ఆర్టికల్స్

ప్రపంచీకరణ రెండవ అవతారం..

క్రెడిట్‌ న్యూస్‌ ఇంటర్నేషనల్‌ రీసెర్చి (సిఎన్‌ఐఆర్‌) తన తాజా నివేదికలో 'ప్రపంచీకరణ' భవిష్య త్తుపై అనేక ఆలోచనలు మన ముందుంచింది. ప్రపంచీకరణను సిఎన్‌ఐఆర్‌ రెండు ప్రధాన స్రవంతులుగా అభి వర్ణించింది. ఒకటి, ఐరోపా దేశాల్లో, అమెరికాలో ప్రధానంగా 1870లో ప్రథమ ప్రపంచీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంలో రైలు, రోడ్డు, నౌకాశ్రయాలు నిర్మితమయ్యాయి. సూయజ్‌ కెనాల్‌ నిర్మాణం జరిగింది. ప్రపంచ వాణిజ్యానికి తోడ్పడి పారిశ్రామిక విప్లవ ప్రతిఫలంగా అమెరికా బలపడింది. కార్పొరేట్‌ సంస్థలకు తోడ్పడే బ్యాకింగ్‌ వ్యవస్థ పటిష్టతకు నాందీ పలికింది. మొదటి ప్రపంచయుద్ధ ప్రారంభంతో 1914తో ప్రథమ ప్రపంచీకరణ శకం ముగిసింది. రెండది, ప్రపంచీకరణ మరలా రెండవసారి 1990లో పరోక్ష యుద్ధం ముగిసి...

ప్రశ్నలూ ప్రతిఘటనల ప్రకంపనాలు..

ఇటీవలి కాలంలో కేంద్రంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ వెంటవెంట జరుగుతున్న పరిణామాలు చూసే వారికి ప్రజాస్వామిక భావజాలం, ప్రజా ఉద్యమాల వారసత్వబలం తెలిసి వస్తున్నాయి. ఏడాది కూడా తిరక్కుండానే మూడు ప్రభుత్వాల పాలకులు తమను తాము సమర్థించుకోలేని స్థితిలో పడిపోతున్నారు. తమ ఆధిక్యత శాశ్వతమైనట్టు విర్రవీగినవారు అంతకంటే వేగంగా ఆత్మరక్షణ మార్గాలు అన్వేషిస్తున్నారు. రహస్య ఎజెండాలు లోపల పెట్టుకుని రాజకీయ బీరాలు పలికిన వారు రాజీ రాగాలాల పిస్తున్నారు. ఈ రాజీల వెనక రహస్యాలేమనే సందేహాలు, సవాళ్లు మీడియాలోనూ, సమాజంలోనూ వ్యక్తమవుతుంటే సర్దుకోలేక సతమతమవుతున్నారు. ఏతావాతా ఇదంతా వారి స్వయం కృతమైతే ప్రజా స్పందన తత్ఫలితం.
దిగజారిన ప్రచారం
...

వలసలు..

వలసలు లేకపోతే మానవాళి నేడున్న విధంగా భూగోళం అంతా విస్తరించి ఉండేది కాదు. ఆదిమ మానవుల కాలంలో ఒక గుంపు పరిమాణం చాలా పెద్దదిగా మారినప్పుడు ఆ గుంపులోని ఒక భాగం వేరే ప్రాంతానికి వలసవెళ్లేవారు. అందువల్ల మానవ నాగరికతా వికాసానికి కూడా ఈ వలసలు కారణమని చెప్పవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, నదులు, సముద్రాలు, అడవులు దాటి కూడా వెళ్ళడానికి ఈ వలసలు దారితీశాయి. బహుశా దీని నుంచే కొన్ని ఊళ్ళ పేర్లకు చివర వలస, ఊరు అనే పదం వచ్చి ఉంటుంది. తగరపు వలస, ఆమదాల వలస, కొత్తూరు, పాతూరు వంటివి పేర్లు అలాగే వచ్చి ఉండవచ్చు. మొట్టమొదట ఈ వలసలు ఆఫ్రికాలో సాగినట్లు చరిత్ర చెబుతోంది. తెల్లవారి జనాభా బాగా పెరిగిపోవడంతో అనేక ప్రాంతాలకు వలసలు వెళ్ళి అక్కడి మూలవాసులను...

