ఆర్టికల్స్
దుర్మార్గపు వ్యాఖ్యలు..
Tue, 2015-10-06 16:48
కార్మిక సంఘాలను, కార్మికుల న్యాయమైన కోర్కెలకు మద్దతిచ్చే పార్టీలను, సంస్థలను ఉక్కుపాదంతో అణచి వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విశాఖపట్నంలో చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గపూరితమైనవి. రాష్ట్ర ప్రభుత్వాధిపతిగా కార్మికుల హక్కులను పరిరక్షించాల్సింది పోయి యాజమాన్యాల దోపిడీకి వకాల్తా పుచ్చుకోవడం దారుణం. ట్రేడ్ యూనియన్లపై విషం కక్కిన బాబు తమ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూలమని కుండబద్దలు కొట్టారు. పారిశ్రామిక అభివృద్ధికి కార్మిక సంఘాలు అడ్డంకిగా మారాయని స్వయంగా ముఖ్యమంత్రే వక్కాణించడం అక్కసును తెలుపుతుంది. యూనియన్లు పరిశ్రమల ఉనికికే ప్రమాదంగా మారాయనడం వాక్‌చాపల్యమే. రాజకీయ పార్టీలపైనా బాబు అవాకులు చెవాకులు పేలడం అసహనానికి...
అసహన ప్రతిరూపం..
Tue, 2015-10-06 16:38
ఒకానొక చారిత్రక సందర్భంలో ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొలువుదీరిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారడం ఎంతైనా ఆందోళనకరం. పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేందుకు సర్కార్లే నడుం కట్టడం అత్యంత ప్రమాదకరం. నిరసనోద్యమాలు, ప్రజాందోళనలపై చట్ట విరుద్ధమైన పద్ధతుల్లో మానవ హక్కుల హననం చేసి ఉక్కుపాదం మోపడం ప్రభుత్వాల నిరంకుశ పోకడలకు అద్దం పడుతోంది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఇటీవల ఇద్దరు మావోయిస్టులపై జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ వామపక్షాలు, ప్రజాసంఘాలు సెప్టెంబర్ 30న చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా, ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు, భగం చేసేందుకు కెసిఆర్ సర్కారు చేయని పని లేదు. తొక్కని అడ్డ దారి లేదు. చట్ట...
దొంగ చేతికే తాళాలిచ్చిన ఐరాస..
Mon, 2015-10-05 12:21
జెనీవాలోని సౌదీ అరేబియా దౌత్యవేత్త ఫైసల్-బిన్-హస్సాద్ ట్రాద్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ అధ్యక్షునిగా ఎన్నిక వటం ప్రపంచ దేశాలను విస్మయా నికి గురిచేశాయి. ఈ ఎన్నికను అభ్యుదయ ప్రజాస్వామికవాదులంతా నిరసన తెలియజేస్తు న్నారు. కానీ సౌదీ మిత్ర దేశమైన అమెరికా మాత్రం అభినందనలు తెలుపుతూ సంబరాలు తెలియజేసుకుంటు న్నది. సౌదీ అరేబియాకు మానవహక్కుల కమిషన్ అధ్యక్ష పదవి దక్కటమంటే దొంగచే తికి ఇంటి తాళాలిచ్చి కాపలాకాయమనడం తప్ప మరొకటి కాదు. జులైలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ గోప్యంగా ఉంచారు. ఈ విషయం సెప్టెంబరు 17 వరకు బయటి ప్రపంచా నికి తెలియదు. ఐక్యరాజ్యసమితి పత్రాల ఆధారంగా యుఎన్ వాచ్ అనే ఎన్‌జీఓ సంస్థ తెలియజేసింది. ఈ నియామకం ఐరాసకు కళంకంగా మారటం...
స్వచ్ఛ భారత్ ఇలాగా!
Sat, 2015-10-03 16:05
అయిదేళ్లలో పరిశుభ్ర భారతావని సాధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీక్షబూని ఏడాది గడుస్తున్న సందర్భంగా మళ్లీ చీపురు కట్టలు పట్టుకుని రాజకీయ నాయకులు, సినీ, సామాజిక రంగ ప్రముఖలు టివీల్లో కనిపిస్తున్నారు. ఏడాది క్రితం ఇదే సీజన్‌లో మనకు ఇవే దృశ్యాలు కనిపించాయి. ఈ మధ్య కాలంలో స్వచ్ఛ భారత్ గురించి నేతలు చెప్పినదానికీ, కింది స్థాయిలో జరిగినదానికీ ఎక్కడా లంగరు కుదరడంలేదనడానికి దేశంలో 70 శాతం మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంపై పెదవి విరుస్తున్న తీరే నిదర్శనం. గ్రామాల సంగతి అటుంచితే నగరాలు, పట్టణాల్లో సైతం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రచారార్భాటంగానే తయారైందన్నది సర్వత్రా వినవస్తున్న మాట.
