ఆర్టికల్స్

డ్రాపౌట్స్‌ను పెంచే డిటెన్షన్‌ విధానం..

పాఠశాల విద్యలో డిటెన్షన్‌ విధానం తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్ర మానవ వనరుల శాఖ దేశవ్యాప్త చర్చకు తెరతీసింది. ఆగస్టు 19న ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల విద్యామం త్రుల, అధికారుల సమావేశంలో డిటెన్షన్‌ విధానం ప్రవేశ పెట్టాలని చర్చ జరిగి, రాష్ట్రాల అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ కోరారు. కేంద్ర విద్యా విషయాల సలహా మండలి (సిఎబిఇ) ఈ మేరకు సిఫార్సు చేసినట్లు ఆమె తెలిపారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా విద్యాశాఖ ఆధ్వర్యం లో మండల, జిల్లా స్థాయిలో ఉపాధ్యాయు లు, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అభిప్రాయ సేకరణలో విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, తల్లిదండ్రులు మొదలైన వారికి భాగస్వామ్యం కల్పించవలసిన...

సంఘ్ సర్కార్‌..

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌), కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన పరస్పర అవగాహన భేటీ లౌకికవాదం, జాతి సమగ్రతలను ప్రశ్నార్ధకం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ సహా పలువురు మంత్రులు సంఫ్‌ు ప్రముఖుల వద్దకెళ్లి తమ ప్రోగ్రెస్‌ రిపోర్టులు సమర్పించడం ద్వారా కేంద్ర సర్కారు ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో నడుస్తోందని చెప్పకనే చెప్పారు. తమ సమావేశం సమాచార మార్పిడి కోసమని ఇరుపక్షాలూ పైకి చెబుతున్నా ఆర్‌ఎస్‌ఎస్‌ మతతత్వ ఎజెండాను అమలు పరచడానికి కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసిన సమావేశమన్నది స్పష్టం. ఎన్‌డిఎ ప్రభుత్వానికి సంఫ్‌ు రిమోట్‌ కంట్రోల్‌లా పని...

ఇంత ఉదాసీినతా..?

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="" style="color: rgb(68, 68, 68); font-family: Mandali; font-size: 16px; line-height: 28.8px; text-align: justify;">పొగాకు ఉత్పత్తిలో బ్రెజిల్‌, అమెరికా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది. మన దేశంలో కర్నాటక, ఎపిలోనే సాగు అత్యధికం. పొగాకుపై ఏడాదికి రూ.20 వేల కోట్ల ఎక్సయిజ్‌ సుంకం, రూ.ఐదు వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం కేంద్రానికి లభిస్తోంది. ఇంత ఆదాయం సమకూర్చిపెట్టడానికి కారకులైన పొగాకు రైతులంటే సర్కారుకు చులకన. వారికి గిట్టుబాటుధర కల్పనపై ఉదాసీనత. సిగరేట్ల తయారీ దిగ్గజం ఐటిసి, ఇంకా ఆ రంగంలోని బహుళజాతి సంస్థలు ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడిస్తుండగా రైతుల పరిస్థితి దీనావస్థకు చేరుతోంది...

దుర్మార్గం..

హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరిన విద్యార్థులపై విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పిన తీరు దుర్మార్గం. ఏ మాత్రం కనికరం లేకుండా పోలీసులు విరుచుకు పడిన తీరే పైనుండి అందిన ఆదేశాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అసాంఘిక శక్తులతోనూ, శత్రు సమూహాలతోనూ వ్యవహరించినట్లు పోలీసులు విద్యార్థుల పట్ల వ్యవహరించారు. విద్యార్థినులను సెల్‌ ఫోన్లో చిత్రీకరించడం, చున్నీలు గుంజడం, జుట్టు పట్టి లాగడం వంటి చర్యలు పోలీసుల అనాగరిక స్వభావాన్ని వెల్లడిస్తున్నాయి. ఇష్టం వచ్చినట్లు లాఠీఛార్జీ చేయడం, సొమ్మసిల్లి పడిపోయిన వారిని కూడా బూటు కాళ్లతో తొక్కడం, బలవంతంగా వ్యాన్‌లలో ఎక్కించిన తరువాత కూడా పిడిగుద్దులకు దిగడం వంటి చర్యలు ఏ నాగరికతకు వారసత్వమో పోలీసు...

