పార్టీ కార్యక్రమాలు

Wed, 2016-04-06 17:40

రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. ఈ నెల 3, 4 తేదీల్లో విజయవాడలో జరి గిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ తీర్మానాలను రాష్ట్ర కార్యదర్శి పి. మధు మంగళవారం నెల్లూరులో విడుదల చేశారు. నిజాలను కప్పిపుచ్చి సమస్యలను పక్కదారిపట్టించేలా బూటకపు ప్రచా రాలకు దిగుతున్న ప్రభుత్వ తీరును సీపీఐ(ఎం) తీవ్రంగా విమర్శించింది. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నా తగిన సహాయ చర్యలు చేపట్టలేదని ఆ పార్టీ పే ర్కొంది. వివిధ రంగాల కార్మికులు తమ సమస్యల పరి ష్కారానికి ఉద్యమబాట పట్టారని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన హామీ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.30 వేల...

Sun, 2016-04-03 19:08

ప్ర‌జాస‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుండా జీతాలు పెంచుకోవ‌డం సిగ్గుచేటు. 
    -  సిపిఎం న‌గ‌ర కార్య‌ద‌ర్శి దోనేపూడి కాశీనాథ్‌ 
      ప్ర‌జా స‌మ‌స్య‌లు   ప‌క్క‌న పెట్టి కార్పొరేట‌ర్ల జీతాలు, అల‌వెన్సులు పెంచుకునే ప‌నిలో అదికాప‌క్షం వుంద‌ని, మ‌రో ప్ర‌క్క జీతాలు పెంచ‌మ‌ని ఆందోళ‌న చేస్తున్న కార్మికులను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఇది సిగ్గుప‌డాల్సిన విష‌యం అని కాశీనాథ్ అన్నారు. సోమ‌వారం జ‌రిగే కౌన్సిల్ స‌మావేశంలో ఈ విష‌యం సిపిఎం కార్పొరేట‌ర్ నిల‌దీయ‌నున్నార‌ని తెలిపారు. దీనితో పాటు ప‌లు అంశాల‌పై కౌన్సిల్  చర్చించాల‌ని ఆయ‌న కోరారు.  మేయర్‌ ఏకపక్షంగా కౌన్సిల్‌ నిర్వహించినట్లయితే కౌన్సిల్‌ లోప, బయట ఆందోళన చేపట్టాల్సి వస్తోందని  హెచ్చ‌రించారు.  ...

Fri, 2016-04-01 16:29

'రాష్ట్రాన్ని విభజించి కట్టుబట్టలతో రోడ్డు మీదకు నెట్టేశారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వానికి అండగా నిలవండి. జీత భత్యాలు అడగకండ'ి అంటూ హితబోధ చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు..ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంచటాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. పెంచిన జీతాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఒకసారి నిస్వార్థంగా మీకు సేవ చేసుకునే భాగ్యం కలుగజేయండి అంటూ ఎన్నికల ముందు ప్రజలకు దండాలు పెట్టిన ఈ ప్రజా ప్రతినిధులు తీసుకునే డబ్బు ప్రజలదేనని గుర్తు చేశారు. ప్రజలు కట్టే పన్నులు, అదీ పేదల రక్తం పిండి, జనంతో మందు తాగించి, పెట్రోల్‌, డీజిల్‌ల్లో కొట్టేసిన డబ్బేనని తీవ్రంగా విమర్శించారు. తమ తాత ముత్తాతలు సంపాదించిన...

Thu, 2016-03-31 15:45

'అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను అడుగుతున్నాం.. గన్నవరం ప్రాంతంలో జరుగుతున్న బలవంతపు భూసేకరణను ఎందుకు అడ్డుకోవటం లేదో తేల్చి చెప్పాలి' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భూదాహన్ని వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా గన్నవరం శాంతిథియేటర్‌ సెంటర్‌లో బుధవారం వామపక్షాల ఆధ్వర్యాన బహిరంగ సభ నిర్వహించారుగన్నవరం ప్రాంతంలో నిజమైన అభివృద్ధి ఎలా జరగాలో గతంలోనే పుచ్చలపల్లి సుందరయ్య చేసి చూపారని గుర్తు చేశారు. కేసరపల్లిలో ఐటి పార్కు ఏర్పాటై ఆరేళ్లవుతున్నా ఒక్కరికీ ఉద్యోగం రాలేదన్నారు. రైతులకు నష్టం కలిగించే భూసేకరణకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాల్లోకి రావాలన్నారు. గన్నవరం ఎంఎల్‌ఎ రామవరప్పాడులో...

Wed, 2016-03-30 16:10

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో రెండ్రోజుల పాటు జరిగిన సిపిఎం జిల్లా ప్లీనం మంగళవారం ముగిసింది. రెండో రోజు సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత 14 నెలల్లో చేపట్టిన పోరాటాలను సమీక్షించుకుని, రాబోయే ఏడాది కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యచరణను రూపొందించారు. రెండు రోజుల ప్లీనంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని, తదితర ఎనిమిది అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. రాబోయే ఏడాది కాలంలో విద్యా, ఉపాధి, సామాజిక అంశాలపై దృష్టి సారించి పనిచేయాలని...