దేశాన్ని చెత్త రహితంగా మార్చాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి...
నేతిబీరలో నెయ్యి - కార్పొరేట్ సామాజిక భద్రత
Thu, 2015-10-01 12:32
సమాజంలో నెలకొని ఉన్న అంతరాలను రూపుమాపే లక్ష్యం తోనే 'సామాజిక బాధ్యత' అనే అం శం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చాల్సింది అధికారం లో ఉన్న పాలకవర్గాలే. దాని కోసమే 'సంక్షేమ రాజ్యం' అనే భావన వాడుకలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బాధ్యతల నుంచి ప్రభు త్వాలు వైదొలగేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా కార్పొరేట్ సంస్థలకు ఆ బాధ్యతలను బదలాయిస్తున్నాయి. ఈ మార్పిడి సత్ఫలితా లనిస్తుందని పాలకవర్గాలు ఆశిస్తున్నాయి. దాన్ని సాకుగా చూపి పాలక వర్గాలు చేతులు దులిపేసుకుం టుంటే కార్పొరేట్ సంస్థలు అమలు చేస్తున్న సామాజిక బాధ్యత పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్నది.ప్రభుత్వాలు ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడేవ నేది ప్రజాస్వామ్యవాదుల భావన....
కాయకల్ప చికిత్స..
Thu, 2015-10-01 12:22
రెపో రేట్లను అరశాతం తగ్గిస్తూ రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయని చాలామంది ఆశిస్తున్నారు. ఊహించిన దానికన్నా ఎక్కువగా వడ్డీ రేట్లను తగ్గించడంతో పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్ కూడా ఈ దిశలోనే స్పందించింది. బుధవారం ఉదయం నుండి ఏ మాత్రం తడబాటు లేకుండా మార్కెట్ సూచీ పైకే ప్రయాణం చేయడం రిజర్వు బ్యాంకు నిర్ణయానికి సానుకూల స్పందనే! అయితే, అరశాతం రెపో రేటు తగ్గిచడంతోనే బ్రహ్మాండం బద్దలవుతుందని భావించడం సబబుకాదు. ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి. వడ్డీ రేట్లను తగ్గిస్తూ ప్రకటన చేస్తూనే ద్రవ్యోల్బణంపై రిజర్వుబ్యాంకు...
ముసుగు తొలగిన చంద్రబాబు..
Tue, 2015-09-29 12:16
''ఎట్ లాస్ట్ ది క్యాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్'' అనేది ఆంగ్ల సామెత. '' పిల్లి చివరికి సంచిలో నుంచి బయటపడింది'', అని దీని అర్థం. నిరంతరం అబద్ధాలు చెబుతూ, ఎదుటి వారిని మోసం చేస్తూ బతికేవారి నిజస్వరూపం బట్టబయలైనప్పుడు ఈ సామెతను ఉదహరి స్తుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సామెత అతికి నట్లు సరిపో తుంది. రాజధాని భూ సమీకరణకు సంబంధిం చి నిన్నటి వరకు ఆయన చెప్పిన మాటలు, నిన్న చేసిన ప్రకటన చూస్తే చంద్రబాబు రాజధాని ప్రాంత ప్రజలను, రాష్ట్ర ప్రజలను ఎంతగా మోసం చేస్తున్నారో స్పష్టమౌతున్నది. ''రాజధాని నిర్మాణానికి సమీకరించిన భూములను అభివృద్ధి చేసి కంపెనీలకు అమ్ముతామని, ఆ వచ్చే లాభాలను అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి...
ఐరాస లక్ష్యాలు నెరవేరెేనా..
Tue, 2015-09-29 12:13
వచ్చే పదిహేనేళ్లలో ప్రపంచంలో పేదరికాన్ని అంతం చేయాలన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) లక్ష్యం మంచిదే కానీ దేశాల చిత్తశుద్ధి, సమిష్టి కార్యాచరణ పైనే అనుమానం. దశాబ్దంన్నర క్రితం 2000 సంవత్సరంలో ఐరాస తీసుకున్న సహస్రాబ్ది లక్ష్యాల్లో చాలా మట్టుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. ఐరాస టార్గెట్లను అమెరికా ఇతర పశ్చిమ దేశాలు తుంగలో తొక్కి తమ స్వంత ఎజెండాతో మున్ముందుకెళుతున్నప్పుడు ఎన్ని నూతన ఎజెండాలు రూపొందించినా ఆశించిన మార్పు రాదన్నది స్పష్టం. అందుకే పేదరిక నిర్మూలన లక్ష్యంగా తాజాగా ఐరాస ప్రతిపాదించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి) అమలుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు న్యూయార్క్‌లో జరిగిన ఐరాస...
స్వాతంత్య్ర సంగ్రామంలో గిరిజనోద్యమాలు..
