పార్టీ కార్యక్రమాలు

Wed, 2016-06-08 14:15

సిపిఎం రాష్ట్ర కమిటీ మూడు రోజుల సమావేశాలు మంగళవారం భీమవరంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ధాన్యానికి ధర లేదు, పామాయిల్‌కు ధర లేదు.. ప్రజలు కొనే వస్తువుల ధరలు మాత్రం మండిపోతున్నాయని విమర్శించారు. కౌలురైతులకు రక్షణగా పెద్దఎత్తున పోరాటం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్లే రిజర్వేషన్లపై ఉద్యమాలు వస్తున్నాయన్నారు. తుందుర్రు ఫుడ్‌పార్క్‌ నిర్మించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోందని, అదే జరిగితే పెద్దఎత్తున పోరాటం తథ్యమని అన్నారు. 

Mon, 2016-06-06 17:40

నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు ముందు గుజరాత్ లోని మితివిర్ధిలో నిర్మించి వలసిన అణు విద్యుత్ కేంద్రాన్ని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడకు తరలిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించడాన్ని సిపియం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని విశాఖ సిపియం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్లు సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  సిహెచ్.నరసింగరావు తెలిపారు .

Mon, 2016-05-23 11:50

సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ దాడిని ఖండిస్తూ సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేరళలో లెఫ్ట్ పార్టీల విజయాన్ని తట్టుకోలేకే బీజేపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tue, 2016-05-17 14:24

చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతనే జిల్లాలలో పర్యటించాలని లేదంటే చంద్రబాబు నాయుడు పర్యాటనను అడ్డుకుంటామని సిపిఎం నాయకులు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నాకార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఏ జిల్లా పర్యటనకు వెళ్లిన అక్కడ సమస్యలను పరిష్కరించాలని కోరిన వారిని అరెస్టులు చేయడం పరిపాటిగా మారిందని అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని..తాము సిపిఎం గా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని జిల్లా కార్యదర్శి శేషబాజ్జి తెలియజేశారు.

Wed, 2016-05-11 13:04

వెలగపూడి సచివాలం ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్తత నెలకొంది. సచివాలయం నిర్మాణ ప్రాంతంలో కార్మికుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామపక్ష నేతలు కార్మికులకు మద్దతుగా వచ్చిన సీపీఎం నేతలను మంగళవారం నాడు లాఠీ ఛార్జ్ జరిపారు. ఈ ఘటనలో సీపీఎం నేతలను  అరెస్ట్ చేసి పోలీసులు  నిర్భంధంలో వుంచారు.కార్మిక పక్ష నేతలమైన మేము దేనికి భయపడమనీ కార్మికులకు మా మద్ధతు ఎప్పుడూ వుంటుందని వామపక్ష నేతలు పేర్కొంటున్నారు.

Fri, 2016-05-06 20:22

కృష్ణా పుష్కరాల పేరు చెప్పి ఘాట్‌ను నిర్మిస్తామని, ప్రజల ఇబ్బందును తొల‌గించేందుకు ఇళ్ళు తొల‌గించాల్సి వస్తుందని మాయమాటలు చెబుతున్న తెలుగుదేశం ఈ ప్రాంతంలో పర్యాటక రంగం పేరుతో సింగపూర్‌, జపాన్‌కంపెనీల‌ వ్యాపారాల కోసం పేదల ఇళ్ళు కూల్చ‌డం అన్యాయం.  వెంటనే ఈ చర్యలు వెనక్కి తీసుకోవాల‌ని కోరుతూ కరకట్టవాసులు శుక్రవారం ఉదయం సైన్స్‌సెంటర్‌ వద్ద పెద్దఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు శ్రీ సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ కృష్ణాపుష్కరాల‌కు నిజంగా ఇళ్ళు తొగించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే కరకట్ట వాసు ఇళ్ళకు కృష్ణానదికి మధ్యలో పున్నమీ హోటల్‌, సైన్స్‌ సెంటర్‌, ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్‌ు మరియు స్థలాలు ఉన్నాయి....

Fri, 2016-05-06 12:52

గత నెల రోజులుగా అక్కడ కనీస సౌకర్యాలు, వేతనాలు, ఫిఎఫ్ ,ఇఎస్ఐ కోసం జరుగుతున్న ఆందోళనలో వేడి ఎక్కడ తగ్గడం లేదు..రోజు పోలీసుల అరెస్టులు, మహిళల ఆందోళనలు, ధర్నలు వివిధ ప్రజాసంఘాల సంఘీభావాలు, వివిధ పార్టీల సపోర్టులు..ఇది ఇప్పుడు బ్రాండిక్స్ దగ్గర పరిస్ధితి.. బ్రాండిక్స్ లో లో ఆందోళన చేస్తున్న కార్మికులకు మేము అండగా ఉన్నమంటూ వామపక్షలు కదిలాయి. ఈరోజు బ్రాండిక్స్ కార్మికులు నివాసముండే పూడిమడక, తిమ్మరాజుపేట, హరిపాలెం గ్రామాలు, బ్రాండిక్స్ ప్యాక్టరీ లను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. సమస్యలు అడిగితెలుసుకున్నారు. కార్మికులతో మమైక మైయ్యారు. సమస్యలపై పోరాటబావుట ఎగువవేస్తామని కార్మికులకు తెలిపారు..

