ఆర్టికల్స్

ఆశ నిరాశల మధ్య రాజధాని నిర్మాణం..

రాజధాని అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. ప్రచారహోరు ఉధృతంగా ఉంది. మీడియా రాజధానిపైనే కేంద్రీకరించింది. ప్రభుత్వ పెద్దలు, తెలుగుదేశం నేతలు, అధికార యంత్రాంగమంతా నీరు-మట్టి, 5కె రన్‌ పేర్లతో హడావుడి చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ సహా ప్రముఖ నేతలు, సెలబ్రిటీలు శంకుస్థాపనకు హాజరు కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సందడి నెలకొన్నది. వందల కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు. ఆహ్వానపత్రిక మొదలు వంటకాల వరకు అన్నీ ప్రచార అంశాలుగా మార్చేశారు. ఈ నేపథ్యంలో రాజధాని గురించే సర్వత్రా చర్చ నెలకొన్నది.
రాష్ట్రం విభజించబడిన నేపథ్యంలో మంచి రాజధాని కావాలని ప్రజలందరి ఆకాంక్ష. తొలుత రాజధాని నిర్మించబోయే ప్రాంతం గురించి ఎంతో చర్చ జరిగినా...

రచయితలకు తోడ్పాటుగా నిలుద్దాం!

హిందూ ఫాసిస్టు రాజకీయాలు వేర్వేరు రూపాల్లో ప్రజా ఉద్యమకారుల మీద, ప్రజాసాహిత్య సృష్టికర్తల మీద, వారి కలల మీద సంకెళ్లను విదిలిస్తోంది. దేశంలోనూ 'సాంస్కృతిక జాతీయవాదం' సృజనరంగాన్ని కత్తుల బోనులోకి నెట్టేస్తున్న వైనం కళ్ళ ముందు విస్తరిస్తున్నది. ఆర్య జాతి సాంస్కృతిక ఆధిపత్యం పేరుతో జర్మనీలో హిట్లర్‌ సాగించిన మారణకాండకు మరో రూపంగా సదరు మానసిక, భౌతిక హింసను ఇక్కడ ప్రవహింపజేయటానికి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) వేర్వేరు రూపాలతో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం నుంచి 2002లో గోద్రా ముస్లిం మారణకాండ దారిలో నిన్నమొన్నటి దాద్రీ దుర్మార్గ సంఘటన దాకా అనుసరిస్తున్న మతోన్మాద హింసా రాజకీయాలు అసహ్యం...

దారిద్య్రం గురించి మరోసారి..

అక్టోబరు 6వ తారీఖున హిం దూపత్రికలో ప్రపంచంలో దారి ద్య్రం తగ్గిందనే ప్రపంచ బ్యాంకు అంచనాకు సంబంధించిన వార్త ప్రచురింపబడింది. ప్రపంచం మొత్తంమీద 2011లో 14.2శాతం మంది దారిద్యంలో ఉంటే ఆ సంఖ్య 2012లో 12.8 శాతంగా నమోదయింది. భారతదేశం లో కూడా దారిద్య్రం అదే స్థాయిలో తగ్గినట్లు ఆ వార్తా కథనంలో ఉన్నది. ప్రపంచబ్యాంకు అలాంటి నిర్ధారణకు ఎలా వచ్చింది? ముఖ్యంగా భారతదేశం విషయంలో అదొక మిస్టరీగా మిగలనున్నది. ఎందుకంటే భారతదేశంలో నేషనల్‌ శాంపిల్‌ సర్వే 5 సంవత్సరాలకొకసారి విస్తృత సర్వే చేస్తుంది. మిగతా సంవత్సరాలలో అంతగా ఆధారపడజాలని చిన్న చిన్న సర్వేలు చేస్తుంది. వీటిని అంతగా ఉపయోగిం చరు. గతంలో చివరిగా 2011-12లో విస్తృత సర్వే జరిగింది. కాబట్టి ఈ కాలంలో పేదరికం...