Mon, 2015-09-28 17:36
ఆదివాసీలు అనాదిగా సభ్యసమాజ సంస్కృతికి, నవనాగరికతకు నాంది. కానీ నేడు ఈ పాశ్చాత్య పోకడల ప్రపంచములో అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా, ఎన్నో పంచవర్షప్రణాళికలు వచ్చినా ఇప్పటి వరకు దేశంలో అనేక ప్రాంతాల ఆదివాసీల అభివృద్ధి అగమ్యగోచరంగానే ఉండిపోయింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 68 వసంతాలు నిండుతున్నప్పటికీ అభివృద్ధి ఫలాలు అందనంత దూరంలో ఆదివాసీ పల్లె ప్రజలున్నారనడంలో సందేహం లేదు. భారత రాజ్యాంగం అనేక హక్కులు, ఫలాలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అనాదిగా వస్తున్న నాటువైద్యంపై ఆధారపడటం, డోలీ మోతలు, గుర్రపు ప్రయాణాలు అనేకం మనకు కనిపిస్తూనే ఉన్నాయంటే కేవలం ప్రభుత్వాలకు చిత్తశుద్ధిలేకపోవటమే కారణం. చరిత్రలో ఎన్నో గొప్ప పోరాటాలు సలిపిన...
విమానాశ్రయాలు నిర్మిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందా?
Mon, 2015-09-28 17:25
విమానాశ్రయాలు నిర్మిస్తేనే దేశం, రాష్ట్రం వేగంగా అభివృది ్ధచెందుతుందని కేంద్రంలోని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని చంద్రబాబు నోట తరచూ వినిపిస్తున్నది. ఇది వాస్త వమా..? ఇదే నిజమైతే ఇప్పటికే మన దేశంలో 448 విమానాశ్రయాలున్నాయి. దేశం ఎంత అభివృద్ధి చెంది ఉండాలి? ప్రజల జీవన ప్రమాణం ఎంత మెరుగుపడి ఉండాలి? అసలు విమానాశ్రయాలు నిర్మిస్తే దేశం అభివృద్ధి చెందినట్లా..? లేక విమానాల్లో ప్రయాణించ గలిగే ఆర్థిక స్తోమత ప్రజలకు కలిగిస్తే దేశం అభివృద్ధిచెందినట్లా..? అన్నది పాలకులు ఆలోచించాలి. ఇటీవల కేంద్ర పౌర విమాన యాన శాఖ వెలువరించిన నివేదికను పరిశీలి స్తే.. ప్రభుత్వ అధిపతులు విమానాశ్రయాల నిర్మాణ కోసం నిర్వహిస్తున్న ప్రచారంలోని డొల్లతనం ఇట్టే అర్థమవుతుంది.
...
కార్పొరేట్ అనుకూల విధానాల్లో టిడిపి ప్రభుత్వ ముందంజ
Mon, 2015-09-28 17:21
కార్పొరేట్ కంపెనీలు సులు వుగా వ్యాపారం చేసుకునే అవకా శాలు కల్పించిన రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఈ అవకాశాలు కల్పించడానికి అవసర మైన సంస్కరణలు అమలు చేస్తున్న క్రమంలో కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల ప్రయో జనాలు సమిధలవుతున్నాయి. కార్పొరేట్ అనుకూల సంస్కరణల అమలులో బిజెపి, తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి ఆరు స్థానాల్లో ఉన్నాయి. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణల అమలు బాగా స్పీడందుకుంది. ప్రపంచ బ్యాంకుతో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకున్న బంధం దీనికి తోడయింది. ఈ సంస్కరణల సునామీలో కొట్టుకుపోకుండా నిలబడగల గాలంటే ప్రపంచబ్యాంకు సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడటం తప్ప మరో మార్గం లేదు.
...
భగత్‌సింగ్ త్యాగం వృథా కానీయరాదు..
Mon, 2015-09-28 17:15
విప్లవానికి మారు పేరు భగత్‌సింగ్. పోరాటాలకు నిలువెత్తు నిదర్శనం. స్వాతంత్య్ర పోరాటంలో యువ రక్తంతో దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన త్యాగశీలి. నేటి యువతకు ఆదర్శప్రాయుడే కాకుండా రోల్ మోడల్. ఇటువంటి విప్లవనేత జయంతిని పురస్కరించుకుని పాలకుల వినాశకర విధానాలపై గళం విప్పేందుకు యువత నడుంబిగించాలి. సువిశాల భారతదేశంలో 1907 సెప్టెంబర్ 27న పంజాబ్ రాష్ట్రం రాయల్‌పూర్ జిల్లా బంగా ప్రాంతంలో భగత్‌సింగ్ జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఈ యువకిశోరం ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో స్వాతంత్య్ర పోరాటానికే వన్నెతెచ్చారు. దేశాన్ని ఉత్తేజింపజేశారు. తన 13వ ఏటనే గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి ప్రభావితుడయ్యారు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు...