పార్టీ కార్యక్రమాలు

Fri, 2023-10-20 10:23

- డేటా సేకరణ కోసమే స్మార్ట్‌ మీటర్లు
- ప్రీపెయిడ్‌తో వ్యవసాయ పంపుసెట్లకు ఆటంకం
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి:కార్పొరేట్‌ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే విద్యుత్‌ సంస్కణలను అమలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ద్వారా వినియోగదారులు ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్‌ వస్తు సామగ్రి డేటాను సేకరించి ప్రయివేటు వ్యక్తులకు కట్టబెడతారని తెలిపారు. 'విద్యుత్‌ సంస్కరణలు - ప్రజలపై భారాలు' అన్న అంశంపై విజయనగరంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు గురువారం...

Fri, 2023-10-20 10:22

 

- రాజకీయ పార్టీలు బిజెపి వైపా? ప్రజాస్వామ్యం వైపో తేల్చుకోవాల

బిజెపి తొమ్మిదేళ్ల పాలనలో దేశంలో, రాష్ట్రంలో మైనార్టీలపై దాడులు ఎక్కువయ్యాయని ఈ దాడులను కాంగ్రెస్‌, వైసిపి, టిడిపి, జనసేన రాజకీయ పార్టీలు ఖండించలేదని, మైనార్టీలకు అండగా, వారి హక్కుల సాధనకు సిపిఎం కట్టుబడి పనిచేస్తోందని మాజీ పార్లమెంట్‌ సభ్యులు, సిపిఎం సీనియర్‌ నాయకులు పి.మధు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్ర ప్రాంగణంలో మైనార్టీ రాష్ట్ర సదస్సును గురువారం నిర్వహించారు. మైనార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్‌ చిష్టి అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. మైనార్టీల జోలికి వస్తే బిజెపి పతనం...

Sun, 2023-10-15 19:51

ఏళ్లు గడుస్తున్నా దళితులపై ఆగని వివక్ష
 

- పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
- మోడీ పాలనలో ప్రమాదంలో భారత రాజ్యాంగం
- రాష్ట్ర దళిత సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి :స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా నేటికీ దళితులు కుల వివక్షను ఎదుర్కొంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బిజెపి అధికారంలోకొచ్చిన తర్వాత అగ్రకుల దురహంకారులు, మనువాదులు మరింత పేట్రేగిపోతున్నారని, ఈ తరుణంలో దళితుల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటమే...

Tue, 2023-09-05 12:20

 మోడీ మళ్లీ అధికారంలోకొస్తే దేశం చీకటి రాజ్యంగా మారనుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మోడీని గద్దె దించడానికి ఇండియా పేరుతో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, ప్రశ్నిస్తానని వచ్చిన జనసేన పార్టీ... బిజెపి పల్లకి మోయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన గత నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమరభేరి సోమవారం ముగిసింది. చివరి రోజు ఆయా తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, కార్పొరేషన్‌ కార్యాలయాలు నిరసన...

Pages