October

భూములు లాక్కుంటే ఆందోళనే:CPM

రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పేదల భూములు లాక్కొని కార్పొరేట్‌, బహుళజాతి కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని చూస్తే ఆందోళనలు తప్పవని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు హెచ్చరించారు. శుక్రవారం పాతబస్టాండ్‌లోని సిపిఎం కార్యాలయంలో 'భూ బ్యాంక్‌ బండారం-కార్పోరేట్లకు పందేరం' అనే పుస్తకాన్ని ఆవిష్క రించారు.

120KM చైతన్యయాత్ర:బాబూరావు

అమరావతి శంకుస్థాపనలోపే రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం భూములు కోల్పోయి ఆందోళనలో ఉన్న రైతులకు అండగా ఉండేందుకు ఆ పార్టీ రాజధాని ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ యాత్ర ద్వారా 120 కిలోమీటర్లు 29 గ్రామాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకూ పోరాటం చేస్తామని రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ సీపీఎం కన్వీనర్‌ బాబురావు పేర్కొన్నారు.

చంద్రబాబుకు ఆ హక్కు లేదు..

బ్రిటిష్‌ ప్రభుత్వం పాలిస్తున్నప్పుడే 1926లో మనదేశ కార్మికవర్గం పోరాడి, కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కును సాధించింది. కార్మిక సంఘాలనేవి ఏ దేశంలోనైనా ఉంటాయన్న స్పృహతో బ్రిటిష్‌ ప్రభుత్వం వ్యవహరించింది. అయితే కార్మిక సంఘాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం మాత్రం దారుణంగా వ్యవహరిస్తోంది.కార్మిక సంఘాలు, వామపక్ష ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షలపై చంద్రబాబు ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో ఫార్మా కంపెనీల యజమానులతో జరిగిన సమావేశంలో సంఘాలపైనా, ఉద్యమాలపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 'పాలనంటే బడాబాబులకు సాగిలపడడమా? ప్రజలను, కార్మికులను పట్టించుకోరా?

గురజాడ పఠనమందిరం ప్రారంభం

సమాజంలో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, అందుకు గ్రంథాలయోద్యమం మళ్లీ రావాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రావి శారద పిలుపునిచ్చారు. విజయవాడ ఆకుల వారి వీధిలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహాకవి గురజాడ పఠన మందిరాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ ఎంతటి సమాచారం ఉన్నా అది గ్రంథాలయాల ద్వారానే ప్రజలకు అందుబాటులోకి వస్తుం దన్నారు. మహాత్మాగాంధీ నుంచి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ వరకు గొప్ప నాయకులంతా గ్రంథాలయాల్లోనే ఎక్కువ సమయం గడిపారన్నారు.

భోగాపురం గ్రామాలలో ఉద్రిక్తత..

విమానాశ్రయ ప్రభావిత గ్రామాల్లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ సర్వే (రైట్స్‌) (న్యూఢిల్లీ) బృందం చేపట్టిన సర్వేను బాధితులు అడ్డుకున్నారు. సర్వే రాళ్లను మహిళలు పీకేశారు. గురువారం పలు గ్రామాల్లో సర్వే చేసి బౌండరీలు ఏర్పాటు చేసిన రైట్స్‌ బృందం సభ్యులు శుక్రవారం కొంగవానిపాలెం, దిబ్బలపాలెం ప్రాంతాల్లో పలు చోట్ల రాళ్లు పాతారు. తూడెం గ్రామంలో జిరాయితీ భూముల్లో సర్వే రాళ్లు ఏర్పాటు చేయడంతో రైతులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. అడిగేందుకు వెళ్లిన వారిని పోలీసులు వెళ్లగొట్టారు.

వేతనాలG.Oవిడుదల చేయాలి:గఫూర్

ప్రభుత్వ ఒప్పందం ప్రకారం మున్సిపల్‌ ఉద్యోగులకు అందజేస్తామని హామీ ఇచ్చిన రూ. 11 వేల జీతాలకు జీవోను వెంటనే విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.ఎ గఫూర్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన 11 రోజుల సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని ఆయన కోరారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధన కోసం విజయ వాడలో శుక్రవారం సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని ప్రారంభి ంచిన గఫూర్‌ మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ అని పదే పదే చెప్పే చంద్ర బాబు వీధులను, డ్రైనేజీలను శుభ్రపరిచే వారికి పెంచిన వేతనాలు అందించకపో వడం సిగ్గు చేటన్నారు.

Pages

Subscribe to RSS - October