వ్యవసాయంతో బ్యాంకుల దోబూచులాట

నేటి వ్యవసాయ రంగంలో కొనసాగుతున్న మాంద్యానికి పెట్టు బడులు ప్రధాన కారణం. 1965-85 మధ్య బ్యాంకింగ్‌ రంగం వ్యవ సాయ రంగానికి పూర్తి సహాయ సహకారాలు అందించింది. ఫలితం గా, ఉత్పత్తి, ఉత్పాదకత ఆహార ధాన్యాలలో ఐదు రెట్లు పెరిగింది. పెరిగిన జనాభాకు తగి నంత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసుకోగలి గాం. ఆహార ధాన్యాలలోనే కాక పప్పులు, నూనెగింజలు, తదితర పంటల్లో కూడా స్వయంపోషకత్వం సాధించాం. 1969లో 17 బ్యాంకులను జాతీయం చేశారు. 1980లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా, విజయ బ్యాంకును జాతీయం చేశారు. జాతీయం చేయడంతో బ్యాంకులు వ్యవసాయ రంగానికి తగినంత రుణ సౌకర్యం కల్పించాయి. 1972లో రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ యం నర్సింహ్మం నేతృ త్వంలో వేసిన కమిటీ సేవా దృక్పథంతో గ్రామీణ...

అప్పుల ఆడంబరం..

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత సామెత రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నప్పుతుంది. పూట గడిస్తే చాలన్నట్లు విత్త సమస్య అఘోరిస్తున్నా సర్కారు అట్టహాసాలకు ఆడంబరాలకు తక్కువేం లేదు. మొన్న గోదావరి పుష్కరాలు నిన్న నదుల అనుసంధానం నేడు అమరావతి శంకుస్థాపన హద్దు మీరిన ప్రభుత్వ ప్రచార పటాటోపానికి మచ్చు తునకలు. అమరావతి భూమి పూజ, సంకల్ప దీక్ష వగైరా వగైరా ఉండనే ఉన్నాయి. నీరు-చెట్టు, రైతు భరోసా, స్వచ్ఛ భారత్‌ వంటి అనేకానేక ఆర్భాట కార్యక్రమాలకు కొదవే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అని పిలిపించుకోవడం ఇష్టం. ఈవెంట్‌ మేనేజర్‌ అంటే మరీ ఇష్టం. ఆ 'ఘన కీర్తి' కోసం విషయం చిన్నదా పెద్దదా అనే విచక్షణ లేకుండా హంగు ఆర్భాటాలకు పోయి చేతులు...

రాజ్యంలో మతం - మతంతో రాజకీయం

భారత్‌ ''భిన్నత్వంలో ఏకత్వం'' ఉన్న దేశం. మన గొప్పతనానికి, ప్రజల ప్రశాంత జీవనానికి అదే కారణం. భిన్న కులాలు, మతాలు, జాతులు, సంస్కతుల మధ్య భాసిల్లిన భారతీయతకు ఇప్పుడు భంగం వాటిల్లింది. ''రాజ్యాంగమెంత మంచిదైనా పాలకులు మంచివారు కాక పోతే అది చెడుగా మారు తుంది. ఎంత చెడు రాజ్యాంగమైనా పాలకులు మంచి వారైతే మంచిదిగా మారుతుంది'' అని డాక్టర్‌ అంబేద్కర్‌ హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం భారత దేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. లౌకికవాదానికి నిఘంటువులు ''ఈ భౌతిక ప్రపంచానికి చెందిన, ఆధ్యాత్మికం కాని, మతాతీతమైన'' అనే అర్థాలనిచ్చాయి. ఎఆర్‌ బ్లాక్‌ షీల్డ్‌ నిర్వచించినట్లు లౌకికవాదమంటే మత స్వేచ్ఛ, హేతువాదం, భౌతికవాదం, మానవతావాదాల పట్ల...

