పార్టీ కార్యక్రమాలు

Fri, 2020-11-13 10:43

ఇటీవల ముగిసిన బీహార్‌ ఎన్నికల్లో చాలా స్వల్ప తేడాతో బిజెపి-జెడి(యు) కూటమి గెలుపొందింది. ఈ కూటమికి 125సీట్లు రాగా, మహాగత్‌బంధన్‌కు 110సీట్లు వచ్చాయి. అయితే, ఈ రెండు కూటములు మధ్య ఓట్ల వాటా తేడా చాలా తక్కువగా కేవలం 0.2శాతం మాత్రమే వుంది. ఈ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ఎన్‌డిఎకు చాలా ఎదురుదెబ్బలు తగిలాయని పీపుల్స్‌ డెమోక్రసీ తన సంపాదకీయంలో పేర్కొంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి బిజెపి కూటమి 12.4శాతం ఓట్లు పోగొట్టుకుందని పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకత, నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం పట్ల నెలకొన్న అసంతృప్తి కారణంగా గత ఎన్నికల్లో ఏకంగా 71సీట్లు సాధించిన జెడి(యు)కి ఈసారి కేవలం 43సీట్లే లభించాయని సంపాదకీయం వ్యాఖ్యానించింది. మహాగత్‌బంధన్‌...

Wed, 2020-07-08 17:37

రాష్ట్రంలో పేదల కొరకు కట్టి ఖాళీగా ఉంచిన నాలుగు లక్షల ఇళ్ళు టిడిపి ,బిజెపి ,వైసిపి పార్టీల సొమ్ముతో నిర్మించినవి కావు ,ప్రజల సొమ్ము (ప్రభుత్వ నిధుల)తో కట్టిన ఇళ్లు తక్షణమే పేదలకు కేటాయించాలని డిమాండ్..
విజయవాడ నగరంలో డిస్నీలాండ్ లో 57ఎకరాలు ,సమీపంలో రైల్వే శాఖ కు ఇచ్చిన 26 ఎకరాలు ,పాత డంపింగ్ యార్డ్ లో 32 ఎకరాలు అజిత్ సింగ్ నగర్ లో మొత్తం 115 ఎకరాలు ప్రభుత్వం అందుబాటులో ఉన్నాయి. ఈ స్థలాలు పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించకుండా నగరానికి లో 20 కిలోమీటర్ల దూరంలో రాజధాని అమరావతిలోను కంకిపాడు ,గన్నవరం ఏరియాలో కేటాయించడం లో అంతరార్థం ఏమిటి? నగరంలోని విలువైన స్థలాలు బిల్డ్ ఏపీ పేరుతో అన్ని ఖజానా నింపుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందా?
...

Tue, 2020-06-16 12:36

ఇన్కమ్ టాక్స్ పరిధిలో లేని ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలి ప్రతి వ్యక్తికి పది కేజీల బియ్యం మరియు నిత్యవసర వస్తువులు ఉచితంగా ఆరునెలలపాటు ఇవ్వాలని , కార్మిక చట్ట సవరణ లను పునరుద్ధరించాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని , పట్టణ పెదలకు ఉపాధి గ్యాటంటి పథకం పెట్టి ఉపాధి కాల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు సిపిఎం ఆలిండియా పిలుపులో భాగంగా  భీమవరంలో మెంటేవారితోటలో, తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న పశ్చిమగోదావరి (డెల్టా) జిల్లా కార్యదర్శి బి.బలరాం మరియు స్థానిక పార్టీ నాయకులు 

Sun, 2020-05-24 16:46

రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో సిపిఎం బృందం పర్యటన..
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మార్కెట్లు మూతబడి, అంతర్ రాష్ట్ర రవాణా లేక పండించిన పళ్ళు ,కూరగాయలకు రేట్లు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులను ఆదుకుంటామని మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా ఆచరణ బిన్నంగా ఉంది.మరోవైపు పంటలు తగినంతగా కోయక కూలీలకు పని దినాలు తగ్గిపోయాయి, ఉపాధి హామీ పథకం రాజధాని తదితర ప్రాంతాల్లో అమలు జరగడంలేదని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు విమర్శించారు..

Sun, 2020-05-17 18:42

విజయవాడలో వందలాదిగా ఉన్న బెంగాలీ వలస కూలీలను స్వగ్రామాలకు పంపుతామని హామీ ఇచ్చి ప్రభుత్వం, అధికార యంత్రాంగం మాట తప్పింది. దీంతో కార్మికులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారి రూముల్లోకి వెళ్ళి మరీ లాఠిఛార్జి చేసి అనేకమందిని గాయపర్చారు. పోలీసుల సమక్షంలో స్థానిక వైసిసి కార్యకర్తలు బెంగాలీ కార్మికులపై దాడిచేసి వలస కూలీలను గాయపర్చారు. వారి ఆందోళనకు మద్దతు తెపడానికి వెళ్ళిన సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి పి.మధు, నగర నేతలు బోజెడ్ల నాగేశ్వరరావు, యు.వి.రామరాజు, సిఐటియు నేత మీరావళి లను పోలీసులు అరెస్టు చేసి తోట్ల వల్లూరు పోలిస్‌ స్టేషన్‌కి తరలించారు. సిపిఐ(యం) నేత బాబూరావు అరెస్టుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. తక్షణమే వారిని విడుదల చేయాలని, వలస కూలీను...