హిందూత్వ వెనుక కుల వైరస్‌

హిందూ జాతీయవాదం ఆచరణీయమైన ప్రాజెక్టా? ప్రధానికి సంబంధించినంత వరకు ఇది నిరర్థకమైన ప్రశ్న కాదు. మరో కారణం రీత్యా ఇదొక నిరర్థకమైన ప్రశ్న. రాజ్యాగాన్ని అనుసరించి భారతదేశం ఎన్నటికీ హిందూ దేశం కాబోదు. ఒక జాతి రాజ్యంగా ఇది రాజకీయంగా మతంతో ఎలాంటి సంబంధంలేనిదిగా ఉండి తీరాలి. ఇదే ప్రశ్నను మరో రకంగా కూడా చెప్పవచ్చు. లౌకికవాద ''భారతీయ'' జాతీయవాదం ఆచరణీయమైన ప్రాజెక్టా? గీతా ప్రెస్‌ ప్రచురణలననుసరించి గట్టిగా 'కాదు' అనే వస్తుంది. వారి సిద్ధాంతం హిందూ జాతీయవాదం. వారి లక్ష్యం హిందూ భారతదేశం. ప్రస్తుతం కేంద్రంలో వారి సైద్ధాంతిక అనుబంధ సంస్థలే అధికారంలో ఉన్నందునా, రాజ్యాంగపరమైన వాస్తవాన్ని వారు తిరస్కరిస్తున్నందునా ఈ ప్రశ్నకు వారిచ్చిన సమాధానంపై దృష్టి...

అన్నిశాఖలపై ప్రపంచబ్యాంకు పెత్తనానికి యత్నం..

 ప్రపంచ బ్యాంకు ఈ నెల 14న 'అసెస్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ రిఫామ్స్‌' అనే నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 1-జూన్‌ 30 మధ్య పారిశ్రామిక, వ్యాపార సంస్కరణలకు సంబం ధించి 98 అంశాలను మదింపు చేసింది. ప్రపంచ బ్యాంక్‌ కీలక పాత్ర పోషించి రూపొం దించిన ఈ నివేదిక రూపకల్పనలో మేక్‌ ఇన్‌ ఇండియా, కెపియంజి, సిఐఐ, ఫిక్కీ ఉన్నాయి. ఇందుకు 285 ప్రశ్నలను రూపొందించి, వాటికి ఆయా రాష్ట్రాలు ఇచ్చిన సమాధా నాలు, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి ర్యాంకులు నిర్ణయిం చినట్లు నివేదికలో పేర్కొంది. ఈ ప్రశ్నలలో కార్మిక చట్టాల నియంత్రణకు సంబంధించినవి 51 కాగా, మరో 61 తనిఖీలకు సంబంధించినవి. మిగిలిన 112 ప్రశ్నలు ఫ్యాక్టరీలు, సంస్థలకు సంబంధించినవి....

భ్రమ-వాస్తవం

తెగించి పెట్టుబడులు పెట్టాలంటూ పారిశ్రామిక వేత్తలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపు దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అయోమయానికి, గందరగోళానికి అద్దం పడుతోంది. పెట్టుబడిదారులతో పాటు, బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు పాల్గొన్న ఒక కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి నష్టాలను భరించే శక్తి ప్రైవేటు రంగానికే ఉంటుందని కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ప్రధానమంత్రి నోటి వెంట వచ్చిన ఈ మాటలు ఆశావహ ధృక్పథాన్ని కాకుండా దానికి భిన్నమైన నైరాశ్యాన్ని ప్రతిబింబిస్తుండటం గమనార్హం. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదంతో దేశం రూపురేఖలు మారిపోనున్నాయంటూ కొద్దిరోజుల క్రితం వరకూ ఊదరగొట్టిన ప్రచారానికి కూడా తాజా వ్యాఖ్యలు భిన్నం. గతంలో ఏ ప్రధాన మంత్రీ పర్యటించని...

జనం స్పందన చూసైనా స్పృహలోకి వస్తారా!

సెప్టెంబర్‌ 2న జరిగిన దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగ, కార్మిక వర్గాల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. అందరి అంచనాలకు మించి కార్మికులు సమ్మెలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు తమ వ్యతిరేకతను స్పష్టంగా చాటారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, పోస్టల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఇన్సూరెన్సు, బ్యాంకింగ్‌ ఉద్యోగులు, ఓడరేవులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనూ, బొగ్గు గనుల్లోనూ, రక్షణరంగ పరిశ్రమల్లోనూ పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు అత్యధిక శాతం సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ రవాణా కార్మికులతో పాటు ప్రయివేటు రంగ రవాణా కార్మికులు కూడా కలిసి దేశవ్యాప్తంగా సమ్మెచేయడంతో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. సమ్మెకు రెండు రోజుల ముందు నుంచే ''బిఎంఎస్‌ సమ్మెను...

ప్రశ్నిస్తేనే..!