రైతులకు బెదిరింపులు..

రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతులపై రాష్ట్ర మంత్రులు బెదిరింపులకు దిగుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలనే వ్యూహానికి సర్కారు దిగడం దారుణం. ఒకరి తరువాత ఒకరిగా మంత్రులు రైతులు భూములు ఇచ్చేయాల్సిందేనంటూ బెదిరింపుల పర్వాన్ని ప్రారంభించడం, డెడ్‌లైన్‌ చెప్పి మరీ హెచ్చరించడం దుర్మార్గం. తాము చెప్పిన తేదీ లోగా ఇవ్వకుంటే భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించైనా గుంజుకుంటామని హెచ్చరించడం రైతులను గందరగోళ పరిచి, తీవ్ర ఒత్తిడికి గురి చేసే ఎత్తుగడే! మంత్రులు చేసే హెచ్చరికలు చాలవన్నట్టు భూములివ్వని రైతులను స్థానికంగా ఎక్కడికక్కడ టార్గెట్‌ చేసి వేధింపులకు గురి చేయడం, పచ్చటి పంటలకు నిప్పు పెట్టడం, తప్పుడు...

పచ్చి దగా..

వందల కోట్లు ఖర్చు చేసి త్రీ-డి ఎఫెక్టుతో దసరా రోజు నిర్వహించిన అమరావతి శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బెస్ట్‌ ఈవెంట్‌ మేనేజర్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది మినహా రాష్ట్ర ప్రజలకు ఎలాం టి ప్రయోజనం చేకూర్చలేదు. పదహారు మాసాలుగా విభజన హామీల అమలు కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న జనం కనీసం శంకుస్థాపన నాడైనా తమకు భరోసా లభిస్తుందని ఆశించగా ఫలితం శూన్యం. శంకుస్థాపన వేదికపై ప్రధాని ప్రత్యేక హోదా ప్రకటిస్తారని, తీపి కబురు చెబుతారని బిజెపి, టిడిపి నాయకులు ఊరించగా మోడీ తుస్సు మనిపించారు. హోదా సంజీవని కాదని బుకాయిస్తూ వచ్చిన చంద్రబాబు, ప్రధాని అమరావతికొచ్చి బీహార్‌ కంటే అధిక ప్యాకేజీ ముట్టచెబుతారని నర్మగర్భంగా ప్రచారం చేశారు. తీరా...

ధరాఘాతం..

 నిత్యావసర వస్తువుల ధరలు ప్రజానీకానికి శరాఘాతంలా తాకుతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం దారుణం. నిన్నటి దాకా ఉల్లి పెట్టించిన కన్నీటితో కుదేలయిన ప్రజలను ఇప్పుడు కందిపప్పు కుదేలెత్తిస్తున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కందిపప్పు ధర డబుల్‌ సెంచరీని దాటి ఆ పైనా దౌడు తీస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం క్షమార్హం కాదు. దసరా పండుగ ఉత్సాహంపౖౖె ఈ ధరాఘాతం నీళ్లు చల్లింది. పప్పు వండు కోవాలన్నా తటపటాయించే స్థితికి సాధారణ ప్రజానీకం చేరుకున్న తరువాత ఇంకెక్కడి పండగ! ఉల్లి ఏడిపించడానికి కొద్దిరోజుల ముందు చికెన్‌ ఇలాగే కొండెక్కి కూర్చుంది. అప్పట్లో చికెన్‌ వండిన రోజే పండగ. ఆ...

బిజెపి కుహనా ఆధ్యాత్మికత..

