July

ఏపీ సీడ్‌క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌...

 ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అనేక అంశాలు పొందిపరిచారు. బ్రహ్మ స్థానంలో ఏమేమి ఉంటాయి, సచివాలయం ఎక్కడ నిర్మిస్తారు.. హైకోర్టు ఎక్కడ.. తదితర అంశాలు అందులో పొందిపరిచారు.

చట్టాలన్నీ పెళుసు...పాలకులకు పేదలంటే అలుసు

మన చట్టాలన్నీ పెళుసుబారాయి. పాలకులే వాటిని అమలు చేయని నిందితుల జాబితాలోకి చేరుతున్నారు. చట్టాలు చేసే వారే అమలుకు మీనమేషాలు లెక్కించడం విచిత్రం. అందునా పేదలకు సాయం అందించే చట్టాలంటే వారికి మరీ అలుసు! తాజాగా మున్సిపల్‌ కార్మికుల ఆందోళనే అందుకు ఉదాహరణ. మున్సిపల్‌ కార్మికుల్లో 85 శాతం మంది దళిత, గిరిజన పేదలే! వీరు పట్టణాల్లో మురికి, చెత్త, మలిన పదార్థాలను చేతులతో తీస్తూ వెట్టిచాకిరి చేస్తున్నారు. పాకీ పనితో నిజమైన 'స్వచ్ఛ భారత్‌'ను అమలు చేస్తున్నారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండేందుకు పనిచేసే ఆ కార్మికులు మాత్రం దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు.

అమరావతి కొత్త జిల్లా‌?

 అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచన పై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, ఏడాది కాలంగా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు చేస్తామని చెబుతున్న మంత్రులు, వాటిని ముందు అమలు చేసి, తర్వాత జిల్లా ప్రతిపాదనలు తీసుకోస్తే బాగుంటుందని అంటున్నారు. మరోవైపు అమరావతి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని అలోచన మంచిదైనప్పటకీ , ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలంటే అనేక శాఖలను అనుసంధానం చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం మంత్రుల కార్యాలయాల తరలింపు సాధ్యం కానప్పుడు , ఇప్పుడు ప్రత్యేక జిల్లా అవసరం ఉండబోదని విశ్లేషకులు అంటున్నారు.

చిత్తూరులో ప్రబలిన డెంగ్యు,విషజ్వరాల నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి ..19. 07. 2015

లక్ష్మమ్మ గారి మృతి తీరానిలోటు..సిపిఎంరాష్ట్ర కార్యదర్శి పి.మధు

సినియర్ కమ్యూనిస్టు నాయకురాలు, మహిళసంఘం నాయకులు టిసి లక్ష్మమ్మ గారి మృతి ఉద్యమానికి తీరానిలోటు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. లక్ష్మమ్మగారి మృతికి సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది..

కేంద్రం కార్మిక చట్టాల నిర్వీర్యనికి కుట్ర

 కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల నిర్వీర్యనికి కుట్ర పన్నుతుందని సిఐటియు ఆలిండియా  ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ విమర్శించారు. జాతీయ కార్మిక సంఘాలతో కేంద్ర మంత్రుల ఉపసంఘం భేటీ అయ్యింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అధ్యక్షతన శ్రమశక్తి భవన్‌లోఆదివారం జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పియూస్‌ గోయల్‌, పదకొండు జాతీయ కార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నారు. సుమారు నలబై నిమిషాలు పాటు జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన డిమాండ్లపై చర్చ జరిగింది.

జిఎస్‌టి బిల్లును తిరస్కరించడమే మార్గం:మధు

రానున్న పార్లమెంటు సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.ఇప్పటికే దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్న భూ సేకరణ చట్టానికి సవరణ బిల్లుతో పాటు, ఎస్సీఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సవరణ, సరుకులు, సేవల బిల్లు (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ -జిఎస్‌టి) బిల్లు వీటిలో కీలకమైనాయి.

అడవులూ మింగేస్తారా !

రాష్ట్ర రాజధానిని నిర్మించడం కోసం ఈ సరికే 30 వేలకు పైగా ఎకరాల పంట భూములు సేకరించిన ప్రభుత్వం తాజాగా పేదలు సాగుచేసుకుంటున్న అటవీ భూములపై డేగ కన్నేయడం అమానుషం. భూములను సొంతం చేసుకోవడానికి వీలుగా అడవులను డీనోటిఫై చేయడమే కాక లక్ష ఎకరాలను కార్పొరేట్లకు, పెట్టుబడి దారులకు, ప్రభుత్వ అనుకూల పెద్దలకు పందేరం చేయ పూనుకోవడం దాని వర్గనైజాన్ని తెలియజేస్తోంది. అనేక కష్టాలకోర్చి అటవీ భూమిని సాగుకు అనువుగా మార్చిన రైతన్న పొట్ట కొట్టే కుట్రలు పన్నడం దుర్మార్గపూరితం.

ప్రతిపక్షాలతోఘర్షణకురెడీ:మోడీ

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తుపానును మరిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. కాంగ్రెస్ నాయకుడు గిరిధర్ లాల్ డోగ్రా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం కోసం శుక్రవారం ఇక్కడికి వచ్చిన మోదీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, జమ్మూ, కాశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కరణ్ సింగ్‌తో కలిసి వేదికను పంచుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘మనమంతా ఇక్కడ కూర్చుని ఉన్నాం. అయితే మనమంతా పార్లమెంటులో ఘర్షణ పడే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి. అదీ చూద్దాం’ అని కాంగ్రెస్ నేతలనుద్దేశిస్తూ మోదీ అన్నారు.

Pages

Subscribe to RSS - July