Mon, 2016-04-18 15:12

 25 ఏళ్ల సరళీకరణ విధానాల వల్ల దేశంలో అన్ని రంగాల్లోనూ అసమానతలు తీవ్రంగా పెరిగాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంతోపాటు భారత దేశానికి అనుకూలమైన సోషలిస్టు ప్రత్యామ్నాయం కోసం కృషి చేయటం ప్రజలముందున్న కర్తవ్యమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ స్పష్టం చేశారు. మార్క్సిస్టు మేథావి మాకినేని బసవపున్నయ్య తన జీవితాంతం సోషలిజం కోసం పని చేశారని, దేశంలో సోషలిస్టు ప్రత్యామ్నాయాన్ని సాధించటమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళని కరత్‌ చెప్పారు. 25 ఏళ్లలో సరళీకృత ఆర్థిక విధానాల అమలు దేశ ఆర్థిక రంగం మీదే కాకుండా రాజకీయ, సామాజిక, సాంస్కృక రంగాలన్నింటిపైనా తీవ్ర ప్రభావాన్ని చూపించాయన్నారు. సరళీకరణ ఆర్థిక విధానాలను వ్యతిరేకించటంతోపాటు ప్రత్యామ్నాయాన్ని...

Sun, 2016-04-17 18:59

నిన్న అంబేద్కర్ కి 125అడుగుల విగ్రహం కడతామని గొప్పలు చెప్పి . . . ఈరోజు రాజ్యాంగ విరుద్దంగా CRDA పరిధిలో ఇచ్చే ఉద్యోగాలకు రిజర్వేషన్స్ వర్తించవు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం దారుణం .  విజయవాడలో సీపీఎం నిరశన .

Thu, 2016-04-14 17:11

దళితుల సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం దళితులను పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు రావడంతోనే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు కారెం శివాజీని ఛైర్మన్‌గా నియమించారని ఆయన అన్నారు. రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు అంటరానితనాన్ని నిర్మూలించినపుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళులర్పించినట్లని అన్నారు.   

Sun, 2016-04-10 19:23

ఒక పక్కన అధికారుల‌తో నోటీసు ఇప్పిస్తూ, ఇళ్లు ఖాళీ చేయాల‌ని బెదిరిస్తూ మరోపక్కన మీరెవ్వరూ నోటీసులు తీసుకోవద్దు మీకు మేము అండగా వుంటామని చెబుతున్న తొగుదేశం ప్రజాప్రతినిధు ప్రజల‌ను మోసగించవద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు సి.హెచ్‌. బాబూరావు అన్నారు. ఆదివారం భవానీపురం పున్నమి హాోటల్‌ వద్ద నుండి ప్రారంభమైన పాదయాత్రలో బాబూరావు పాల్గొని కరకట్ట వాసుతో మాట్లాడారు. నోటీసులు తీసుకోవద్దని చెప్పే ప్రజాప్రతినిధులు తమ అధికార పార్టీ అధినేతతో మాట్లాడి నోటీసు రద్దుచేయిస్తే ఈ సమస్య ఉండదన్నారు. ఆ పనిచేయకుండా ఇక్కడకు వచ్చి ఈ రకంగా మాట్లాడటం ప్రజను మోసగించటమే అవుతుందన్నారు. ఇప్పటికైనా తొగుదేశం పార్టీ కరకట్ట ఇళ్లు తొగించానుకుంటున్నారా, ఇక్కడే...

Sat, 2016-04-09 12:46

రాష్ట్రంలో దళితుల సమస్యలు పరిష్కారం కాకపోగా హక్కులనూ కాలరాస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. నేటికీ అంటరానితనం సమాజంలో వేళ్లూనుకుని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విగ్రహాలు పెట్టి ప్రజల కళ్లుగప్పేందుకు పాలకులు పూనుకుంటున్నారని, ఆయనకు నిజమైన నివాళులర్పించాలంటే రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని, సామాజిక న్యాయం అందేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులతో భర్తీ చేయాల్సిన బ్యాక్‌లాగ్‌ పోస్టులను అర్హులు లేరనే పేరుతో ఇతరులకు దారాదత్తం చేస్తున్నారని, అంబేద్కర్‌ ఆశించిన పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయడం లేదని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌కు చైర్మన్‌, కమిటీ సభ్యులను నియమించాలని డిమాండ్‌ చేశారు. దళితులపై...

Pages