Tue, 2020-05-05 16:54

విజయవాడ 61 వ డివిజన్ శాంతినగర్ లో సిపిఎం అధ్వర్యంలో ఇంటింటికీ మాస్కులు పంపిణీ చేశారు.రెడ్ జోన్ పరిధిలో ప్రజలకు కనీస సౌకర్యాలు, నిత్యవసర సరుకులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. ప్రభుత్వం మద్యం షాపులు తెరవడం పై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉదయం తొమ్మిది గంటల వరకే తమకి వ్యాపారం చేసుకోడానికి అనుమతి వుందని, ప్రభుత్వం మాత్రం సాయంత్రం వరకు మద్యం అమ్మకాలు చేస్తోందని చిరు వ్యాపారులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు

Thu, 2020-04-16 20:03

కర్నూల్ జిల్లా ఇందిరాగాంధీ నగర్ లో ఇంటింటికి కూరగాయలు ఇస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.నిర్మల, పి.యస్.రాధాకృష్ణ, నగర కార్యదర్శి టి.రాముడు మరియూ నాయకులు

Fri, 2020-04-10 15:05

లాక్ డౌన్ నేపధ్యంలో విజయవాడ సింగ్ నగర్ 59, 60 వ డివిజన్ లలో సిపిఎం నాయకులు ఇంటింటికీ కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. నిత్యావసర సరుకుల కొరతతో పాటు, ధరల పెరుగుదల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పామాయిల్ , పప్పు ధాన్యాలు రేట్లు విపరీతంగా పెరిగినా ప్రభుత్వం కంట్రోల్ చేయడంలో విఫలమైందన్నారు. దీపం పథకం కింద ఉన్న వారికి కూడా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. పనుల్లేని కార్మికులకు esi నుండి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. కార్మికులకు కేటాయించిన 1000 కోట్ల నిధులని...

Wed, 2020-04-01 17:11

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా  కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ నగర్, అజిముద్దీన్ నగర్, చల్లా వారి వీధి, వీరు సెక్షన్ కాలని, లక్ష్మీ నగర్ తదితర వీధులలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు బ్లీచింగ్ పౌడర్ చల్లి, ప్రజల ఆరోగ్య పరిరక్షణ లో భాగస్వాములు అయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె. ప్రభాకర రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు పి. నిర్మల, పి. ఎస్. రాధాకృష్ణ, జిల్లా నాయకులు పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఓర్వకల్లు మండలంలో ఉచితంగా కూరగాయల పంపిణీ చేశారు.

Mon, 2020-03-09 18:48

పేదల కోసం పోరాడుతున్న సిపిఎం నాయకులపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. భూ పోరాటంలో అరెస్టయిన సిపిఎం జోన్‌ కార్యదర్శి బి.రమణి, నాయకులు అప్పలరాజు విడుదలైన సందర్భంగా సుజాతనగర్‌లో ఆదివారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ల్యాండ్‌ పూలింగ్‌ను తమతో పాటు విజయసాయిరెడ్డి కూడా వ్యతిరేకించారని, ఇప్పుడు ఏ విధంగా చేపడతారని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలకు ఎక్కడో పద్మనాభపురం, ముదపాక శివారు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలిస్తే ఏలా ఉంటారని ప్రశ్నించారు. నివాసమున్నచోటే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాలిస్తామని చెప్పారని, ఇప్పుడు ఎన్నికల కోడ్‌ రావడంతో ఏ...

Thu, 2019-12-19 15:32

దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే ఎన్‌ఆర్‌సి పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నేడు విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రసంగిస్తూ.. ఎన్‌ఆర్‌సి అనే ప్రధానమైన సవాలును మన దేశం ఎదుర్కొంటోందన్నారు. 73 సంవత్సరాల స్వాతంత్య్రం అనంతరం భారత రాజ్యాంగంలో మౌలికమైన స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసేలా బిజెపి వ్యవహరిస్తోందన్నారు. విశాలమైన భారతదేశంలో వివిధ జాతులు, వివిధ భాషలు, వివిధ మతాలు, స్వేచ్ఛగా జీవిస్తున్నాయని తెలిపారు. బ్రిటీష్‌ వారు వెళిపోతూ.. భారతదేశం నుండి పాకిస్తాన్‌ను విడదీసి మత వైషమ్యానికి కారకులయ్యారని, దేశంలో లౌకికతత్వాన్ని, మత సామరస్యాన్ని కాపాడేందుకు వామపక్షాలు...

Thu, 2019-12-05 17:54

ఉల్లి ధరలు తగ్గించాలని, రేషన్ డిపోల ద్వారా ప్రతి కుటుంబానికి 5కిలోల ఉల్లిపాయలు సప్లే చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలోని రైతుబజార్ లో పర్యటించి కొనుగోలుదారుల భాదలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాద్, శ్రీదేవి తో పాటు సిపిఎం శ్రేణులు పాల్గొన్నారు..

Pages