ఆర్టికల్స్

ఉగ్రవాదం - అగ్రవాదం

 ఫ్రాన్స్‌ రాజధాని నగరం పారిస్‌పై శుక్రవారంనాటి ఉగ్రవాద దాడితో టర్కీలో జరుగుతున్న జి20 సమావేశం దృష్టి ప్రపంచ ఆర్థిక పరిస్థితి మీదనుండి ఉగ్రవాదం మీదికి మళ్లింది. ప్రపంచంలోని అన్ని సంస్కృతులకు ద్వారాలు తెరిచి ఉంచే పారిస్‌ నగరంలో ఉగ్రవాదలు సృష్టించిన మారణ హోమంలో 128 మంది అమాయకులు మ్యత్యువాత పడడం, వందలాది మంది క్షతగాత్రులు కావడం దిగ్భ్రాంతికరం. ఈ దాడి తరువాత నగరం ఇప్పుడు పాత ధోరణిని కొనసాగిస్తుందా లేక శరణార్ధులకు, ఇతర జాతుల ప్రజలకు ద్వారాలు మూసేస్తుందా అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్‌లో ఇప్పుడు జరిగింది అతిపెద్ద ఘాతుకం. పారిస్‌పై బరితెగించింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌-సిరియా (ఐఎస్‌ఐఎస్‌-ఐసిస్...

మోడీ పాలనలో పెరుగుతున్నఅసహనం..

మాజీ ఉప ప్రధాని, బిజెపి సీనియర్‌ నాయకులు లాల్‌కృష్ణ అద్వానీ గతంలో ఒకసారి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీని గొప్ప 'ఈవెంట్‌ ఆర్గనైజర్‌'గా వర్ణించారు. ఎల్‌కె అద్వానీని బిజెపి, దాని సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) విస్మరించింది. అయినప్పటికీ దేశ ప్రజానీకం అద్వానీని, ఆయన నాయకత్వాన్నీ ఇంకా గుర్తు పెట్టుకున్నది. ప్రధాని మోడీ ప్రస్తుతం దేశాలు పర్యటించడం, విదేశీ ప్రధానులు, అధ్యక్షులు, బడా పెట్టుబడిదారులకూ ఆతిథ్యం ఇస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అదే సమయంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మోడీ దేశ ప్రజానీకానికి ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారనే విషయం కూడా నిక్కచ్చిగా చెప్పవచ్చు. అదేమంటే 'మినిమమ్‌ గవర్నమెంట్‌.. మాగ్జిమమ్‌...

ఆర్థిక పతనం..

విదేశీ పెట్టుబడుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాలికి బలపం కట్టుకుని విదేశాలు తిరుగుతుంటే దేశంలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. వార్షిక వినిమయ ద్రవ్యోల్బణం వరుసగా మూడో మాసం పెరిగి అక్టోబర్‌లో 5.0 శాతానికి చేరుకుంది. రిటైల్‌ ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగి 5.25 శాతానికి చేరింది. పారిశ్రామికోత్పత్తి ఆగస్టులో 6.3 శాతంతో పోలిస్తే సెప్టెంబర్‌లో 3.6 శాతానికి తగ్గింది. ఇవన్నీ ప్రభుత్వం గురువారం నాడు విడుదల చేసిన లెక్కలు. ప్రపంచానికి భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఆశాదీపం అని బ్రిటన్‌లో ప్రధాని ఊదరగొడుతున్న సమయంలోనే దేశంలో ఈ లెక్కలు వెలువడడం ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత అన్న సామెతను గుర్తుకు...

కరువు కోతలు..

అమరావతి, పుష్కరాలు, సింగపూర్‌, జపాన్‌ ప్రచారార్భాటంలో పడి చంద్రబాబు ప్రభుత్వం కరువును విస్మరించడం ఘోర అపరాధం కాగా ఆలస్యంగా ప్రకటించిన కరువు మండలాల్లోనూ పిసినారి తనానికి పాల్పడటం మరీ దుర్మార్గం. ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా దుర్భిక్షం అలముకోగా ఆర్చుకొని తీర్చుకొని సీజను ముగిసిన నెల రోజులకు వెల్లడించిన కరువు మండలాల విషయం కూడా ఎంతో లోపభూయిష్టంగా, ఆశాస్త్రీయంగా ఉంది. పదమూడు జిల్లాల్లో 670 మండలాలుండగా మీనమేషాలు లెక్కించి గుర్తించినవి ఏడు జిల్లాల్లో 196 మండలాలు. కరువు కోరల్లో చిక్కుకొని రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే కరువు గుర్తింపులో కూడా వడపోతలకు ఒడిగట్టడమే కాకుండా కఠిన షరతులు విధించడం...

