July

తీస్తా సెతల్వాద్‌పై కక్ష సాధింపు చర్యలు:సిపిఎం ఖండన

 సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌పై మోడీ సర్కార్‌ తీసుకుంటున్న కక్ష సాధింపు చర్యలను సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఆమెపై సిబిఐ కేసు పెట్టడం, ఆమె నివాసంపై 16మంది సిబిఐ అధికారులు దాడుల పరంపర సాగించడం అంతా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు పొలిట్‌ బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. గుజరాత్‌ మారణకాండకి సంబంధించిన కేసుల్లో అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆమెను అడ్డుకునేందుకు, నోరు మూయించేందుకే ఇదంతా చేస్తున్నారని విమర్శించింది. ప్రభుత్వంలోని అగ్ర నేతల పాత్రను బయటపెట్టేందుకు ఇంకెవరూ యత్నించకుండా వారి నోరు మూయించేందుకు ఇదొక సంకేతమని పార్టీ పేర్కొంది.

కొన‌సాగుతున్నకార్మికులస‌మ్మె‌

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఏడో రోజు కొన‌సాగుతుంది. కనీస వేతనాలు ఇవ్వాలని కార్మికులు ఆందోళన చేస్తుంటే.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చెత్త తరలించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఈ ప్రయత్నాలను అడ్డుకున్న కార్మికులు.. సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
తమ డిమాండ్లు  సాధ‌న‌కై

వేదాలకు వ్యతిరేకంగా రచనలు

వేదాలు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా రచనలు చేయాలని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య పిలుపునిచ్చారు. ఐఆర్‌టీఎస్‌ రిటైర్డ్‌ అధికారి అప్పికట్ల భరత్‌ భూషణ్‌ రచించిన ‘మెమొరీస్‌ ఆఫ్‌ దళిత్‌ సివిల్‌ సర్వెంట్‌’ పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్‌లో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి బి. ప్రసాదరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కంచె ఐలయ్య ప్రసంగిస్తూ... ‘‘ఈ దేశంలో బ్రాహ్మణ, అగ్రకుల ఆధిపత్యం నశించి... అంబేద్కర్‌, జ్యోతిబా పూలే కలలు నెరవేరాలంటే వేదాలకు వ్యతిరేకంగా రచనలు చేయాలి. బ్రాహ్మణులపై పోరాడే తెలివి వెనుకబడిన వర్గాలకు లేదు. క్రైస్తవులు, దళిత మేధావులే ఆ పని చేయాలి’’ అని సూచించారు. ఈ దేశంలో హిందుత్వం ఉండరాదని కూడా అన్నారు.

ఆగష్టు లో పట్టణ సమస్యల పై ప్రజాందోళన. సి పి యం రాష్ట్ర సమావేశం పిలుపు

పట్టణ సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని మున్సిపల్ పట్టణ కేంద్రాలలో ఆందోళన నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

ప్రధాని కొత్త పధకం..

ఢిల్లీలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. నైపుణ్యాల భారత్ స్థాపన లక్ష్యంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పని చేస్తుంది. ప్రపంచ యువనైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో నైపుణ్యం గల కార్మిక శక్తి సృష్టి కేంద్ర కార్యక్రమ లక్ష్యం. నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత, వృత్తివిద్య అందించేందుకే కౌశల్ వికాస్ యోజన. యువతను వేరువేరు రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. 

దీక్షకు దిగ‌నున్నఅన్నాహాజారే

 ప్రముఖ సామాజిక వేత్త అన్నా హాజారే మళ్లీ నిరహార దీక్ష చేయబోతున్నారు. రాంలీలా మైదాన్ లో అక్టోబర్ 2వ తేదీన అన్నా నిరహార దీక్షకు కూర్చొంటున్నారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ దీక్ష చేయనున్నారు.

స్మార్ట్‌విశాఖా..చెత్తవిశాఖా

విశాఖ మున్సిపల్‌ కార్మికుల సమ్మెతో స్మార్ట్‌ విశాఖ కాస్తా చెత్త విశాఖ‌గా మారిపోయింది. గత ఆరు రోజులుగా మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతున్న త‌రుణంలో నగరమంతా కంపుమయం అయ్యింది. 72 వార్డుల్లో దుర్గంధమయం అయ్యాయి. రోజుకు 800 టన్నుల చెత్త విశాఖలో పేరుకుపోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో జనం పరిస్థితి దయనీయంగా మారింది. దానికి తోడు వ‌ర్షం ప‌డ‌తే రోడ్డు‌లు అస్త‌వ్య‌స్తంగా త‌యారవుతున్నా‌యి. దాని వ‌ల‌న అంటువ్యా‌ధులు ప్ర‌భ‌లే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తు‌న్నా‌రు.

బిజెపి నేడు ఇఫ్తార్‌ విందు

రంజాన్‌ పవిత్ర మాసం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వ ర్యంలో బుధవారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్‌ ఎదురుగా హాజ్‌ హౌస్‌ పక్కన గల రెడ్‌రోస్‌ పంక్షన్‌ హాలులో 15వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ ఇఫ్తార్‌ విందు జరుగు తుందని ఆయన పేర్కొన్నారు.

జులై 30న ఉరిశిక్ష!

వందలాది మందిని పొట్టన పెట్టుకున్న యాకుబ్ మెమెన్(53)కు ఉరిశిక్ష ఖాయమైంది. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ మెమెన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం విదితమే. మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా తోసిపుచ్చారు. దీంతో మెమెన్ ఉరిశిక్ష ఖాయమైంది. జులై 30న మెమెన్‌ను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెమెన్ నాగపూర్ సెంట్రల్ జైలులో ఉంటున్నారు. ముంబయి బాంబు పేలుళ్ల కేసులో మెమెన్‌కు 2007లో కోర్టు మరణశిక్ష విధించింది. 1993 మార్చి 12న జరిగిన పేలుళ్లలో 250 మందికి పైగా మృతి చెందగా, 750 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

కలం గళమై గర్జించిన 'గరిమెళ్ల'

అభ్యుదయ భావజాలంతో దేశభక్తిని చాటుతూ బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర నుంచి ఎగసి పడ్డ కవి కెరటం గరిమెళ్ల.. 1892 జులై 15న నాటి కళింగాంధ్ర (నేడు ఉత్తరాంధ్ర) ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం ప్రియాగ్రహారంలో సూరమ్మ, వెంకట నరసయ్యకు జన్మించారు. ప్రజాకవి, జాతీయ కవి సార్వభౌమ బిరుదాకింతుడైన గరిమెళ్ల కలం గళమై బ్రిటిష్‌ సామ్రాజ్యపు గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. పాత్రికేయ వృత్తిని దేశ హితం కోసం, పరపీడన నుంచి జాతి విముక్తి కోసం అనేక రచనలు సాగించారు.

Pages

Subscribe to RSS - July