ఆర్టికల్స్

ప్రజాస్వామ్య సంస్కృతి..

 మధ్యయుగాల నాటి సామాజిక జీవితపు పోకడలతో పోలిస్తే ఆధునిక ప్రజాస్వామ్యం ఒక సుగుణం. శతాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉదాత్తాంశం. సకల రంగాల్లో వ్యక్తి స్వేచ్ఛకూ, సమానత్వానికీ, ఎంచుకునే హక్కుకూ మూలం ప్రజాస్వా మ్యం. రాచరికపు సంస్కతికి భిన్నమైన ప్రజాస్వామ్యం ఓ అందమైన భావన. ఆచరణలో విరుద్ధాంశాలు కనిపించినప్పటికీ మౌలికంగా ప్రజాస్వామ్య సూత్రాలకు బద్ధులై ఉండాలన్న భావనలు 1950 కాలం నాటికి బలపడ్డాయి. కాలం గడుస్తున్న కొద్దీ ఈ భావనలు మరింత శక్తిని పుంజుకుని ప్రజాస్వామ్య సంస్కతి పరిఢవిల్లాల్సింది. అందుకు భిన్నంగా కాలం చెల్లిన భూస్వామ్య నిరంకుశత్వపు పోకడలు సామాజిక జీవితంలో పెత్తనం చెలాయించడం వర్తమాన వాస్తవం. ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం మతం వ్యక్తిగత...

నయవంచన..

పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్ల పేరిట పేదల భూములను బెదిరింపు ఎత్తుగడలతో బలవంతంగా గుంజుకొంటున్న చంద్ర బాబు సర్కార్‌..ఇప్పుడు గిరిజన బతుకులను బూడిదపాల్జేసేందుకు నయవం చనకు పాల్పడింది. పర్యావరణవేత్తల ఆందోళనలను, గిరిజనుల ఆవేదనలను ఏమాత్రం పట్టించుకోకుండా, గతంలో ఇచ్చిన హామీలను విస్మరించి మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులివ్వడం దుర్మార్గం. విశాఖ జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని చింతపల్లి, జెర్రెలలో 1212 హెక్టార్ల అటవీభూమిని ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థకు బదలాయించింది. ఆన్‌రాక్‌ అల్యుమినా వంటి కార్పొరేట్‌ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 242లో ఆదివాసీలకు దఖలుపర్చిన హక్కులను కాలరాస్తూ జివో 97...

సర్కారీ ఘాతుకాలు..

జాతికి అన్నం పెట్టే రైతుల ఆత్మహత్యలు పెను విషాదం కాగా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానిది పెద్ద ఘాతుకం. ఒక వైపు చంద్రబాబు సర్కారు నవ్యాంధ్ర అభివృద్ధి నమూనా చిత్రాన్ని రంగుల్లో ఆవిష్కరిస్తుం డగా ఇంకో వైపు రైతుల బలవన్మరణాల పరంపర కొనసాగింపు రాష్ట్రంలో నెలకొన్న రెండు విభిన్న ధోరణులకు నిదర్శనం. అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రసీమలో కాడెత్తాల్సిన అన్నదాతలు ఉరితాళ్లకు వేలాడుతున్నా పంట పండించాల్సిన వ్యవసాయదారులు పొలంలోనే పురుగు మందు తాగి విగత జీవులవుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. పైగా తెలంగాణాతో పోలికపెట్టి ఎపిలో తక్కువని ఆత్మవంచన చేసుకోవడం క్షమించరానిది. రైతు ఆత్మహత్య వార్త లేకుండా దినపత్రికలు, టీవీ చానెళ్లు లేవంటే గ్రామాల పరిస్థితి ఎంత...

కార్మికోద్యమస్ఫూర్తి ప్రదాత అక్టోబర్‌విప్లవం

పెట్టుబడిదారులు, వారి కిరాయి రచయితలు పండుగజేసుకుని పట్టు మని పాతికేళ్ళు కాలేదు. ఫుకయామా ''చరిత్ర అంతమైందని'' ప్రకటించి నేటికి 23 ఏళ్లు. మార్క్స్‌ చెప్పిన ''వేతన బానిసలు'' (కార్మికవర్గమే) లేరని ఆండ్రీ గోర్జ్‌ అంతకు ముందే ప్రకటించాడు. సోవియట్‌లో సోషలిజం కూలిపోయినప్పుడు, అప్పటికే తూర్పు ఐరోపా దేశాలు పెట్టుబడి కబంద హస్తాల్లో చిక్కినప్పుడు ''సామ్రాజ్యం'' పులకించి పోయింది. ఆ మైకంలో ఫ్రాన్సిస్‌ ఫుక యామా పలవరింపే పైన చెప్పిన ''చరిత్ర అంతం''! మన దేశంలోని వారి తాబేదార్లు, జీతగాళ్ళు, ''అన్ని యిజాలు విఫలమ య్యాయి. ఇక భవిష్యత్‌ అంతా టూరిజ ందే!'' అని ప్రవచించారు.
1998లో ''ఆసియా పులుల'' సంక్షోభంతో ఆత్మరక్షణ లో పడ్డ ''సంస్కరణల ప్రతిపాదకులు'' 2008...