మత నియంతృత్వం దిశగా దేశం

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌యస్‌యస్‌) హిందూత్వ ప్రచారానికి కేంద్రంగా ఉంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఈ స్థితిలో మనం ఈ కింది విధంగా ప్రశ్నించుకోవచ్చు. ''మనదేశం హేతుబద్ధత, తార్కికతతో పాటు ప్రజాస్వామ్యం నుంచి కూడా దూరంగా వెళ్తూ, హిందూ మత నియంతృత్వం వైపు ప్రయాణిస్తున్నదా?'' దురదృష్టవశాత్తూ ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పుకోవాల్సి వస్తున్నది. ప్రజాస్వామ్యం, తర్కబద్ధత, హేతు వులపై ఆధారపడిన సమాజంలో భిన్నాభి ప్రాయాలను వ్యక్తం చేయటానికి అవకాశాలు ఉండాలి. హేతుబద్ధమైన భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించాలి. ప్రస్తుతం భారతదేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ విధానంలో భాగంగా, హేతుబద్ధమైన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం...

అంగట్లో అమ్మకం..

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై నిబంధనలను మరింతగా సడలించిన కేంద్రంలోని ఎన్‌డిఎ సర్కారు దేశాన్ని అంగట్లో నిలబెట్టి అమ్మేందుకు బరితెగించింది. దీపావళి పండుగ వేళ ఎఫ్‌డిఐలపై పరిమితులు సరళీకరించి విదేశీ కార్పొరేట్లకు వెలుగులు అందించిన మోడీ ప్రభుత్వం ఇప్పటికే 'సంస్కరణ'ల భారాలతో మసకబారిన మన ప్రజల బతుకుల్లో చీకట్లు నింపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను కీలక రంగాల్లో ఎఫ్‌డిఐలకు తలుపులు బార్లా తెరిచి విదేశీ సంస్థల దోపిడీకి లైసెన్స్‌లు ఇవ్వడం ఆందోళనకరం. రక్షణ, బ్యాంకింగ్‌, పౌర విమానయానం, ఉద్యానవనాలు, చిల్లర వర్తకం, నిర్మాణ, రైల్వే, మీడియా, తదితర రంగాల్లో ఎఫ్‌డిఐలు స్వైర విహారం చేసేందుకు ఇంకా మిగిలి ఉన్న కొద్దిపాటి స్పీడ్‌ బ్రేకర్లను...

ధరల పెరుగుదల-పిడిఎస్‌ ప్రాధాన్యత

నిత్యావసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పెరిగిపోతున్నాయి. గతంలో ఉల్లిపాయల ధరలు పెరిగాయి. ఇప్పుడు కందిపప్పు ధరలు ఆ విధంగానే పెరుగుతున్నాయి. మార్కెట్‌లో కిలో రూ.15 నుంచి రూ.20 లభించే ఉల్లిపాయల ధరలు రూ.80 దాటి పెరిగి, ఇప్పుడు రూ.25-30 వద్ద ఉన్నాయి. రూ.80-90 కందిపప్పు ధర గత నాలుగు మాసాల నుంచి పెరుగుతూ కోడిమాంసం ధరలను దాటి, ఏటమాంసం ధరలను అందుకొనే వైపుగా పరుగులు తీస్తున్నది. ఇతర పప్పుల ధరలు కూడా ఈ విధంగానే పెరుగుతున్నాయి. ఈ సరుకుల ధరలు పెరగటానికి కారణమేమిటి? ఏ సరుకైనా ఎక్కువగా ఉత్పత్తి జరిగి, మార్కెట్‌లో కావలసినంత మొత్తం అందుబాటులో ఉంటే ధరలు తక్కువగా ఉంటాయని, తగినంత ఉత్పత్తి జరగక, కొరత ఏర్పడితే ధరలు పెరుగుతాయని బడా వ్యాపారులు...

బీహార్‌ ఎన్నికలు నేర్పుతున్న పాఠాలు

రాజకీయ విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని మహా కూటమి ఘనవిజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు బిజెపికి ప్రత్యేకించి మోడీ, అమిత్‌ షాల నాయకత్వాలకు పెద్ద ఎదురు దెబ్బ. అన్నిటినీ మించి సంఘ పరివార్‌ దేశంపై రుద్దాలనుకున్న సనాతన, భూస్వామ్య సంస్కృతి, వారి అనాగరిక చర్యలకు ఇది బీహార్‌ ప్రజల సమాధానం. కులం, ఉప కులం పేరుతో ప్రజలను చీల్చాలనుకోవడం, ప్రజల్లోని భక్తి భావాలను రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే దృష్ట యత్నాలకు దీన్ని ప్రతిఘటనగా భావించవచ్చు. స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి పాత్రా లేని ఆరెస్సెస్‌, మహాత్మా గాంధీని హత్య చేసిన ఆరెస్సెస్‌, సంఘ పరివార్‌ ఫాసిస్టు పోకడలకు ఇది అడ్డుకట్ట. దేశభక్తి, జాతీయత, మతం వంటి ముసుగులను కప్పుకొని వారు...

ఆంధ్రుల స్ఫూర్తి ప్రదాత బ్రౌన్‌..