బహుళజాతి కంపెనీపై తొలి తిరుగుబాటు

ఎత్తయిన గోడలు, చుట్టూ ముళ్ల కంచెలు, ఈగ సైతం లోపలకు వెళ్లలేనంతగా భద్రత... ఇదీ... ఓలం ఆగ్రా ఇండియా లిమిటెడ్‌ (ఒఎఐఎల్‌) బహుళజాతి కంపెనీ విశాఖ జిల్లాలో ఏర్పాటైన ప్రాంతం... అధికారంలో ఉండే రాజకీయ నాయకుల అండదండలు, కార్మిక శాఖ ఉన్నతాధికారుల చల్లని చూపులు రక్షణ కవచాల్లా ఓలం కంపెనీకున్నాయి. ఈ స్థితిలో లోపల ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియని పరిస్థితి. విశాఖ జిల్లాలో శాఖోపశాఖలుగా విస్తరించిన ఓలం జీడిపిక్కల కంపెనీ అన్ని కార్మిక చట్టాలనూ తుంగలో తొక్కుతూ పబ్బం గడుపుకుంటోంది...
90 శాతం మహిళా శ్రామికులే...
దీంట్లో పనిచేసే వేలాదిమందిలో 90 శాతం మహిళలే. దీంతో మహిళల శ్రమను కారు చౌకగా దోచుకుంటున్నది. దాదాపు 12 సంవత్సరాల క్రితం...

ఫాసిస్టు దాడి..

ముంబయిలో రచయిత సుధీంద్ర కులకర్ణిపై శివసేన మూకలు చేసిన దాడి సభ్య సమాజం వేనోళ్ల ఖండించాల్సిన దుర్మార్గ చర్య. మన దేశంలో మతోన్మాద శక్తులు అధికార పీఠాన్ని అధిరోహించిన తరువాత భావ ప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడుల పరంపరలో ఇది తాజాది. పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్‌ మహ్మద్‌ కసూరి పుస్తకావిష్కరణ సందర్భంగా ఫాసిస్టు మూకలు రెచ్చిపోయి కులకర్ణిపై నల్ల పెయింట్‌తో జరిపిన దాడి మేధో జగత్తును విస్మయానికి గురిచేసింది. కేంద్ర ప్రభుత్వంలోను, మహా రాష్ట్ర ప్రభుత్వంలోను బిజెపికి భాగస్వామిగా వున్న శివసేన విద్వేషపూరిత రాజకీయాలకు పేరుమోసింది. గత వారం ముంబయిలో జరగాల్సిన పాకిస్తానీ గజల్‌ గాయకుడు గులాం అలీ సంగీత కచేరిపై దాడి చేస్తామని బెదిరించి ఆ...

హుదూద్‌ వంచన..

 ఉత్తరాంధ్ర, ప్రధానంగా విశాఖ నగర రూపురేఖలను చిన్నాభిన్నం చేసిన హుదూద్‌ విలయం సంభవించి సరిగ్గా ఏడాది. ఆ ప్రచండ తుపాను ప్రాంతాల పునర్నిర్మాణం, బాధితుల సహాయ, పునరావాసాలపై నాడు ప్రభుత్వం గుప్పించిన హామీలపై వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. కంటి తుడుపు చర్యలు, ప్రచార్భాటం తప్ప ఒక్క పటిష్ట, శాశ్వత చర్య లేదుగాక లేదు. వినాశనం నుంచి ప్రజలు స్వంతంగా శక్తినంతా కూడదీసుకొని కుదుట పడ్డారు మినహా ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనా దక్షత, కొండంత మనసు వలన హుదూద్‌ బాధితుల జీవితాల్లో కాంతులు విరజిమ్మాయంటున్న అనుకూల మీడియా కథనాలు వంచనా శిల్పాలు. తుపానుతో ఛిద్రమైన విశాఖ మురికివాడలను, మత్స్యకార...

CPMపై అక్కసుతో తప్పుడు రాతలా?