నిషేధం, దుందుడుకు ధోరణులు, ఆజ్ఞలు, మూసివేతలు లాంటివి సహనస్ఫూర్తినీ లేదా మన రాజ్యాంగాన్ని ప్రతిధ్వనిం చవు. అసహన రాజకీయాలకూ, సహన సిద్ధాంతాన్ని ప్రవచించే జైన మత ఆచారాలకు ముడిపెట్టడం హాస్యాస్పదం. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చే చిన్నచిన్న వార్తలన్నింటినీ పాఠకులు కలిపి చూడాలి. జైనులు ఆచరించే పర్యూషన్‌ (ఉపవాసదీక్ష వేడుక) సందర్భంగా మాంసం విక్రయంపై విధించిన నిషేధానికి సంబంధించి పత్రికలలో వచ్చిన కథనాల తీరు నన్ను బాగా ఆందోళనకు గురిచేసింది. బిజెపి కార్యక లాపాలు ఎవరినీ నొప్పించని విధంగా సున్నితం గా ఉన్నాయని వ్యాఖ్యాతలు విశ్లేషించారు. మెజారిటీ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే బిజెపికి తప్పని పరిస్థితి అని మరో వ్యాఖ్యాత అన్నారు. మైనారిటీ ప్రజలపై బిజెపి...

వడ్డీ రేట్ల తగ్గింపు ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందా?

 ఎంతో కాలం నుంచి పెట్టు బడిదారులు, ఉన్నత, మధ్య తరగతి ప్రజలు ఎదురు చూస్తు న విధంగా రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బిఐ) ఛైర్మన్‌ రఘురామ్‌ రాజన్‌ వడ్డీ రేట్లను తగ్గించారు. సెప్టెంబరు 29న జరిగిన రిజర్వు బ్యాంకు ద్వైమాసిక సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నారు. వడ్డీ రేట్లు తగ్గిస్తారని ఊహించిన వారు కూడా ఒక్కసా రిగా 0.5 శాతం తగ్గించటంతో ఆశ్చర్యపోయా రు. సమీక్ష సందర్భంగా 0.25 శాతం తగ్గించవచ్చునని ఎక్కువమంది ఊహిం చారు. వారి ఊహలకు భిన్నంగా 0.5 శాతం తగ్గించి రాజన్‌ అందరినీ ఆశ్చర్యపరి చారు. ఇంతకు ముందు బ్యాంకులకు రిజర్వు బ్యాంకు ఇచ్చే అప్పుకు వడ్డీ (రెపో రేటు) 7.25 శాతంగా ఉంది. ఇప్పుడు 0.5 శాతం తగ్గించటంతో రెపో రేటు 6.75 శాతానికి తగ్గింది....

అభివృద్ధి - హక్కులు

అభివృద్ధి అనే మాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక మంత్రంలా వినపడుతోంది. ఇంకొక విధంగా చెప్పాలంటే దేశంలో కూడా మన నాయకులు చాలా చోట్ల ఈ పదాన్ని పదే పదే ఉపయోగిస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల వేలాది, లక్షలాది మంది ప్రజలను నిర్వాసితులను చేస్తున్నారు. అలాగే లక్షలాది ఎకరాలను వివిధ రకాల పేర్లతో సేకరిస్తున్నారు. అభివృద్ధి చేస్తున్నాం అనే పేరుతో ప్రజల ఆస్తులను, హక్కులను హరిస్తున్నట్లు అనేక వార్తలను చూస్తున్నాం. అభివృద్ధి చేస్తున్నాం కదా అని ప్రజలు త్యాగాలు చేయాలి, నష్టాలు భరించాలని చెబుతున్నారు. నాయకులు అభివృద్ధి చేస్తున్నారు కనుక ప్రజలు కష్టాలు భరించాలా? త్యాగాలు చేయాలనేది పరిశీలించనప్పుడు అభివృద్ధి చేయటం నాయకుల గొప్పతనమో...