ఆంధ్ర భాషా సారస్వతాలకు ఎనలేని సేవచేసిన ఆంగ్లేయ సివిల్‌ ఉద్యోగి, ఆంగ్ల విద్వాంసుడుగా గణుతికెక్కిన సర్‌ ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. మిణుకు మిణుకు మంటున్న తెలుగు సాహిత్యాన్ని ఒంటి చేత్తో కృషిచేసి జాజ్వల్యమానంగా వెలిగించే కర్తవ్యాన్ని నిర్వహించిన ఆంగ్లేయుడు. 1798 నవంబరు 10న ఒక క్రైస్తవ మిషనరీ కుటుంబంలో కలకత్తాలో (కోల్‌కతా) జన్మించాడు. ఆయన తండ్రి డేవిడ్‌ బ్రౌన్‌ బహు భాషా కోవిదుడు. తన పిల్లలు కూడా అలాగే కావాలని కోరుకునేవాడు. బ్రౌన్‌ చిన్ననాటి నుంచే ఇంగ్లీషు, హిబ్రూసిరియన్‌, అరబ్బీ, పారశీక, గ్రీకు, లాటిన్‌, బెంగాలీ, వంటి పెక్కు భాషలను క్షుణ్ణంగా అభ్యసించాడు. తన తండ్రి మరణానంతరం 1812లో ఇంగ్లాండుకు వెళ్లి ఐసిఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడై 1817లో...

మతతత్వ శక్తులకు చెంపపెట్టు..

బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు నితీష్‌ కుమార్‌ సారధ్యంలోని లౌకిక మహా కూటమికి తిరుగులేని ఆధిక్యంతో పట్టం కట్టి తమ విలక్షణతను చాటుకోవడం అభినందనీయం. జనం మధ్య చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర మతతత్వ శక్తులను అధికారానికి ఆమడ దూరంలో పెట్టి బుద్ధుడు జన్మించిన గడ్డ వారసత్వాన్ని కొనసాగించడం హర్షణీయం. ఒక విధమైన ఉద్రేక భరిత వాతావరణం మధ్య జరిగిన బీహార్‌ ఎన్నికలు యావత్‌ దేశాన్నీ ఆకర్షించడమే కాకుండా నరాలు తెగే ఉత్కంఠ రేపాయి. అందుక్కారణం ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాకు, ప్రభుత్వానికి పరీక్షగా మారడమే. మోడీ సైతం బీహార్‌ ఎన్నికలను వ్యక్తిగతంగా తీసుకొని ప్రధాని హోదాలో గతంలో మరెవ్వరూ తిరగనంతగా కాలికి బలపం కట్టుకొని మరీ ఎన్‌డిఎ గెలుపు కోసం...

ధరలపై యుద్ధం..

ఇటు రైతులను అటు వినియోగదారులను కట్టకట్టి అందినకాడికి దోపిడీ చేసే దళారీ వ్యవస్థను మరింతగా స్థిరీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నడుంబిగించడం ఆందోళన కలిగించే అంశం. ఈ దుష్పరిణామం పివి నరసింహారావు 'సంస్కరణ'లతో పురుడు పోసుకొని వాజపేయి హయాంలో మొగ్గ తొడిగి మన్మోహన్‌ సమయంలో కొమ్మలుగా విస్తరించి చివరికి మోడీ నేతృత్వంలో వటవృక్షమైంది. రైతుల, వినియోగదారుల మూలుగ పీల్చే కేంద్ర విధానాలకు రాష్ట్రం తందాన అంటోంది. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) దక్కక ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నదీ, నిత్యావసరాల ధరలు పెరిగిపోయి పేదల కంచాల్లో కనీసం పప్పుచారు, చింత పులుసు కరువవుతున్నదీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని ప్రజల నెత్తిన రుద్దిన విధానాల ఫలితమే....

కాషాయాన్ని వెంటాడుతున్న కమ్యూనిస్టు భూతం

మామూలుగా ఎన్నికల ప్రచార సమయంలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ఉంటుంది. పోలింగ్‌ ముగిసిన మరుక్షణంలో మొదలయ్యే ఎగ్జిట్‌ పోల్స్‌ ఆ కుతూహలానికి కొంత సమాధానమిస్తాయి. ఎన్నికల సర్వేల కన్నా ఎగ్జిట్‌ పోల్స్‌ వాస్తవ ఫలితాలకు కొంత దగ్గరగా ఉంటాయనేది సాధారణంగా ఉన్న భావన. కానీ ఇప్పుడు బీహార్‌ ఎన్నికల విషయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఉత్కంఠను మరింత పెంచేశాయి. విజయం గురించిన అంచనాలలో విపరీతమైన తేడా ఇందుకు కారణం. రెండు మినహా మిగిలిన ఛానల్స్‌ జెడియు-ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమికి ఆధిక్యత లేదా మొగ్గు ఉంటుందని చెప్పాయి. టుడేస్‌ చాణక్య, ఎక్స్‌ప్రెస్‌ సిసిరో మాత్రం బిజెపి ఎన్‌డిఎ కూటమికి అధికారం వస్తుందంటున్నాయి. మిగిలిన సంస్థల కన్నా ఒక రోజు ఆలస్యంగా ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేసిన...

Pages