October

పెరిగిన నిత్యావసరాలతో ప్రజల ఇబ్బందులు :సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు

నవ్యాంధ్ర రాజధానిలో భూములు కోల్పోయిన రైతుల ఇబ్బందులు ఒక పక్క, ప్రభుత్వ రాజధాని నిర్మాణం ఆడంబరం మరోపక్క, పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు ఇంకోపక్క ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి తాడేపల్లి లో నిర్వహించిన సిపిఎం నాయకులు మేకా అమరారెడ్డి 34వ వర్థంతి సభలో ఆయన మాట్లాడారు. సభకు సిపిఎం తాడేపల్లి పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటే శ్వరరావు అధ్యక్షత వహించారు.

ఆరువేల మంది ఏజ‌న్సీ వాసులకు వైద్య‌సేవ‌లు..

మ‌న్యంలో మ‌లేరియా, ఇత‌ర విషజ్వ‌రాల‌ బారిన పడిన అనేక మందికి ఉచిత వైద్య సేవలందించడానికి చింతూరులో  సిపిఎం ఆధ్వర్యంలో  ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి నెల రోజుల నుండి సేవా కార్య‌క్ర‌మాలు కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యాల‌యాన్ని ప్ర‌జా అవ‌స‌రాలు తీర్చి, ప్రాణాలు నిల‌బ‌ట్టే వైద్య‌శాల‌గా మార్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్  మిడియం బాబూరావు సార‌ధ్యంలో జేవీవీ, ఇత‌ర ప్ర‌జా రంగాల వైద్యులు, నెల్లూరు ప్ర‌జావైద్య‌శాల‌కు చెందిన వైద్యులు కూడా ఇక్క‌డ‌కు వ‌చ్చి సేవ‌లు అందించారు.

మంత్రుల గుండాగిరి:జగన్

ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలకు బీహార్‌ సైతం నివ్వెరపో తోందని వైసిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో తమ పార్టీ నాయకులపై 10 నెలల్లో 13 సంఘటనలు జరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం మల్కాపురంలో ఇటీవల దహనమైన చెరకు తోటను సోమవారం ఆయన తమ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం చంద్రబాబు ప్రోత్సాహంతోనే మంత్రులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. భూములివ్వని రైతుల పంటలు తగుల బెట్టడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.

జగన్ ఓ భస్మాసురుడు: పయ్యావుల

అమరావతి శంకుస్థాపనకు పిలవొద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలనుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జగన్‌ కలియుగ భస్మాసురుడని, జగన్‌ చేతిని తననెత్తినే పెట్టుకుంటున్నారని పయ్యావుల విమర్శించారు. శంకుస్థాపనకు కేసీఆర్‌ రావడం చంద్రబాబు చాణిక్యతకు నిదర్శనమని ఆయన చెప్పారు. విద్వేషాలు మర్చిపోయి కలిసి పయనించడమే తెలుగుజాతి ముందున్న లక్ష్యమని ఎమ్మెల్సీ పయ్యావుల చెప్పారు. శంకుస్థాపనకు జగన్‌ రాకపోవడం దురదృష్టకరమని ధూళిపాళ్ల అన్నారు. విపక్ష నేతగా జగన్ పనికిరారని ఆయన చెప్పారు.

టూర్‌ల పైనే మోదీ :దిగ్విజయ్‌

‘‘దేశంలో కందిపప్పు(తుర్‌ దాల్‌) ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ పర్యాటక ఆసక్తి గల ప్రధాని మోదీకి ఈ తుర్‌ దాల్‌ను పట్టించుకొనే సమయం లేదు. ఆయనకు టూర్‌లంటేనే విపరీతమైన ఆకలి. అందుకే వచ్చే ఏడాది కోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌ సింగ్ విమర్శించారు.

ఈవీఎం లలో లోపాలున్నాయి:ఏచూరి

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఓ చోట పోలింగ్‌ ముగిసిన రోజే ప్రధాని మరోచోట ప్రచారం చేయడం ద్వారా లైవ్‌ టీవీలో ప్రసారం అవుతుందని, అది ఓటర్లపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడడం సరి కాదని ఏచూరి పేర్కొన్నారు. ఈవీఎం యంత్రాల్లో లోపాలున్నాయంటూ ఎలక్షన్‌ కమిషన్‌కు సిపిఎం ఫిర్యాదు చేసింది. 

దళితులపై దాడిని ఖండించిన బృందా

దళితులపై పెత్తందారుల దాడిని సీపీఎం ఖండించింది. దళితుల కుటుంబాన్ని బృందాకారత్ సందర్శించారు. దళితులకు రక్షణ కల్పించడంలో హర్యానా ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని తెలిపారు.

దళిత చిన్నారుల సజీవదహనం..

ఫ్యూడలిస్టు సంస్కృతి పాతుకుపోయిన హర్యానాలో కుల రక్కసి కోరలు చాచింది. అన్పెం పున్నెం ఎరుగని ఇద్దరు పసి పిల్లలను అగ్నికీలలకు ఆహుతిచ్చింది. దేశ రాజధానికి 40 కిలోమీటర్ల దూరంలోని సోన్‌దీప్‌ గ్రామం (హర్యానా)లో సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది. అగ్రవర్ణ దురహంకారం తలకెక్కిన ఠాకూర్‌ కులస్థులు కొందరు ఓ దళితుని ఇంటికి అర్ధరాత్రిపూట నిప్పంటించారు. ఆ మంటల్లో చిక్కుకుని ఇద్దరు పిల్లలు కాలి బూడిదయ్యారు. తల్లిదండ్రులు గాయాలతో బయటపడ్డారు. బూఠాకూర్‌ కులస్థులే తన ఇంటిపై రాత్రి రెండు గంట ప్రాంతంలో దాడి చేశారని ఆ పిల్లల తండ్రి జితేందర్‌ తెలిపారు

సిపిఎం గుర్తు మరింత స్పష్టంగా..

ఎన్నికల ఓటింగ్‌ యంత్రాలపై సిపిఎం గుర్తు మరింత స్పష్టంగా ఎర్రగా కనిపించనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించింది. బీహార్‌ ఎన్నికల అనంతరం దీనిని అమలులోకి తెస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ నసీం జైదీ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఏచూరి మంగళవారంనాడు నిర్వాచన్‌ సదన్‌లో జైదీని కలిశారు. ఇవిఎంలపై తమ పార్టీ గుర్తు సరిగా కనబడటం లేదనీ, మరింత స్పష్టంగా కనిపించ ేలా బోల్డ్‌గా చేయాలని ఏచూరి ఆయనను కోరారు. దీనికి జైదీ అంగీకరించారని, బీహార్‌ ఎన్నికల తరువాత నుంచి అమలు చేస్తానని చెప్పారనీ తెలిపారు. 

Pages

Subscribe to RSS - October