June

స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్‌మార్కెట్లు

నేడు దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్సే్చంజి సూచీ 65.58 పాయింట్లు నష్టపోయి 26777.45 వద్ద, నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజి నిఫ్టీ 8201 పాయింట్లు నష్టపోయి 19.75 వద్ద ముగిసింది.

గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు

తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇస్తే అమరావతికి వెళ్లడానికి తమకు అభ్యంతరం లేదని సచివాలయ ఉద్యోగులు తేల్చిచెప్పారు. అంతేకాక స్థానికత, హెచ్ఆర్, రోడ్ మ్యాప్ పై వెంటనే ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ లో సచివాలయ ఉద్యోగులు కృష్ణయ్య, వెంకట్ రాంరెడ్డి, భావన తదితరులు మీడియాతో మాట్లాడారు. కనీస మౌలిక వసతులు కల్పించకుండా వెళ్లమంటే ఎలా? అని వారు ప్రశ్నించారు. 

మథుర ఘర్షణపై సుప్రీం విచారణ

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జరిగిన ఘర్షణపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈ ఘటనపై న్యాయవాది కామిని జైస్వాల్‌ వేసిన పిటిషన్‌పై పీసీ ఘోష్‌, అమితవ రాయ్‌లతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ రేపు విచారించనుంది.

దీక్ష కాదు.. బాబు భజన

నవనిర్మాణ దీక్ష పేరుతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం దారుణమని, అవి చంద్రబాబు భజన కార్యక్రమాలుగా మారిపోయాయని నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా విమర్శించారు. 'నా నియోజకవర్గంలో జరుగుతోన్న నవనిర్మాణ దీక్షకు ఎమ్మెల్యేనైన నాకే ఆహ్వానం పంపలేదు' అని ఆమె వాపోయారు. సోమవారం తిరుపతి వచ్చిన రోజా విలేకరులతో మాట్లాడారు.

గుల్బెర్గ్ ఊచకోత నిందుతులకు శిక్ష ఖరారు?....

2002 గుజరాత్‌ అల్లర్ల తర్వాత జరిగిన గుల్మార్గ్‌ సొసైటీ నరమేధం కేసులో దోషులుగా తేలిన 24 మందికి అహ్మదాబాద్‌ ప్రత్యేక న్యాయస్థాని ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది. 

నల్ల డబ్బు రూ.30 లక్షల కోట్లు

భారత కుబేరులు విదేశాల్లో దాచుకున్న నల్లడబ్బు రూ.30 లక్షల కోట్లుగా నూతన అధ్యయనం ద్వారా అంచానా వేశామని యాంబిట్‌ క్యాపిటల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. ఇది దేశ జిడిపిలో 20 శాతంగా వున్నట్లు ఆ సంస్థ పేర్కొన్నది. 2016 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపిని 2.3 లక్షల కోట్ల డాలర్లు(రూ.154 లక్షల కోట్లు)గానూ, నల్లడబ్బును 460 బిలియన్‌ డాలర్లు(రూ.30 లక్షల కోట్లు)గానూ క్యాపిటల్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. 

నిన్న ఖతార్.. నేడు స్విట్జర్లాండ్

ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ తీరికలేకుండా గడుపుతున్నారు. ఆదివారం ఖతార్లో పలు సమావేశాల్లో పాల్గొని, కీలక ఒప్పందాలు చేసుకున్న మోదీ.. సోమవారం స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. మోదీ ఖతార్ నుంచి ఒక్క రోజు పర్యటన కోసం స్విట్జర్లాండ్ చేరుకున్నారు.

54ఏళ్ల తర్వాత అమెరికా,క్యూబా దౌత్యం

ఐదు దశాబ్దాలకు పైగా వైరం కొనసాగిన తర్వాత అమెరికా, క్యూబాలు మళ్లీ దౌత్య సంబంధాలు నెలకొల్పుకున్నాయి. 1961 తర్వాత.... తొలిసారిగా వందలాదిమంది సమక్షంలో సోమవారం వాషింగ్టన్‌లోని క్యూబా రాయబార కార్యాలయం వద్ద క్యూబా పతాకాన్ని ఎగురవేయగా క్యూబా రాజధాని హవానాలో అమెరికా పతాకాన్ని లాంఛనంగా ఎగురవేశారు.

మరో స్వాతంత్య్రోద్యమం సాగాలి

నాడు సాగించిన స్వాతంత్య్రోద్యమం తరహాలోనే మరో పోరాటం సాగాల్సిన అవసరముందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపునిచ్చారు. స్వాతంత్య్రమొచ్చి 65 ఏళ్లు దాటినా అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని రూపొందించాల్సిన బాధ్యత వామపక్షాలపైనే ఉందని సూచించారు. ఆ దిశగా తాము కృషి చేస్తామని తెలిపారు. ఆదివారం అనంతపురం నగరంలోని వికె.మెమోరియల్‌ హాలులో 'అనంతపురం జిల్లా కమ్యూనిస్టు సీనియర్‌ నాయకుల కుటుంబ సభ్యుల సమ్మేళనం' జరిగింది.

విజయవాడ ఇఫ్తార్‌ విందుకు సిఎం

రాష్ట్ర ప్రభుత్వ తరుపున ఈనెల 17న విజయవాడలో ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. అదేరోజు జరిగే 66వ వనమహోత్సవంలోనూ పాల్గొననున్నారు. బృందావన్‌కాలనీలోని ఎకన్వెన్షన్‌ హాల్లో సాయంత్రం ఐదుగంటల తరువాత ఇఫ్తార్‌ విందు ప్రభుత్వం తరుపున ఇవ్వనున్నారు. సుమారు మూడువేలమంది మంది హాజరవనున్నారు. అలాగే కొత్తూరు తాడేపల్లి అటవీ ప్రాంతంలోని జక్కంపూడి గ్రామ పరిధిలో వనమహోత్సవం జరగనుంది. దీనికి సంబంధించి ఫైలాన్‌ ఆవిష్కరించ డంతోపాటు, ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. ముఖ్య మంత్రితోపాటు సుమారు 1000 మంది విద్యార్థులు మొక్కలు నాటే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Pages

Subscribe to RSS - June