July

భూములు లాక్కుంటే ప్రతిఘటన తప్పదు : సిపిఎం

 రాజధాని పరిసర ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా అటవీ భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలు, చిన్న, సన్నకారు రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. సోమవారం విజయవాడలోని అటవీ శాఖ డిఎఫ్‌ఓ కార్యాలయం ఎదుట సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, సిపిఐ(ఎంఎల్‌), ఎంసిపిఐ(యు)లతో కలిపి ఆరు వామపక్ష పార్టీల నేతృత్వంలో భారీ ధర్నా జరిగింది. ధర్నా కార్యక్రమంలో విజయవాడ రూరల్‌, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట ప్రాంతాల నుండి ప్రజలు హాజరయ్యారు.

ప్రభుత్వ స్కూళ్ళు నిర్వీర్యం

మోడల్‌ ప్రైమరీ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలలను కుదించే ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణా జిల్లాలో మొత్తం 1752 ప్రాధమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 250 పాఠశాలలు కనుమరుగయ్యే అవ కాశం ఉంది. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్ర భుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం పట్ల మేధా వులు పెదవి విరుస్తున్నారు. మోడల్‌ ప్రైమరీ పాఠ శాలలకు ప్రామాణికంగా ప్రభుత్వం రూపొందించిన నిబంధనావళిని పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయా లు వెల్లడవుతున్నాయి.

పుష్కరాల్లో తొక్కిసలాట

గోదావరి పుష్కరాల్లో అపశృతి చోటు చేసుకుంది. తొక్కిసలాటలో పలువురు మృతి చెందారు.పలువురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ఇక్కడ జరుగుతున్న పుష్కరాల్లో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఒకే ఘాట్ కు చేరుకున్నారు. దీనితో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసు యంత్రాంగం చేతులెత్తేశారు. భద్రతా వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపించింది. పది లక్షల జనాలు వస్తారని అంచనా వేసినా కనీస సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలం చెందిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

హూద్ హూద్ తుఫాన్ లో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.

ఈ రోజు విశాఖ ఏజెన్సీ అరుకు MPDO ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో సిపియం జిల్లా కార్యదర్శి కె. లోకనాధం మాటలాడుతూ విశాఖ జిల్లాలో హూద్ హూద్ తుఫాన్ వాళ్ళ పడిపోయిన సిల్వర్ ఒక్ చెట్లు తొలగించుటకు ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా ఒక సిల్వర్ చెట్టుకు రూ . 100 /-లు చొప్పున ఒక్కొక రైతుకు 150 చెట్లుకు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికి చెల్లించకపోవడం దుర్మార్గం.ఒక అరుకు మండలంలోనే 14 పంచాయతీల పరిధిలో 170 గ్రామాల్లో ప్రభుత్వ అధికారులే సర్వ్ జరిపి 2574 మంది రైతులు నష్టపోయారని గుర్తించారు.

కాంగ్రెస్‌ పై పవన్ విసుర్లు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కాంగ్రెస్‌ పార్టీని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాను కాంగ్రెస్‌ నేతలు గాలికొదిలేశారని, లలిత్‌మోదీ వివాదానికి ఆ పార్టీ పరిమితమైందని ఆయన తన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. 5 కోట్ల మంది సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు కాంగ్రెస్‌ నేతలకు పట్టదా అని పవన్‌ ప్రశ్నించారు.

అభివృద్ధికి అడ్డం చంద్రబాబే

అభివృద్ధికి అడ్డం వస్తే అణిచివేస్తానంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారని, అభివృద్దికి అడ్డం వస్తుందే చంద్రబాబని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ పుణ్యవతి విమర్శించారు. కార్మికులు తమ హక్కులు కాపాడుకోవడం కోసం, ప్రభుత్వ రంగాన్ని రక్షించుకునేందుకు సెప్టెంబర్‌ రెండున దేశవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన ఏడాదికాలంలో కార్మికుల శ్రమను దోచి కార్పోరేట్‌ వర్గాలకు అప్పగించేందుకు ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబు వచ్చిన ఏడాదిలో 1600 మంది ఉద్యోగులకు తొలగింపు ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు.

విధ్వంసకర అభివృద్ధి

 విధ్వంసకర అభివృద్ధికి తాము వ్యతిరేకమని మానవ హక్కుల వేదిక 5వ జిల్లా మహా సభలో వక్తలు స్పష్టంచేశారు. నగరంలోని సిరిపురం కూడలిలోని బిల్డర్సు అసోసియేషన్‌ సభా వేదికలో ఆదివారం జిల్లా అధ్యక్షులు ఎం.శరత్‌ అధ్య్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్‌ మాట్లాడుతూ పదేళ్లుగా తమ సంఘం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన, మానవ హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రాజెక్టులను, పరిశ్రమలను వ్యతిరేకిస్తామని తమ మీద నింద ఉందని, తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, విధ్వంసకర అభివృద్ధిని మాత్రమే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

మావోయిస్టుల అల్టిమేటం

మన్యంలో బాక్సైట్‌ ఖనిజం వెలికితీతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మావోయిస్టులు డిమాండ్‌ చేస్తూ విశాఖ మన్యంలోని తెలుగుదేశం, బీజీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలకు లేఖలు పంపినట్టు తెలిసింది. ఇవి మావోయిస్టు పార్టీ ఈస్టు డివిజన్‌ కమిటీ కార్యదర్శి కైలాసం, మరో నేత లక్ష్మి మన్యం పరిధిలోని మండలాలకు చెందిన పలువురికి అందినట్టు సమాచారం. బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని, ఆ ప్రయత్నాలను విరమించుకుంటున్నట్టు ప్రభు త్వం బహిరంగ ప్రకటన చేసేలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మావోయిస్టులు ఆ లేఖల్లో పేర్కొన్నట్టు తెలిసింది.

కాంగ్రెస్‌ డ్రామాలు మొదలు..

 వచ్చే వారం మొదలు కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో వివాదాస్పద భూ సేకరణ బిల్లు ఆమోదం పొందడానికి వీలుగా, జులై 15న ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. నీతి ఆయోగ్‌ ఏర్పడిన తరువాత ఇలా సమావేశం కావడం ఇది రెండవసారి. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశమే లేదు. భూ సేకరణ బిల్లు రైతు వ్యతిరేకం అంటూ నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష కాంగెస్‌ తన పార్టీ వారికి ఆ విధంగా సూచనలు ఇచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Pages

Subscribe to RSS - July