ప్రపంచబ్యాంకు పథకం ''మేక్‌ ఇన్‌ ఇండియా''

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను రూపొందించిన పథకమం టూ గొప్పగా ప్రచారం చేసుకొంటు న్న ''మేక్‌ ఇన్‌ ఇండియా'' ప్రపంచ బ్యాంకు రూపొందించిన పథకమని స్పష్టమౌతున్నది. 2015 సెప్టెంబ రులో ప్రపంచబ్యాంకు రూపొందించిన ''అసెస్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ రిఫార్మ్స్‌'' నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. తయారీ సరుకుల ఎగుమతులను, భారతదేశంలో తయారైన సరుకుల పోటీత త్వాన్ని పెంచటానికి సహకరించాలని ప్రధాని మోడీ 2014లో ప్రపంచబ్యాంకును కోరి నట్లు నివేదికకు రాసిన ముందుమాటలో ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్‌ ఒన్నో రుహుల్‌ పేర్కొన్నాడు. ప్రధాని ప్రకటించిన ''మేక్‌ ఇన్‌ ఇండియా'' కార్యక్రమంలో భారతదేశాన్ని సరుకుల తయారీ కేంద్రంగా రూపొందించటం,...

ఇదేనా బాబుగారి సమర్థత...

 ఎన్నికల ముందు చంద్రబాబు సమర్థుడని, అనుభవ జ్ఞుడని, తెలివైన వాడని తెలుగు దేశం పార్టీ, దాని మీడియా ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించింది. ఆయన అధికారంలోకొచ్చి సంవత్సరంన్నర అయింది. ఈ కాలంలో ఆయన సమర్థత, అనుభవం దేనికి ఉపయోగించారు? ఎవరికి మేలు జరి గింది? ఎవరికి కీడు జరిగింది? ఆలోచించాల్సిన సమయం వచ్చింది. లేకుంటే ఆయన సమర్థతకు ప్రజలు మరింత మూల్యం చెల్లించుకో వాల్సిన పరిస్థితి రాబోతోంది.
ఆరు నెలల్లో సమర్థతతో పూర్తి చేశామన్న పట్టి సీమకు రెండు సార్లు ప్రారంభోత్సవాలు చేసి ఆగష్టు 15 నాటికని, సెప్టెంబరులో నీళ్ళని, అక్టోబరులో ఒక మోటారు బిగించి మధ్యలోనే కల్వర్టులు కూలిపోయి వంతెన లు పూర్తికాక పట్టిసీ మను ఒట్టిసీ మగా మార్చడం సమర్ధతా లేక రూ.1,300 కోట్ల ను...

మోడీ డిజిటల్‌ ఇండియా అంతరార్థమేంటి?

ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య జరిపిన అమెరికా పర్యటనలో లాస్‌ ఏంజిల్స్‌లోని సిలికాన్‌ వ్యాలీ సందర్శన మనకంద రకూ తెలిసిందే. అక్కడ ఆయన ప్రత్యేకంగా మూడు ప్రముఖ కంపెనీల (గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, టెస్లా) సిఇఒలతో సమావేశమవ డమే కాకుండా మరో ప్రముఖ కంపెనీ ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాల యాన్ని కూడా సందర్శించారు. ఇది మోడీ అద్భుత విజయంగా మన మీడియా ప్రముఖంగా పేర్కొంది. తను విరమించుకున్న 'ఇంటర్నెట్‌. ఆర్గ్‌' పథకాన్ని డిజిటల్‌ ఇండియా కోసం తిరిగి ప్రారంభిస్తానని మోడీకి ఫేస్‌బుక్‌ హామీ ఇచ్చింది. 500 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వై-ఫై సేవలందిస్తానని గూగుల్‌, భారత దేశంలో ప్రతి గ్రామాన్నీ ఇంటర్నెట్‌ ద్వారా అనుసంధానిస్తానని మైక్రోసాఫ్ట్‌ అంగీక రించడాన్ని మీడియా గొప్పగా...

Pages