July

సిపిఎం ఆధ్వర్యాన వ్యవసాయ సాగు

సిపిఎం ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు కోరంగి కంపెనీ భూముల్లో పోలెకుర్రు పంచాయతీకి చెందిన పేదలు గురువారం నుంచీ వ్యవసాయ సాగు ప్రారంభించారు. జూలై 13న కోరంగి కంపెనీ భూములను సిపిఎం ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతి పేదలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 200 మంది ప్రజలు ఈ భూముల్లో ప్రవేశించి గురువారం దుక్కిదున్నారు. సుమారు 25 ఎకరాల భూములను వీరు కష్టపడి సాగులోకి తెచ్చారు. 15 ఎకరాల భూముల్లో విత్తనాలు వెదజల్లారు. ఈ భూములను 30 ఏళ్లుగా భూస్వాములు అనుభవించారు.సుమారు 15 బస్తాల వరి విత్తనాలను నాటామని తెలిపారు. 

రాష్ట్రాల మధ్య సరికొత్త వివాదం

బేగంపేట ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక గజపతిరాజు పావులు కదుపుతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. బేగంపేట ఎయిర్‌ పోర్టు ప్రాంతంలో.. తెలంగాణ ప్రభుత్వం ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతుంటే.. ఏపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

ఇవాళ ఛలో విజయవాడ

వారం రోజులుగా సమ్మె చేస్తున్నాప్రభుత్వం పట్టించుకోకపోవడం పై మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఇవాళ చలో విజయవాడకు పిలుపునిచ్చారు.

పున:పరిశీలించండి!

భూ సేకరణ చట్ట సవరణపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నిర్వహించిన నీతి ఆయోగ్‌ భేటీకి అధికశాతం ముఖ్యమంత్రులు మొహం చాటేయడం, ఆ చట్టం పట్ల దేశంలో ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తోంది. చట్ట సవరణపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మోడీ ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ సిఎంలు, కాంగ్రెస్‌, బిజెపియేతర సిఎంలతో పాటు ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన పంజాబ్‌ అకాలీదళ్‌ సిఎం కూడా చట్ట సవరణను తోసిపుచ్చడం బిజెపికి మింగుడుపడని విషయం.

నేడు సిఎం కార్యాలయం ముట్టడి

మున్సిపల్‌ కార్మికుల విషయంలో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా నేడు విజయవాడలో సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల జెఎసి ప్రకటించింది. రాష్ట్రంలో ఏడురోజులుగా సమ్మె కొనసాగుతున్నా పర్మినెంటు ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మధ్య చీలికతెచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జెఎసి నాయకులు ఉమామహేశ్వరరావు, రంగనాయకులు, దశరధరామరాజు, వెంకటరత్ననాయుడు, వై.వి.రమణ, వి.రవికుమార్‌, ఎస్‌.శంకరరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

భగవద్గీత మత గ్రంథం కాదు..

‘‘గీత ఒక మత గ్రంథం కాదు. వివేకం, శాస్త్రం (సైన్స్‌), ఎన్నో సమస్యలకు పరిష్కారం. ఇదే జీవనం. అందుకే గీతను పాఠశాలల్లో నైతిక విద్యగా బోధిస్తాం. యోగాను కూడా హిందూ ధర్మం అన్నారు. కానీ, జూన్‌ 21న 192 దేశాలు యోగా నిర్వహిస్తే.. అందులో 47 ముస్లిం దేశాలే. హర్యానా ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తోందని విమర్శిస్తున్నారు. మన సంస్కృతిని మనం నేర్చుకోవటం కాషాయీకరణ ఎలా అవుతుంది.?’’ అని హర్యానా విద్యా మంత్రి రాంవిలాస్‌ శర్మ ప్రశ్నించారు.

ఏపీ,ఒడిశాలకు తుఫాను సాయం

ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన తుఫాను సాయం పెంపుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. మొదట ప్రకటించిన రూ.1496.71 కోట్ల నుంచి రూ.2331.71కు పరిహారాన్ని పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మొత్తంలో రూ. 1843.94 కోట్లను ప్రపంచ బ్యాంకు రుణం రూపంలో కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని, మిగిలిన రూ.487.77 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

హైకోర్టును విభజించండి

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది గడిచినా ఇంకా ఉమ్మడి హైకోర్టులోనే న్యాయవ్యవస్థ కొనసాగడంలో అర్థం లేదని, తక్షణమే హైకోర్టును విభజించాలని తెరాస ఎంపీలు గవర్నర్ నరసింహన్‌కు గురువారం విజ్ఞప్తి చేశారు. ఎంపీలు జితేందర్ రెడ్డి, కె.కేశవరావు, కవిత, వినోద్, కె.విశే్వశ్వర రెడ్డి తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. హైకోర్టు విభజనపై కేంద్రం స్పష్టమైన చర్యలు తీసుకోకుంటే పార్లమెంటులో తాము ఆందోళన చేస్తామని ఎంపీలు ప్రకటించారు.

కుల గణాంకాలని వెల్లడించాలి

ఇటీవలి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక కుల గణంకాలను పూర్తి స్థాయిలో వెల్లడించాలని సిపిఐ డిమాండ్‌ చేసింది. కుల గణాంకాల్ని విడుదల చేయకుండా అట్టిపెట్టడాన్ని సిపిఐ కేంద్ర కార్యదర్శి వర్గం తప్పు పట్టింది. ప్రభుత్వానికి చిత్త ఉంటే సర్వే వివరాలను పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యన్ని కప్పిపుచ్చుకునేందుకే కుల గణాంకాలను విడుదల చేయలేదని విమర్శించింది. 

మన ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రజాస్వామ్యీకరించాలి

 ''స్వామ్యం అంటే పరిపాలన. మన ప్రాచీన రాజనీతి శాస్త్ర గ్రంథాలలో ఈ కారణం చేత రాజుకు ''స్వామి'' అనే పేరు పెట్టబడింది. పరిపాలనలో అధికారాన్ని వహించే మంత్రులను, వివిధ శాఖల అధ్యక్షులను, ఉన్నత ఉద్యోగి వర్గాన్ని అతడు నియమించేవాడు. వారు అతనికి లోబడి తమ తమ కర్తవ్యాలను నిర్వహిస్తూండేవారు. అందుచేత ''స్వామ్యం'' అతనిదిగా ఉండేది. అతనిపై అధికారాన్ని వహించే వారెవరూ ఉండేవారు కారు. ఈ కారణంగా రాజు నిరంకుశుడయ్యాడు. ప్రజలను పీడించుకుతిన్నాడు. అంత్ణపుర కలహాలతో, యుద్ధాలతో, విలాసాలతో ప్రజా సంక్షేమాన్ని మరచి పాలించాడు.

Pages

Subscribe to RSS - July