ఈ రోజు పేదలకు ఇళ్ళు, ఇళ్ళస్థలాలు, ఇళ్ళ పట్టాలివ్వాలని కోరుతూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో విశాఖపట్నం అర్భన్ తహసీల్ధార్ కార్యాయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం మండల తహసీల్ధార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ(ఎం) నగర కార్యదర్శి బి. గంగారావు గారు మాట్లాడుతూ జి.వో నెం 296 నిబంధనలను అధికారులు అతిక్రమిస్తున్నారని ధరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేది ఉన్న కంప్యూటర్‌లో ఆఫ్‌లోడ్ చేయడం లేదని, ఆన్‌లైన్‌లో ధరఖాస్తు స్వీకరించడం లేదని, విశాఖనగరంలో ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు నిర్మించుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అత్యధిక మందికి పట్టాలు లేవు. ఫలితంగా పేదలు తీవ్ర అభద్రతా...
పార్టీ కార్యక్రమాలు
రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో వామపక్షాల కార్యకర్తలు కదంతొక్కారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాకపోవడంతో ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. వామపక్షాల నేతృత్వంలో 15 రోజుల పాటు సీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బస్సుయాత్ర సాగింది. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ-సాగునీటి ప్రాజెక్టులు ఒక సంవత్సరంలో పూర్తి చేయాలి.. డిమాండ్లతో వామపక్షాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఈ ఆందోళనలో పాల్గొనడానికి సీమ జిల్లాల నుంచి వస్తున్న కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్...
రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గృహనిర్మాణం కింద విశాఖనగరంలో పెందుర్తి ప్రాంతంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్ల నిర్మానం చేపట్టింది. ఈరోజు సిపిఎం గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి శ్రీ బి.గంగారావు నాయకత్వంలో బృందం పెందుర్తిలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించింది. ఈ నిర్మాణా యొక్క భద్రత, ప్రమాణాలు , నాణ్యత, దాని కాలవ్యవధి తదితర అంశాపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటిపై స్వతంత్ర ఇంజినీరింగ్ నిపుణుల బృందంచే విచారణ జరిపించి, బృందం దృష్టికొచ్చిన పలు విషయాలపై విచారణ జరిపి వాస్తవాలు వెల్లడిరచాలని నగర కార్యదర్శి బి గంగరావు డిమాండ్ చేశారు.
విశాఖనగరంలో హదూద్ తుపాను...
విశాఖ నగర ఎంపి కె.హరిబాబుగారు నిన్న రైల్వేజోన్‌పై ప్రకటించిన కుట్రపూరిత ప్రకటనను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ రావటానికి చాలా అడ్డంకులు,సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని ప్రకటించారు ఈ వ్యాఖ్యలకు నిరసనగా సిపిఐ(ఎం) గ్రేటర్ విశాఖనగర కమిటీ ఈరోజు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేసింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నగరకార్యదర్శి బి. గంగారావు ప్రసంగిచారు. మొన్నటిదాక అదిగోవస్తుంది, యిదిగో వస్తుందని ప్రకటను గుప్పించిన ఎంపి హరిబాబు చావుకబురు చల్లగా చేప్పినట్లు విశాఖకు రైల్వేజోన్ రాదని పరోక్షంగా వ్లెడిచారు. రైల్వేజోన్ పై వేసిన కమిటి విశాఖకు వ్యతిరేకంగా...
ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఈ నెల 22న వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో ప్రదర్శన నిర్వహించనున్నారు.గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తామని చెప్పిన టిడిపి ప్రభుత్వం, 21 మాసాలు గడిచినా ఆ హామీని అమలు చేయలేదని వారు విమర్శించారు. 21 మాసాలలో పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలలో ఇళ్ల నిర్మాణం గానీ, స్థలాల కేటాయింపుగానీ జరగలేదని పేర్కొన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు పెద్ద సంఖ్యలో ఉండగా, పట్టాలు లేకుండా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నవారు కూడా ఉన్నారన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాల కోసం గత మూడు జన్మభూమి కార్యక్రమాలలో పేదలు పెట్టుకున్న లక్షలాది అర్జీలు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి మూడు...
అధ్యయనం పేర నగరానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంఎల్‌ఏలు అమెరికా పర్యటన చేసి అక్కడి నగరాల గురించి ప్రచారం చేస్తున్నారు. విశాఖ నగరాన్ని కూడా శాన్‌ఫ్రాన్సిస్‌కో, న్యూయార్క్, వాషింగ్‌టన్‌లగా మారుస్తామని అంటున్నారు. నగరాలు బాగా అభివృద్ది చెందాయని, అక్కడ రోడ్‌మీద కాగితం కూడ ఉండదని, ప్రతి నీటిబొట్టుకి డబ్బుచెల్లిస్తారని, ట్రాఫిక్, పొల్యుషన్ సమస్యలేదని, డ్రైనేజివ్యవస్థ బాగుంటుదని, ప్రతిసేవకు యూజర్ చార్జీలు వసూలు చేస్తారని తెలియజేస్తున్నారు.