న్నెన్నో మాయలు చేసినవాళ్ళు మహాత్ములుగా బతికిపోతున్న కాలంలో మనిషిగా, మంచి మనిషిగా బతకడమే కష్టమైన విషయం అంటాడు కబీరు. మంచి మనిషిగా బతకడమంటే మౌనంగా తన దారిన తాను బతకడం కాదు. తన కళ్ళెదుటే దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే కళ్ళప్పగించి చూడటం కాదు. తానొవ్వక, నొప్పింపక, తప్పించుకు తిరిగే లౌక్యం చూపడమూ కాదు. మాయలపేరిట, మంత్రాల పేరిట మూఢత్వంలోకి లాక్కెళ్ళే కుతంత్రాలను ప్రశ్నించాలి. మనిషికి క్షేమకరం కాని చెడు మీద తిరగబడే తత్వాన్ని ప్రదర్శించాలి. హేతువుకు నిలవని విషయాలను సవాల్‌ చేయాలి. హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని ప్రపంచానికి అందించాలి. తన చుట్టూ ఉన్న ప్రజలలో ప్రశ్నించే తత్వాన్ని పాదుకొల్పాలి. ఇవాళ భూమి బల్లపరుపుగా ఉందని చెప్పడానికి ఎవరూ సాహసించరు. కానీ...

విద్యారంగ స్వేచ్ఛకు ప్రమాదం..

 ఈమధ్య పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతున్న విద్యార్థుల పోరాటం గురించి మీడియాలో చూస్తున్నాం. ఆ సంస్థకు అధ్యక్షుడిగా గజేంద్ర చౌహాన్‌ను, ఆయనతోపాటు మరో ముగ్గురిని పాలక మండలి సభ్యులుగా నియమించటాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఆ సంస్థతో సంబంధంలేని ఇతర సినిమా రంగ నిష్ణాతులు కూడా ఈ నిరసనలో పాలుపంచుకుంటున్నారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఆయనకున్న అర్హతల్లా ఆయన మోడీపై సినిమా తియ్యటమే. దానితోపాటు మహాభారతం టీవీ సీరియల్‌లో ధర్మరాజు పాత్రను పోషించాడు. ఒకప్పుడు మహామహులు నిర్వహించిన ఆ బాధ్యతలోకి రావటానికి ఈ అర్హతలు ఏమాత్రం సరిపోవు. అయితే పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మాత్రమే ఇలా జరగలేదు. అనేక ఇతర పరిశోధనా సంస్థలలో కూడా ఇలాంటి...

మొక్కుబడి సమావేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలు తూతూ మంత్రంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు మాటల యుద్ధాలు, తోపులాటలు, వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో అసెంబ్లీ దద్దరిల్లింది మినహా ప్రజోపయోగ చర్చలు, తదుపరి కార్యాచరణకు ఎలాంటి స్థానం లేకపోవడం దారుణం. విపక్షానికి అవకాశమివ్వడం, విపక్షం లేవనెత్తే అంశాలకు సమాధానాలివ్వడం, తద్వారా సమస్యల పరిష్కారానికి బాటలు వేయడం ప్రజాస్వామ్యంలో అధికారపక్ష కనీస బాధ్యత. అయితే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఈ తరహా స్ఫూర్తిని మరచిన తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. అధికారపక్షం ఎదురు దాడికి దిగితే వ్యూహాత్మకంగా వ్యవహరించి సమస్యలపై సజావు చర్చ వైపు దారి మళ్లించాల్సిన విపక్షమూ దానికి భిన్నంగా...

సామాజిక న్యాయమా? ఆధిపత్యమా?

మరోసారి రిజర్వేషన్లపై రగడ మొదలైంది. గుజరాత్‌ పటేళ్ల ఆందోళన దీన్ని తిరిగి తెరపైకి తెచ్చింది. ఇది చాలా ఆందోళన కరమైన పరిణామం. తమను వెనకబడిన తరగతుల్లో చేర్చి రిజర్వేషన్లు వర్తింపజేయాలని వారు చేపట్టిన ఉద్యమం హింసాత్మక రూపం తీసుకుంది. ప్రధాని సొంత రాష్ట్రం అభివృద్ధికి ఆధునిక నమూనాగా చెప్పబడుతున్న గుజరాత్‌లో ఈ పరిణామం జరగడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనంటూ మీడియా ఊహాగానాలు మొదలు పెట్టింది. దీని వెనక ఎవరున్నారు? ఏ పార్టీ దీనివల్ల లాభపడుతోంది? అంతిమంగా ఇది రిజర్వేషన్లను ఎత్తివేసే వైపు సాగుతుందా? పటేళ్లు నిజంగానే వెనకబడిన వారా? పటేళ్లతోబాటు జాట్‌లు, కమ్మ, రెడ్డి వంటి కులస్తులకు వెనకబడిన తరగతుల హోదా ఇస్తే ఇంక...

Pages