'నిజం' పేరుతో అబద్ధాలా?

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఇక్కడ విడుదల జేసిన పుస్తకం 'నిజం తెలుసుకోండి' (నో ది ట్రూత్‌)లో కొత్తదనమేమీ లేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి చెప్పారు. లెఫ్ట్‌పై బిజెపి గతంలో చేసిన ఆరోపణలను ఇందులో మరోసారి ప్రస్తావించారని ఏచూరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో మేధావుల ఆలోచనలను లెఫ్ట్‌ తప్పుదోవ పట్టిస్తోందని అందులో విమర్శించారని, వామపక్ష మేధావుల ఆలోచనా ధోరణి పరిశీలనాత్మకంగానే వుం టుందని, ఇకపై కూడా అదే విధంగా కొనసాగుతుందని ఏచూరి స్పష్టం చేశారు. వారి మేధోసంపత్తి, హేతు వాదం, చరిత్ర అధ్యయనం వంటివి ఇందుకు ప్రధాన కారణాలని ఆయన వివరించారు. ఈ ఉన్నత ప్రమాణా లను అందుకోలేక ఆపసోపాలు పడుతున్న ఆరెస్సెస్‌ మరోసారి తప్పుడు సమాచారంతో '...

UGC ముట్టడి ఎందుకు...?

ఆక్యుపై యుజిసి అనేది... ఢిల్లీ విద్యార్థి లోకం ఎత్తుకున్న ప్రధాన నినాదం. ఢిల్లీలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో నేడు యుజిసి ముట్టడి అనేది ఒక పెద్ద ఉద్యమంగా తయారయింది. దేశంలో గత రెండు దశాబ్దాలుగా వేగవంతమైన నయా ఉదారవాద విధానాల ఫలితంగా అన్ని రంగాలూ స్వరనాశనమయ్యాయి. అన్ని రంగాల్లో ప్రయివేట్‌ ఆధిపత్యం పెరిగింది. అందులో మరీ ముఖ్యంగా విద్య, వైద్యం అంగడి సరుకైనాయి. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ ప్రయివేటు అనుకూల విధానాల ఫలితంగా ఉన్నత విద్య పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షలా మారింది. ఇప్పటి వరకు విద్య జోలికి రాని ప్రభుత్వం ఒక్కసారిగా ఉన్నత విద్యలో సంస్కరణలు తెచ్చేందుకు పూనుకుంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన...

ఛార్జీల బండ..

ముఖ్యమంత్రిగా కాక మాంచి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా మన్ననలందుకోవాలని తాపత్రయ పడుతున్న చంద్రబాబు ఏలుబడిలో ప్రజల పరిస్థితి చెంప దెబ్బ గోడ దెబ్బ అన్నట్లు తయారైంది. అమరావతి శిలాన్యాస్‌ సంరంభంలో ప్రత్యేక హోదాపై స్పష్టత రాక నిరాశ చెందిన ప్రజలు తమ నెత్తిన పడేందుకు వరుస కట్టిన సర్కారీ ఛార్జీల బండలపై మరింతగా కలత చెందుతున్నారు. రాజధాని శంకుస్థాపన మరుసటి రోజే ఆర్టీసి బస్‌ ఛార్జీలు బాది ప్రయాణీకుల తల బొప్పి కట్టించగా, అతి త్వరలోనే ట్రూ అప్‌ పేరుతో వినియోగదారులకు విద్యుత్‌ షాక్‌ ఇచ్చేందుకు బాబు ప్రభుత్వం సిద్ధమైంది. సర్కారు వాలకం చూస్తుంటే ఎప్పుడు ఏ రూపంలో ఏ భారం పిడుగుపాటు అవుతుందోనన్న భయాందోళనలు సర్వత్రా అలముకున్నాయి. జనాన్ని ఇబ్బంది పెట్టకూడదన్న...

ఐక్యంగా ఉద్యమిస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై 'పార్టీ రాజకీయాలు' ముదురుతున్నాయి. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి హోదా సాధనకు నిరవధిక దీక్షకు దిగడం, దానిని టిడిపి ప్రభుత్వం భగం చేయడంతో రాష్ట్రంలో 'ప్రత్యేక' రాజకీయం వేడెక్కింది. ఈ పోరులో మరో ఇద్దరు బలయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదేమోనని ఇప్పటికే కొందరు ప్రాణత్యాగం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతుండడంతో పరిస్థితులు దిగజారుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కొన్ని పార్టీలు ఇలా రెచ్చగొట్టే వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. పౌరజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఈ ప్రమాదం ప్రత్యేక హోదా ఉద్యమంలో తలెత్తకూడదు. రాష్ట్రంలో అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా...