ఎంఎల్‌ఏల ప్రకటను చాలా హాస్యాస్పధంగా ఉన్నాయి. వారి చేప్పేవిషయాలు విశాఖనగర ప్రజలకు తెలియనవికావు. ఆనగరాల్లో స్థానిక ప్రభుత్వవలు ప్రజల ఎడల ఎలాంటి బాధ్యతు నిర్వర్తిస్తున్నాయో వాటిని...
విద్యుత్ పంపిణీ సంస్థలు 2016-17కి సంబంధించి ఆదాయము, వ్యయములపై సమర్పించిన నివేదికలో ప్రతిపాదించిన టారిఫ్‌పై విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ బహిరంగ విచారణలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యు సిహెచ్.బాబూరావు పలు అంశాలు అధికారులు తీసుకెళ్ళారు. విద్యుత్ వినియోగదారులపై 783 కోట్ల రూపాయ భారాన్ని మోపే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. గృహవినియోగదారులు, చిరువ్యాపారులు, స్థానిక సంస్థలు, రైల్వేట్రాక్షన్, కుటీరపరిశ్రమలపై ఈ భారం పడుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతిమంగా ప్రజలే వీటిని మోయాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా సహజవాయువు, బొగ్గు ఇతర ఇందన వనరులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఛార్జీల పెంపు అన్యాయం. ఢల్లీిలో 50శాతం విద్యుత్ చార్జీలు...
కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయం ఏమిటో తెలుసు కునేందుకు దీనిపై ఒక శ్వేత పత్రాన్ని వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(ఎం) డిమాండ్ చేసింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి చూపించిందని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను గాలికొదిలేసిందని విమర్శించారు. కేంద్రాన్ని రాష్ట్రం ఏం కోరింది, కేంద్రం ఏమిచ్చిందీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత రెండో పూర్తి స్థాయి బడ్జెట్, కనుక ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలు. గత ఏడాది సర్ధుబాటుతోనే సరిపెట్టుకున్నా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనే అంశాలపై...
రాయలసీమ జిల్లాలకు అన్యాయం చేస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోరుతూ వామ పక్షాలు చేపట్టిన బస్సుయాత్ర సందర్బంగా మధు మాట్లాడుతూ, రాయలసీమలో ఏటేటా రైతు ఆత్మహత్యలు పెరుగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాల్లో తాగు, సాగునీరు లేదని, భూగర్భ జలాలు అడుగంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో హంద్రీ నీవా, గాలేరు నగరికి తగినన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాయలసీమ జిల్లాలకు చెందిన ఆరుగురు ముఖ్య మంత్రులయినా గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం తప్పుబట్టింది. ప్రజలపై భారాలు మోపడం సరికాదని పేర్కొంది. ఈ ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని, పెద్ద పెద్ద కంపెనీలపై పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తే ఛార్జీలు పెంచాల్సినవసరం లేదన్నారు. నాలుగు శాతం అనేది చాలా ఎక్కువని, ఛార్జీలు పెరగడం వల్ల ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి మిగులు విద్యుత్ ఉండడమే కాకుండా 24గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చన్నారు. దాదాపు 1650 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని,...
కనీస వేతనం అడిగితే ఇలా అక్రమ అరెస్టులా? ఇదేమి ప్రజాస్వామ్యం? పోలీసులతో ప్రభుత్వ పాలనా సిగ్గు, సిగ్గు!!
నగరంలో పేదలు నివశించే కాలువకట్టలపై ఇళ్లకు సర్వే పేరుతో ప్రభుత్వం తొగించేందుకు , పేదలను రోడ్డున పడేసేందుకు కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు సిహెచ్ బాబూరావు అన్నారు. మంగళవారం సిపిఎం, సిపిఐ నగర కమిటి ఆద్వర్యంలో బుడమేరు మద్యకట్ట ప్రాంతంలో ఇళ్ల సమస్య పరిష్కారం కోరుతూ పాదయాత్రను నిర్వహించారు. బుడమేరు వంతెన వద్ద నుండి ప్రారంభమైన ఈ పాదయాత్రలో పాల్గన్న సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో బుడమేరు మధ్యకట్ట ఇళ్ళ జోలికి వస్తే సహించేది లేదన్నారు. జనాభా లెక్కులు, ఇతర సర్వే నగరమంతా చేయకుండా కేవం కాలువకట్టలపైనే ఎందుకు చేస్తున్నారో స్పష్ట పరచాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్ల తొగింపుకు ప్రభుత్వం పూనుకుందన్నారు...