February

మహాజన పాదయాత్రకు సంఘీభావం..

తెలంగాణ రాష్ట్ర సామాజిక, సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో చేపట్టిన మహాజన పాదయాత్ర చారిత్రాత్మకమైందని సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. మహాజన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వందలాది మంది కార్యకర్తలు తెలంగాణాలోని కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం తరలి వెళ్లారు. జిల్లాలోని పోలవరం డివిజన్‌ నుంచి వచ్చిన గిరిజన యువకులు విల్లంబులు చేతబూని, డప్పు వాయిద్యాలతో మహాజన పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు.

పాదయాత్ర బృందానికి సమస్యల వెల్లువ

యడ్లపాడు మండలంలో దళితులు సాగు చేసుకునే భూములు ఆక్రమణలకు గురయ్యాయని, శ్మశాన స్థలాలు లేక దళితులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఈ సమస్యలపై ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. దళితుల సమస్యపై నిర్వహిస్తున్న పాదయాత్ర బుధవారానికి మూడో రోజుకు చేరింది. యాడ్లపాడులో ప్రారంభమైన యాత్ర కారుచోల, ఉన్నవ, వంకాయపాడు, ఉప్పరపాలెం, లింగారావుపాలెం, కొత్తసొలస, పాత సొలస, కొండవీడు, ఛంగీజ్‌ఖాన్‌పేట, సంగం, బోయపాలెం తదితర గ్రామాల్లో దళితవాడల్లో సమస్యలను అధ్యయనం చేశారు.

సామాన్లు తీసుకుంటుంటే కూల్చేశారు

సామాన్లు సద్దుకుంటామన్నా ఆగకుండా ప్రొక్లేయిన్ల్‌తో మున్సిపల్‌ అధికారులు, పోలీసు సిబ్బంది ఇళ్లను కూల్చివేయించారని వావిలాలఘాట్‌ వాసులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వావిలాల్‌ఘాట్‌ వాసులు సామన్లు సద్దుకుంటుం డంగానే మంగళవారం సాయంత్రం పోలీసులు బందోబస్తుతో మున్సిపల్‌ అధికారులు వారి ఇళ్లను నేల మట్టం చేసిన విషయం విధితమే. వావిలాలఘాట్‌ పార్క్‌ అభివృద్ధికి వావిలాలఘాట్‌లో నివాసం వుంటున్న 102 కుటుంబాల ఇళ్లను పీకివేసి ఎస్‌పిజి డిగ్రీకళాశాల్లో చూపించిన ప్రత్యామ్నాయ స్థలానికి వెళ్లి ఇళ్లు అక్కడవేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆంజనేయులకు ప్రాణం పోశారు

అంకితభావం, వృత్తి నైపుణ్యంతో జిజిహెచ్‌ వైద్యులు అద్భుత రీతిలో శస్త్రచికిత్సలతో చేసి, అరుదైన స్దితిలో వ్యక్తికి ప్రాణం పోయడం సర్వత్రా హర్షణీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అభినందించారు. రౌడీషీటర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో జిజిహెచ్‌లో చేరిన సిపిఎం శాఖ కార్యదర్శి ఆంజనేయులు గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అత్యంత తీవ్రత కలిగిన ముఖంపై గాయాలతో మరణం అంచున నిలిచిన ఆంజనేయులుకు జిజిహెచ్‌లోని వివిధ విభాగాల వైద్య నిపుణులు శ్రమించి అరుదైన శస్త్రచికిత్సలు చేయడంతో ఆంజనేయులు బతికి బయటపడ్డారని పేర్కొంటూ సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు వైద్య నిపుణులకు ఘనసత్కారం చేశారు.

Pages

Subscribe to RSS - February