జిల్లాలోని పేదలు కూలి పనుల నిమిత్తం వలసలు పోతున్నారని, వాటిని అరికట్టేందుకు తక్షణమే ఉపాధి హామీ పథకం కింద పనులు ప్రారంభించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కరువు విలయతాండం చేస్తుందని, ఈ పరిస్ధితుల్లో కూలి పనులు లేకపోవడంతో వేలాది మంది ఇతర జిల్లాలకు వలసలు పోతున్నారని తెలిపారు. ఉపాధి హామీ నిధుల్లో 50శాతం సిసి రోడ్లకు ఖర్చు చేస్తున్నారన్నారు. వాస్తవానికి ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులతో చేపట్టే పనుల్లో యంత్రాలు ఉపయోగించ రాదనే నిబంధన ఉందని, కాని ఈ నిధులు సిసి రోడ్లకు ఖర్చు చేయడం నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని పేర్కొన్నారు.