బిజెపికి చెంపపెట్టు..

దేశంలో అధిక ధరలు, ఉపాధి హామీకి కరువు, కనీసవేతనాలు వంటి అనేక సమస్యలతో సామాన్యుడు సతమతమవుతుంటే అవేమీ పట్టించుకోకుండా కార్పొరేట్ల సేవలో, మత చిచ్చు రేపడంలో మునిగి తేలుతున్న బిజెపికి యుపి, మహారాష్ట్ర ప్రజలు మున్పిపల్‌ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ఒక హెచ్చరిక. యుపి స్థానిక ఎన్నికలు గ్రామీణ ప్రజల నాడిని తెలియజేస్తుండగా, మహారాష్ట్ర మున్సిపల్‌ ఫలితాలు పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజల మనోగతాన్ని స్పష్టంగా వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో బిజెపికి ఎదురైన ఘోర పరాజయం చిన్నదేమీ కాదు. అందులోనూ ఆయన దత్తత తీసుకున్న జయపూర్‌ గ్రామ పంచాయతీలో కాషాయ పార్టీ చావుదెబ్బ తింది. మరో ఏడాదిలో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న...

ఎమర్జెన్సీ ముందు రోజులకన్నా ఘోర పరిస్థితి..

బెంగాల్‌లో ప్రస్తుతం 1970వ దశకం నాటి దారుణ పరిస్థితులు నెలకొని వున్నాయని రాష్ట్ర వామపక్ష సంఘటన చైర్మన్‌ బిమన్‌ బసు చెప్పారు. కోల్‌కతాలో ఆయనను ఇటీవల ప్రజాశక్తి విలేకరి సందీప్‌ చక్రవర్తి ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా సమకాలీన జాతీయ, రాష్ట్ర పరిస్థితులపై ఆయన తన మనసులోని మాటను పంచుకున్నారు.
బెంగాల్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి వివరిస్తారా?
పశ్చిమ బెంగాల్‌లో గత నాలుగున్నరే ళ్ళుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. 'ప్రతీకారం లేదు, మార్పే ఉంటుంది' అన్న నినాదంతో ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన తృణమూల్‌ ఆ తర్వాత ఆ మాటే మర్చి పోయి వ్యవహరించసాగింది. సిపిఎం, వామపక్షవాదులపై...

పెరిగిపోతున్న అరాచక ధోరణులు..

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశమంతటా కొన్ని శక్తులు ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని అరాచక చర్యలకు పూనుకుంటు న్నాయి. బిజెపికి చెందిన దళాలు, పరిషత్తులు, వాహినులు వీటిలో ముందెత్తున పాల్గొంటున్నాయి. కేంద్ర బిజెపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ఈ శక్తులకు మద్దతిస్తున్నారు. శివసేన కూడా బిజెపి కంటే తానే ఒక ఆకు ఎక్కువ చదివాననే చందం గా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. మైనారిటీలు, దళితులు, అభ్యుదయవాదులు, చింతనాపరులు, కవులు ఈ శక్తుల చేతుల్లో చంపబడుతున్నారు. అవమానాల పాలవుతు న్నారు. మైనార్టీల ప్రార్థనాలయాలు ధ్వంసమ వుతున్నాయి. తమకు ఇష్టం లేనిది ఏదీ జరగకూడదని ఈ శక్తులు భావిస్తున్నాయి. ఏమి తిన కూడదో, ఏమి రాయకూడదో, ఏమి...

ప్రజాసమస్యలు గాలికి - ప్రశ్నిస్తే నిర్బంధం

 రాష్ట్రంలో 16 మాసాల క్రితం ఏర్ప డిన తెలుగుదేశం ప్రభుత్వం హామీ లను ఉల్లంఘించింది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి భారా లను మాత్రం పెంచింది. ప్రైవేటీక రణకు పెద్దపీట వేస్తున్నది. కనీసపు ప్రజా స్వామిక హక్కులను కూడా అనుమతించ కుండా తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నది.
వైద్యం
ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రధాన ఆస్పత్రులను ప్రయివేటు వారికి ధారాదత్తం చేస్తున్నది. ప్రయివేటు వైద్య కళాశాలలు స్థాపించాలను కునే వారికి క్లినికల్‌ అటాచ్‌మెంట్‌గా ప్రభు త్వాస్పత్రులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి అవసరమైన నిధులు...

Pages