2016

బహుళజాతి సంస్థల సామ్రాజ్యానికి బాటలు

 ట్రాన్స్‌ అట్లాంటిక్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పార్టనర్‌షిప్‌ (టిటిఐపి) ఒప్పందంపై అమెరికా, ఐరోపా యూనియన్‌ (ఇయు) మధ్య చర్చలు జరుగు తున్నాయి. ఈ ఒప్పందాన్ని ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌ (టిపిపి) ఒప్పందానికి అనుబంధ ఒప్పందంగా అమెరికా పరిగ ణిస్తున్నది.

కూలిన సచివాలయ గోడ ఐదుగురికి తీవ్రగాయాలు

వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పిట్టగోడ కూలి ఐదుగురు కార్మికులకు సోమవారం తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. సిపిఎం క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవి తదితరులు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన రామ్‌చంద్‌, ధర్మేంద్ర, కిరణ్‌ఛౌదరి, జయరామ్‌లతోపాటు మరో వ్యక్తికీ గాయాలయ్యాయి. వీరిలో రామ్‌చంద్‌కు వెన్నుముక విరిగిపోగా ధర్మేంద్రకు తలకు, ఛాతికి, కాలికి తీవ్రగాయాలయ్యాయి.

భాదితులకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి

వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పిట్టగోడ కూలి ఐదుగురు కార్మికులకు సోమవారం తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. సిపిఎం క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవి తదితరులు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కార్మికులను, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాబురావు మాట్లాడుతూ, సచివాలయంలో అనేక దుర్ఘటనలు జరుగతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

శివసేనకు చేదు అవమానం..

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మరోసారి బీజేపీ భాగస్వామ్య పక్షమైన శివసేనకు చేదు అవమానం ఎదురైంది. మోదీ ఇటీవల చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణలో శివసేనకు చోటు దక్కకపోవడంతో ఆ పార్టీ ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతోంది. 

రియల్ ఎస్టేట్ రాజధాని..

రైతులకు ప్లాట్లు ఇవ్వడం మొదలుపెట్టాక వాటితో వ్యాపారం చేయించేందుకు సిఆర్‌డిఎ సిద్ధమైంది. ప్లాట్లతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో అభివృద్ధికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లతో చర్చలు చేపట్టింది.రైతుల భూముల అభివృద్ధికి ముందుకొస్తే బిల్డర్లకు సిఆర్‌డిఎ నుండి అవసరమైన సహాయం అందిస్తామని, సిఎంతో సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ఇన్‌ఛార్జి కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ప్రకటించారు. దీనికి అవసరమైతే చిన్న చిన్న ప్లాట్లు కలుపుకొని పెద్ద కమతాలుగా మార్చుకునేందుకు అవసరమైన నిబంధనలను సవరిస్తామని హామీ ఇచ్చారు.

స్మృతి తొందరపాటు నిర్ణయాలే కారణమా

దేశ వ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమాలు చెలరేగడానికి ఆమె తొందరపాటు నిర్ణయాలు కారణమయ్యాయని బీజీపీ అధిష్టానం గుర్తించడంతోనే ఆమె శాఖపై వేటు పడింది. ముఖ్యంగా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల్లో అలజడికి ఆమె తీసుకున్న నిర్ణయాలే కారణమన్న విషయం తెల్సిందే.

బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు..?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు విడతలుగా భేటీ అయ్యారు. కోర్ కమిటీ భేటీ తర్వాత అమిత్ షా తన ఛాంబర్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. సమావేశం తర్వాత ఓ సీనియర్ నేత అసంతృప్తితో వెళ్లిపోయారని సమాచారం. ఈ కీలక సమావేశానికి మంత్రి కామినేని శ్రీనివాస్ ను పార్టీ హైకమాండ్ ఆహ్వానించకుండా దూరంగా ఉంచింది. 

బిజెపితో సర్దుకు పోవాల్సిందే:బాబు

ఆలయాల కూల్చివేత వ్యవహారంతో పాటు పలు అంశాల్లో బీజేపీ నేతలు ప్రభుత్వ ప్రతిష్ట దిగజారేలా వ్యవహరిస్తున్నారని టీడీపీి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.బీజేపీ నేతల పోకడలతో పార్టీకి, ప్రభుత్వానికీ చెడ్డ పేరు వస్తోందని ముఖ్యమంత్రి దృష్టికి నాయకులు తీసుకెళ్లగా, ప్రస్తుత పరిస్థితుల్లో సర్దుకుపోవాలని ఆయన సూచించినట్లు సమాచారం.

హార్ధిక పటేల్‌ ఆరు నెలల బ‌హిష్క‌ర‌ణ‌

పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఆందోళన సందర్భంగా హింస తలెత్తిన కేసులో హార్ధిక పటేల్‌కు బెయిల్ లభించింది. రాష్ట్రానికి దూరంగా ఆరు నెలల పాటు ఉండాలనే కండీషన్‌పైన గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఏపీలో ప్రజాసాధికార సర్వే..

 ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజాసాధికార సర్వేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం తన నివాసం నుంచి లాంఛనంగా ప్రారంభించారు.దాదాపు 30వేల మందితో ఆరు వారాలపాటు సర్వే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ సర్వే ద్వారా పౌరులకు సంబంధించి వివిధ శాఖల్లో ఉన్న సమాచారాన్నంతా ఒక చోటకి తీసుకురావడంతో పాటు ప్రతి ఒక్కరికి సంబంధించిన కుల, మత, ప్రాంత, సామాజిక, ఆర్థిక పరమైన అంశాలు సర్కారు వద్ద సమగ్రంగా నమోదు కానున్నాయి.

Pages

Subscribe to RSS - 2016