్ట్రేలియా బొగ్గు, జపాన్‌ వారి శాస్త్ర సాంకేతికతతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలను అభివృద్ధి చేస్తుందట! ఇప్పటికే సోంపేట, కాకరాపల్లిలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో గత ప్రభుత్వం ముగ్గురేసి చొప్పున ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. అయినా, పాలకులు వెనక్కి తగ్గడం లేదు.

ఆగస్టు1నుంచి14 వరకు పట్టణ సమస్యలపై ఆందోళనలు: సిపిఎం

పట్టణ సమస్యలపై రాష్ట్రంలోని మున్సిపల్‌ పట్టణాల్లో ఆందోళనలు నిర్వహిం చాలని సిపిఎం రాష్ట్రకమిటీ నిర్ణయించింది. సిపిఎం పట్టణ బాధ్యుల రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఆగస్టు 1 నుంచి 14 వరకు పట్ట ణ సమస్యలపై క్యాంపెయిన్‌లు, ఆందోళనలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణ యించింది. ఈ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి పి మధు హాజరయ్యారు. పట్టణ సమస్యలపై పోరాడాల్సిన అవశ్యకతను ఆయన వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న మెగాసిటీలు, స్మార్ట్‌సిటీలు, అమృత్‌ పట్టణాలు అన్నీ కూడా పట్టణాల్లో మౌలిక సదుపాయాలను ప్రైవేటీకరింటి వ్యాపారమయం చేయ డం కోసం ఉద్దేశించినవేనని చెప్పారు.

విజయవాడలో ఉద్రిక్తత

విజయవాడ రాజీవ్‌నగర్‌ కరకట్ట ప్రాంతంలోని పేదల గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమాన్ని బాధితులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఓ వృద్ధురాలు వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానిక కార్పొరేటర్‌ పైడి తులసి తమను నట్టేట ముంచారని బాధితులు కంటతడిపెట్టారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు పునరావాసం కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు సిపిఎం నాయకులు మద్దతుగా నిలబడ్డారు. పేదల పక్షాన నిలబడి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీశారు. దీంతో 200 మందికిపైగా ఉన్న పోలీసు బలగాలు మొహరించి అడ్డువచ్చిన సిపిఎం నేతలను, స్థానిక మహిళలను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషిచేయాలి:కృష్ణయ్య

పెట్టుబడిదారుల దోపిడీ వల్లే కొన్ని ప్రాంతాలు వెనుకబడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తంచేశారు. వారి దోపిడీని అరికట్టి అభివృద్ధికి పార్టీ శ్రేణులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తిరుపతి సుందరయ్య నగర్‌లోని ఎంబి భవన్‌లో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ.. సామ్రాజ్య వ్యవస్థను, భూస్వామి వ్యవస్థను వ్యతిరేకించే వారిని కలుపుకుని ఉద్యమించాలన్నారు. గ్రామీణ వ్యవస్థలో నెలకు ఐదువేల రూపాయలకు మించి ఆదాయం రాని వారు 50 శాతానికి పైగా ఉన్నారన్నారు.

తీస్తా సెతల్వాద్‌పై కక్ష సాధింపు చర్యలు:సిపిఎం ఖండన

 సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌పై మోడీ సర్కార్‌ తీసుకుంటున్న కక్ష సాధింపు చర్యలను సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఆమెపై సిబిఐ కేసు పెట్టడం, ఆమె నివాసంపై 16మంది సిబిఐ అధికారులు దాడుల పరంపర సాగించడం అంతా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు పొలిట్‌ బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. గుజరాత్‌ మారణకాండకి సంబంధించిన కేసుల్లో అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆమెను అడ్డుకునేందుకు, నోరు మూయించేందుకే ఇదంతా చేస్తున్నారని విమర్శించింది. ప్రభుత్వంలోని అగ్ర నేతల పాత్రను బయటపెట్టేందుకు ఇంకెవరూ యత్నించకుండా వారి నోరు మూయించేందుకు ఇదొక సంకేతమని పార్టీ పేర్కొంది.

కొన‌సాగుతున్నకార్మికులస‌మ్మె‌

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఏడో రోజు కొన‌సాగుతుంది. కనీస వేతనాలు ఇవ్వాలని కార్మికులు ఆందోళన చేస్తుంటే.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చెత్త తరలించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఈ ప్రయత్నాలను అడ్డుకున్న కార్మికులు.. సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
తమ డిమాండ్లు  సాధ‌న‌కై

Pages

Subscribe to RSS - July