October

ఆశ నిరాశల మధ్య రాజధాని నిర్మాణం..

రాజధాని అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. ప్రచారహోరు ఉధృతంగా ఉంది. మీడియా రాజధానిపైనే కేంద్రీకరించింది. ప్రభుత్వ పెద్దలు, తెలుగుదేశం నేతలు, అధికార యంత్రాంగమంతా నీరు-మట్టి, 5కె రన్‌ పేర్లతో హడావుడి చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ సహా ప్రముఖ నేతలు, సెలబ్రిటీలు శంకుస్థాపనకు హాజరు కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సందడి నెలకొన్నది. వందల కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు. ఆహ్వానపత్రిక మొదలు వంటకాల వరకు అన్నీ ప్రచార అంశాలుగా మార్చేశారు. ఈ నేపథ్యంలో రాజధాని గురించే సర్వత్రా చర్చ నెలకొన్నది.

శంకుస్థాపనకు సిపిఎం హాజరు..

రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని సిపిఎం నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు కార్యక్రమానికి హాజరవుతారన్నారు. 

భారత్‌కుఅడ్డదారిలోవాల్‌మార్ట్‌

భారత్‌లో కాలు మోపేందుకు వాల్‌మార్ట్‌ అడ్డదారులను ఆశ్రయించింది. భారత్‌లో తన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు వేలాదిమందికి కోట్లాది రూపాయల ముడుపులు చెల్లించిట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో వచ్చిన ప్రత్యేక కథనం వాల్‌మార్ట్‌ ముడుపుల బాగోతాన్ని బయటపెట్టింది. 2013 నుంచి కనీసం 2 వందల డాలర్ల చొప్పున అత్యధికులకు ముడుపులు ముట్టాయని పేర్కొంది.

మళ్లీ శివసేన కవ్వింపు చర్యలు..

శివసేన మళ్లి శివమెత్తింది. ఈసారి బిసిసిఐ కార్యాలయంపై దాడికి దిగింది. భారత్‌-పాకిస్తాన్‌ క్రికెట్‌ సిరీస్‌కు వ్యతిరేకంగా సమావేశాన్ని అడ్డుకుంది. దీంతో బిసిసిఐ-పిసిబిల సమావేశం రద్దయ్యింది. శివసేన తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

వార్తా చానళ్లలో FDI పెంపు..

వార్తా చానళ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింతగా పెంచే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ తెలిపారు. వార్తల నాణ్యత లోపించడంపై, పాత్రికేయులకు శిక్షణ కోసం చాలా తక్కువ వ్యయం చేస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

హిందూసేన ఇంకు దాడి..

 జమ్మూ కాశ్మీర్‌ ఇండిపెండెంట్‌ ఎంఎల్‌ఎ ఇంజనీర్‌ రషీద్‌పై ఢిల్లీ ప్రెస్‌ క్లబ్‌లో దాడి జరిగింది. ప్రెస్‌ క్లబ్‌ ఆవరణలో ముగ్గురు వ్యక్తులు ఆయనపై సోమవారం మధ్యాహ్నం ఇంకు, ఆయిల్‌తో దాడి చేశారు. కొద్ది మాసాల క్రితం ఆయన బీఫ్‌ పార్టీకి ఆతిధ్యమిచ్చినందుకు నిరసనగా ఈ చర్యకు పాల్పడ్డారు. తొలుత ఢిల్లీ ప్రెస్‌ క్లబ్‌లో రషీద్‌ మాట్లాడుతూ, ''నా ఆవుతో ఏం చేస్తానన్నది నా ఇష్టం. నా ఆవుతో ఇతరులకు ఏం పని?'' అని ప్రశ్నించారు. రషీద్‌, మీడియాను ఉద్దేశించి ప్రసంగించిన కొద్ది నిముషాలకే ఈ దాడి జరిగింది. కాగా ఈ దాడికి కారకులైన ఇద్దరిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.

ఆత్మహత్యలు విషాదకరం :తరిగామి

కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని ధర్మవరం పట్టణంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను జమ్ము-కశ్మీర్‌ రాష్ట్ర సిపిఎం ఎమ్మెల్యే, ఉగ్రవాద వ్యతిరేక ఉద్యమ నాయకుడు యూసఫ్‌ తరిగామి సోమవారం పరామర్శించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన 16 మాసాల్లో అనంతపురం జిల్లాలో 39 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత విషాదకరమన్నారు.

రచయితలకు తోడ్పాటుగా నిలుద్దాం!

హిందూ ఫాసిస్టు రాజకీయాలు వేర్వేరు రూపాల్లో ప్రజా ఉద్యమకారుల మీద, ప్రజాసాహిత్య సృష్టికర్తల మీద, వారి కలల మీద సంకెళ్లను విదిలిస్తోంది. దేశంలోనూ 'సాంస్కృతిక జాతీయవాదం' సృజనరంగాన్ని కత్తుల బోనులోకి నెట్టేస్తున్న వైనం కళ్ళ ముందు విస్తరిస్తున్నది. ఆర్య జాతి సాంస్కృతిక ఆధిపత్యం పేరుతో జర్మనీలో హిట్లర్‌ సాగించిన మారణకాండకు మరో రూపంగా సదరు మానసిక, భౌతిక హింసను ఇక్కడ ప్రవహింపజేయటానికి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) వేర్వేరు రూపాలతో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నది.

భూ బ్యాంక్‌ పేరిట భూములు గుంజుకోవద్దు..

 పోడు భూములకు పట్టాలు, తునికాకు బోనస్‌ ఇవ్వాలని కోరుతూ గిరిజనులు పొలికేక పెట్టారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది గిరిజనులు తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం ముంపు మండలంలోని ఎర్రంపేట ఎంపిడిఒ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌డేను ముట్టడించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు, భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య గ్రీవెన్స్‌ డేలో ఉన్న ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి చక్రధర్‌ బాబుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటవీహక్కుల చట్టం- 2005ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములను సర్వే చేసి, పట్టాలు ఇవ్వాలన్నారు.

పర్యావరణ ఆమోదం బూటకం..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతి నిర్మాణా నికి అవ సరమైన పర్యావరణ ఆమోదాన్ని సక్రమ మైన పద్ధతిలో పొందలేదని పర్యావరణ నిపుణులు, ప్రజా సంఘాలువి మర్శిస్తున్నాయి. స్టేట్‌ ఎన్విరాన్‌ మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్మెంట్‌ అథారిటీ(ఎస్‌ఇఐఎఎ)కి రాజధాని పర్యావరణ ప్రభావ అధ్యయనాన్ని నిబంధనలు రూపొందించకుండా క్రిడా పర్యావరణ ఆమోదాన్ని ఎలా పొందిందని నిపు ణులు విమర్శిస్తున్నారు. కన్సల్టెంట్‌ను నియమించ కుండా, క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించకు ండా పర్యావరణ క్లియరెెన్స్‌ ఎలా లభిస్తుందనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ ఒత్తిడిపై రెగ్యులేటరీ ఏజెన్సీ కాగితంపై రబ్బర్‌ స్టాంప్‌ వేసి ఇచ్చిందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

Pages

Subscribe to RSS - October