Tue, 2016-03-29 12:15

విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ త్వరలో రాయలసీమ బంద్‌ చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ శాఖ ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఉరవకొండ పట్టణంలో బహిరంగ సభ జరిగింది. అంతకుముందు ఆర్‌టిసి బస్టాండ్‌ నుంచి టవర్‌క్లాక్‌ సర్కిల్‌ వరకు ఎర్రజెండాలను చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న గాలిమరల్లో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని తెలిపారు. కంపెనీలు ఎకరా మూడున్నర లక్షల రూపాయలకు కొనుగోలు చేసి రూ.30 లక్షలకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాయని చెప్పారు. రూ.3 కోట్ల విలువజేసే...

Fri, 2016-03-25 16:24

తాత్కాలిక సచివాల‌య నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శుక్ర‌వారం పరిశీలించనున్న నేపథ్యలో ముందస్తుగానే సిపిఎం రాజధాని ప్రాంత నాయకు లు ఎం.రవి, జె.నవీన్‌ప్రకాష్‌ల‌ను అరెస్టు చేసి, నిర్భందించడాన్ని నిరసిస్తూ  విజ‌య‌వాడ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో లెనిన్‌ సెంటర్‌లోని సి.ఆర్‌.డి.ఏ కార్యాయం వద్ద ధర్నా చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకుల‌ను వెంటనే విడుద చేయాల‌ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా  సిపిఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి ప్రజారాజధాని నిర్మిస్తామని చెబుతూనే ప్రజపై నిర్భంధ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.    ఎటువంటి నిరసనకు దిగకపోయినా ముందస్తుగానే సిపిఎం నేతల‌ను అరెస్టు చేసి నిర్భందించడం...

Tue, 2016-03-22 12:46

రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజధాని నగరంలో రెండు మూడు రోజులపాటు పరిపాలనను స్తంభింపజేస్తామని వామపక్షాల నాయకులు హెచ్చరించారు. కార్పొరేట్‌ కంపెనీలు, విదేశీ సంస్థలకు వేలాది ఎకరాల భూములను కేటాయించే ప్రభుత్వం, పేద వాడికి మూడు సెంట్ల స్థలం ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించా రు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, కొండ ప్రాంత వాసులకు పట్టాలు ఇవ్వాలని, ఆక్రమిత ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నాయకులు డిమాండు చేశారు..పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు  వేలాది...

Tue, 2016-03-22 09:41

పట్టణ, నగర ప్రాంతాల నివాసులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం ప్రదర్శన, బహి రంగ సభ ఏర్పాటు కానున్నాయి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి గాంధీనగర్‌లోని జింఖానా క్లబ్‌ వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్లు వామ పక్ష నాయకులు తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పట్టణ, నగ ర ప్రాంత వాసులకు ఒక్క ఇంటినిగానీ, నివేశన స్థలాన్నిగానీ మంజూరు చేయలేదని నాయకులు విమర్శించారు. సుమారు పది లక్షల మంది ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం జన్మభూమి మాఊరు గ్రామసభలలో దరఖాస్తు చేసుకు న్నారు. ఏ ఒక్కరికీ ఇల్లు, స్థలం రాకపోయినా, వచ్చిన అర్జీలను 85 శాతం పరిష్కరించినట్లు ప్రభుత్వం పేర్కొనటం గమనార్హమన్నారు. 

Sun, 2016-03-20 19:54

ఇళ్ళపట్టాలు, ఇండ్లస్థలాలు ఇవ్వాలని మచిలీపట్న‌ ంలొ మున్సిపల్ కార్యాలయం వద్ద దర్నాలో మట్లాడుతున్న సి.పి. యం. జిల్లాకార్యదర్మి ఆర్. రఘు, చౌటపల్లి రవి, కోడాలి.శర్మ

Fri, 2016-03-18 16:40

 స్థ‌లాలు, ప‌ట్టాలు,  రిజిస్ట్రేష‌న్‌లు కోరుతూ మార్చి 22న జ‌రిగే ఛ‌లో విజ‌య‌వాడ కార్యక్ర‌మం జ‌య‌ప్రదం చేయాల‌ని సి.పి.ఎం-సిపిఐ సైకిల్ ర్యాలి

Wed, 2016-03-16 21:07

కొద్ది నెల్లో కృష్ణా పుష్కరాల‌ నేపథ్యంలో భవానీపురం కృష్ణా కరకట్ట వాసుల‌ను తొల‌గించే ఉద్దేశ్యంతో నగరపాల‌క సంస్థ అధికారులు బుధవారం హడావిడిగా ఇళ్ళ తొల‌గింపు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానికు లు వారిని అడ్డగించి నోటీసులు తీసుకోం, మా ఇళ్లు తొల‌గించటానికి అంగీకరించమని పున్నమి హాోటల్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు సి.హెచ్‌. బాబూరావు సంఘటనా స్థలానికి చేరుకుని వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. అనంతరం స్థానికుల‌తో కలిసి కరకట్ట ప్రాంతంలో ప్రదర్శనగా బయలుదేరి స్వాతి సెంటర్‌కు చేరుకున్నారు. స్వాతి సెంటర్‌లో  రాస్తారోకో  నిర్వ‌హించారు.  స్థానికులు మాట్లాడుతూ, గత నాలుగు రోజుల‌ క్రిందట...

Pages