సీనియర్‌ పాత్రికేయులు, ప్రస్తుత బిజెపి అధికార ప్రతినిధి, ఎంపీ ఎంజె అక్బర్‌ ఆక్టోబరు 5న వృద్ధ నేతలు-వ్యర్థ సిద్దాంతాల పేరుతో సాక్షి దినపత్రికలో వ్యాసం రాశారు. సీనియర్‌ పాత్రికేయులుగా సమకాలీన రాజకీయాల్లో విశ్లేషణా త్మక విమర్శలు చేసి ఉంటే మంచిది. కానీ అందుకు విరుద్ధంగా తమ పార్టీ సహజ లక్షణాలు పుణికి పుచ్చుకుని కమ్యూనిజంపై ముఖ్యంగా మార్కిస్టు పార్టీపై కూడా విమర్శలకు దిగారు. ఆయన పేర్కొ న్నట్టుగా కాకుండా సిపిఎంకు వృద్ధనేతలు, వారి త్యాగాలు, ఆశయ సాధన, పోరాట పటిమే మార్గదర్శకాలు, ప్రస్తుత బిజెపికి సీనియర్‌ నేతలన్నా, వారి అభిప్రాయాలన్నా గౌరవం లేని పద్ధతుల్లో బలవంతపు రిటైర్‌మెంట్‌ ఇచ్చి రాజకీయ సమాధి చేయడం అలవాటు. దానికి ఉదాహరణ మన కళ్ల ముందు ఉన్న ఎల్‌...

మోడీ మౌనంపై కలాల తిరుగుబాటు

తమ సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇవ్వడం ద్వారా ప్రముఖ రచయితలు నయనతార సెహగల్‌, అశోక్‌ వాజ్‌పేయి ప్రధాని మోడీ విస్మరించిన రెండు విధులను, బాధ్యతలను గుర్తు చేశారు. ఈ దేశంలో ఒక పౌరునికున్న జీవించే హక్కును పరిరక్షించడం, సృజనాత్మకతకు సంబంధించి కళాకారునికి గల హక్కును పరిరక్షించడం. దేశంలో ఇంత జరుగుతున్నా తమ సహ రచయితలు, సాహిత్య సంస్థలు మౌనం పాటించడం పట్ల కూడా వారు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ప్రత్యేకించి ఒక అన్యాయం జరుగుతుంటే దాన్ని మాత్రమే సంస్కరించాలని రచయిత భావించరాదు. అవసరమైతే నాగరికతా స్ఫూర్తికి సంబంధించి హెచ్చరికల సంకేతాలు కూడా పంపించాలి. సర్వకాల సర్వావస్థలయందూ పరిరక్షకుడిగా ఉండాలి. ఇక్కడ, బిజెపి రెండు రకాల ధోరణులను...

భ్రమరావతి - ప్రైవేటు చంద్రహారతి!

రాజధాని అమరావతి నిర్మాణం శంకుస్థాపనకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా ఆర్భాటం చేస్తున్నది. నభూతో నభవిష్యతి అన్నట్టు ఈ ఉత్సవం నిర్వహించడం నవ్యాంధ్రప్రదేశ్‌ భవితవ్యానికి బంగారు బాట అని శత విధాల ప్రచారం చేస్తున్నది. అనుకూల మీడియా కూడా అదే తరహాలో ఆకాశానికెత్తి చూపిస్తున్నది. రాజధానిగా అమరావతి ఎంపికను గాని, అక్కడ నిర్మాణం ప్రారంభిం చడాన్ని గాని వ్యతిరేకిస్తున్నవారె వరూ లేరు. కాకపోతే శ్రుతిమించిన హంగామాపై వ్యా ఖ్యలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక సినిమా షూటింగు ప్రారంభం ఆర్భాటాన్ని బట్టి పైసలు రావు. అలాగే తమ కృషిని బ్రహ్మాండంగా చూపించుకోవాలనే తాపత్రయంలో మోయ లేని ఖర్చును మీద వేసుకోవడం అవసరమా? ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే రాజధాని నిర్మాణ...

Pages