పార్టీ కార్యక్రమాలు
సార్వత్రిక సమ్మె తొలిరోజు దేశవ్యాప్తంగా విజయవంతమైంది. కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల సమ్మెలో భాగంగా తొలిరోజైన సోమవారం కార్మికలోకం కదం తొక్కింది. ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొడతామని, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకుంటామని ప్రతిన చేసింది. దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో భాగస్వాములయ్యారు.విజయవాడతో పాటు అన్ని జిల్లాల్లోనూ కార్మికులు ప్రదర్శనలు, సభలు నిర్వహించారు.సమ్మె కారణంగా దేశ వ్యాప్తంగా పారిశ్రామిక నగరాలు, వాడల్లో సాధారణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కోల్‌కత్తా, ముంబాయి వంటి నగరాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులూ సమ్మెలో భాగస్వాములయ్యారు. సింగరేణిలో దాదాపు నూరుశాతం...
రాజధాని నిడమర్రు గ్రామంలో ప్రజా బాటను ప్రారంభించిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి మధు..నిర్మాణమై వృధాగా పడి ఉన్న టీడ్కో గృహాలను సందర్శించారు
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనగా సుందరయ్య సర్కిల్ నుండి RTC బస్టాండ్ వరకు ర్యాలి చేసి బస్టాండ్ సర్కిల్ లో కేంద్ర ప్రభుత్వ దిస్టిబోమ్మను దగ్ధం చేయడం జరిగింది...
సిపిఎం ఆధ్వర్యంలో ఒంగోలులో థర్డ్ వేవ్ కోవిడ్- ఒమిక్రాన్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం -హోమ్ ఐసోలేషన్లో ఉన్న పాజిటివ్ పేషేంట్లకు ఆన్లైన్లో వైద్య సాయం -సేవలందించనున్న 14 మంది వైద్య బృందం -హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా 24 గంటలు అందుబాటులో ఉండనున్న వాలంటీర్లు - పేదరోగులకు ఉచితంగా మందులు ఇవ్వనున్న హెల్ప్ లైన్ సెంటర్ నిర్వాహకులు కరోనా , ఒమిక్రాన్ జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న వేళ ప్రజలకు సేవచేయాలనే తలంపుతో సిపిఎం హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటుచేసింది .
సిపిఎం 26 వ రాష్ట్ర మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచికగా సీనియర్ నేత బిఆర్ తులసీరావు జెండా ఆవిష్కరణ చేశారు. పార్టీ నేతలు, మహాసభల ప్రతినిధులంతా అమరవీరులకు నివాళులర్పించారు. చిన్నారులు సాంస్కృతిక కళలతో అలరించారు. మహిళలు కోలాటంతో సంబరాలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఎం కార్యకర్తలు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు నిర్వహించబోతున్నారు. భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధికి సిపిఎం రూపొందించబోతున్న కార్యాచరణకు సంసిద్ధులయ్యే దిశలో మహాసభ జరగబోతోంది.
ఆస్తిపన్ను పెంపు, చెత్తపన్ను విధింపుకు వ్యతిరేకంగా విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం నిరసన.. కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి..కేంద్రం రాష్ట్రం మీద ఆదేశించటం, రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ను ఆదేశించడంతో 1200 కోట్లరూపాయల పన్నుల భారం పెంచారు - పన్నులు పెంచడం తప్ప అభివృద్ధి లేదు. అధికారపార్టీ కార్పరేటర్లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాధ్, సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, తూర్పు కార్యదర్శి బోజడ్ల నాగేశ్వరరావు, మాజీ కార్పోరేటర్ గాదె ఆదిలక్ష్మి...
వరద ప్రాంతాల్లో సిపిఎం నాయకుల పర్యాటన.. ప్రకాశం జిల్లా ఉప్పుగుందూరులో గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న మిర్చి, మినుము పంటను రైతులతో కలిసి పరిశీలించిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు.వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు పెంట్యాల హనుమంతరావు, షేక్ మాబు, జయంతి బాబు, మండల కార్యదర్శి తూబాటి శ్రీకాంత్ తదితరులు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారాలు మోపే బిజెపి విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అరెస్ట్.
ఘనంగా అనంతగిరి మండల జెడ్పిటిసీ అభినందన సభ...
జెడ్పిటిసీ ఎన్నికల్లో సీపీఎం పార్టీ అభ్యర్థి అనంతగిరి మండల జెడ్పిటిసీ గా గెలిచిన దీసరి గంగరాజు అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జి.కోటేశ్వరరావు, కీల్లో సురేంద్ర, ఉమ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు...
దేశంలో పాలనంతా అంబానీ, అదానీలకు మోడీ ఇచ్చిన వాగ్దానాల చుట్టే తిరుగుతోంది. 2014, 2019 ఎన్నికల్లో దేశ ప్రజలకిచ్చిన వాగ్దానాలేవీ అమలుకు నోచుకోవడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి డొలిచేస్తోంది. మోడీని గద్దెదింపే అతి పెద్ద పోరాటం దేశంలో సమీప భవిష్యత్తులో విశాఖ నుంచే ఉంటుంది' అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ అన్నారు. 'బిజెపి విధానాలను ప్రతిఘటిద్దాం - విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం' అనే నినాదంతో విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ కాన్వోకేషన్ హాల్‌లో సిపిఎం ఆధ్వర్యాన నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికులు పోరాడుతున్న తీరును అభినందించారు. భారత...
విజయవాడ లెనిన్ సెంటర్ లో స్టేట్ గెస్ట్ హౌస్ స్థలాన్ని అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా ,స్టేట్ గెస్ట్ హౌజ్ సందర్శన... ఒక వైపున కేంద్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే, మరోవైపున రాష్ట్రప్రభుత్వం విలువైన ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటు.విజయవాడ నగరంలో రాజ్ భవన్ సమీపంలో వందలాది కోట్ల రూపాయల విలువైన స్టేట్ గెస్ట్ హౌస్ స్థలాన్ని బిల్డ్ ఏపీ పేరుతో తెగ నమ్మటం సిగ్గుచేటు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమ్మకాన్ని వ్యతిరేకించిన వైసిపి నేడు అధికారంలో రాగానే మాట మార్చి అమ్మకానికి పెడుతోంది.ప్రజల ఆస్తులు అమ్మకాన్ని వ్యతిరేకిస్తాం, ప్రతిఘటిస్తాం, ప్రజల ఆస్తులు కాపాడుకుంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్...