March

చిన్నపొదుపు మొత్తాల వడ్డీరేట్లపై కోత..

చిన్న పొదుపు మొత్తాల పథకాల వడ్డీరేట్లపై కోతపడింది. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌), కిసాన్‌ వికాస్‌ పత్ర (కేవీపీ), సీనియర్‌ సిటిజెన్ల డిపాజిట్లు సహా పలు పథకాలపై చెల్లించే వడ్డీరేట్లను ప్రభుత్వం తగ్గించి వేసింది. ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 మధ్య కాలానికి పీపీఎఫ్‌పై వడ్డీరేటును ప్రస్తుతమున్న 8.7 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది.

పిల్లల చదువు బాధ్యత కార్పొరేట్లదేనట..!

త్రివిధ దళాలు, పోలీసు, పారా మిలిటరీ బలగాల్లో పనిచేస్తూ అమరులైన జవాన్ల కుటుంబాల పిల్లల చదువు సంధ్యల బాధ్యతను కార్పొరేట్‌ రంగం తీసుకోవాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ వీర జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు ఆ రంగంలోని వారంతా చేతులు కలపాలిలని కేంద్ర హోం మంత్రి రాజనాథ్ వ్యాఖ్యానించారు..

 

2020 కల్లా భారత పరిశ్రమలపై 665 కోట్లు

వివిధ ప్రభుత్వ పథకాల్లో కంపెనీ పాత్రపై చర్చించడం కోసం అమెరికా టెక్నాలజీ దిగ్గజ సంస్థ సిస్కో ఛైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శుక్రవారమిక్కడ కలిశారు. 2020 కల్లా భారత అంకుర పరిశ్రమలపై 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సిస్కో ప్రకటించింది. అంతే కాకుండా 2.5 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లూ తెలిపింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై BJP కసరత్తు

ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే భేటీలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్లు పాల్గొంటున్నారు. నేషనల్ ఎగ్జిక్యూట్‌మెంట్ మీట్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభించారు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు. 

ఏప్రిల్‌ 2 రావాల్సిందిగా మాల్యాకు సమన్లు

తనకు మరింత గడువు ఇవ్వాలన్న విజయ్‌ మాల్యా విజ్ఞప్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మన్నించింది. దర్యాప్తు అధికారి ముందు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు గడువు పెంచింది. ఏప్రిల్‌ 2న రమ్మని తాజాగా సమన్లు జారీ చేసింది. అంతక్రితం సమన్ల ప్రకారం శుక్రవారమే (ఈనెల 18న) మాల్యా హాజరుకావాల్సి ఉంది. 

అమరావతిలో అత్యుత్తమ హైకోర్టు..

 అమరావతిలో ప్రపంచ అత్యుత్తమ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో జరిగిన న్యాయాధికారుల సదస్సు ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయాధికారులు, ధర్మాసనాలు ఇచ్చే తీర్పులు సమాజానికి మార్గదర్శకాలు అని చంద్రబాబు అన్నారు

సంఘ విద్రోహ శక్తుల్ని ఐక్యంగా ఎదుర్కొవాలి

పేదలు ఐక్యంగా ఉండటం ద్వారా సంఘ విద్రోహ శక్తుల్ని ఐక్యంగా ఎదుర్కొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 9న రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన సుందరయ్య కాలనీ సిపిఎం నాయకుడు కె ఆంజనేయులు చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయిన సందర్బంగా గురువారం రాత్రి కాలనీలో బహిరంగ సభ నిర్వహించారు.

సంఘ విద్రోహ శక్తుల్ని ఐక్యంగా ఎదుర్కొవాలి

పేదలు ఐక్యంగా ఉండటం ద్వారా సంఘ విద్రోహ శక్తుల్ని ఐక్యంగా ఎదుర్కొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 9న రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన సుందరయ్య కాలనీ సిపిఎం నాయకుడు కె ఆంజనేయులు చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయిన సందర్బంగా గురువారం రాత్రి కాలనీలో బహిరంగ సభ నిర్వహించారు. తొలుత ఆర్టీవో కార్యాలయం నుండి కాలనీకి ర్యాలీ నిర్వహించారు.సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఆంజనేయులుకు చికిత్స అందించి కోలుకునేట్లు చేయటంలో జిజిహెచ్‌ వైద్యుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కోరుతూ జివిఎంసి కార్యాలయం ముట్టడి

ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు  ఇవ్వాలని కోరుతూ జివిఎంసి కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బి. గంగారావు గారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన క్రింద ఆన్‌లైన్‌ ద్వారా 1,84,424 మంది పేదలు  ధరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికి 80వేల మందికి సర్వే చేశారు. ఇందులో 64వేల మందికి ఆధార్‌, రేషన్‌ కార్డు సరిగ్గా లేవని చెప్పి తొలగించడం జరిగింది. అడ్రసు దొరకలేదని 40వేల వరకు తొలగించారు.  దీనీవల్ల అర్హులైనవారికి ఇళ్ళు వచ్చే అవకాశం సన్నగిల్లుతుంది. సర్వే కూడా సరిగ్గా చేయడం లేదు. సర్వేచేసిన వాటిని  కంపూటర్‌లో అప్‌లోడ్‌ చేయడంలేదు.

స్థ‌లాలు, ప‌ట్టాలు, రిజిస్ట్రేష‌న్‌లు కోరుతూ మార్చి 22న జ‌రిగే ఛ‌లో విజ‌య‌వాడ కార్యక్ర‌మం జ‌య‌ప్రదం చేయాల‌ని సి.పి.ఎం-సిపిఐ సైకిల్ ర్యాలి

 స్థ‌లాలు, ప‌ట్టాలు,  రిజిస్ట్రేష‌న్‌లు కోరుతూ మార్చి 22న జ‌రిగే ఛ‌లో విజ‌య‌వాడ కార్యక్ర‌మం జ‌య‌ప్రదం చేయాల‌ని సి.పి.ఎం-సిపిఐ సైకిల్ ర్యాలి

Pages

Subscribe to RSS - March