ఆర్టికల్స్
మాటల కోటలు..
Sat, 2015-08-22 11:25
కేంద్రమంత్రివర్యులు వెంకయ్యనాయుడుగారు మరో మారు తన వాచాలతను ప్రదర్శించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో నిట్ శంకుస్థాపనకు విచ్చేసిన సందర్భంగా ప్రత్యేక హోదా ప్రకటించాలని విద్యార్థులు నినదించినదే తడవుగా ఆయనకు ఆగ్రహం కట్టలు తెగింది. హోదా విషయమై ప్రతిపక్షం వారి విమర్శలను సైతం మనసులో పెట్టుకున్నట్టున్నారు. ఆవేశం, ఆక్రోశం కలగలిపిన స్వరంతో ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం స్వోత్కర్ష, పరనిందలతోనే సాగింది. వంటికి వేసుకొనే చొక్కా రంగు మొదలుకొని భుజాన మోసే పార్టీ జండా వరకు ఏకరువు పెట్టి రాజకీయాల్లో తానేవిధంగా స్వశక్తితో ఎది గారో గొప్పగా చెప్పుకున్నారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన సందర్భంగా ఆయన ఆంధ్ర పక్షాన నిలబడి గట్టిగా మాట్లాడబట్టే రాష్ట్రానికి కొంతయినా...
'పోలాకి' థర్మల్ అధర్మాలు..
Fri, 2015-08-21 13:13
శ్రీకాకుళం జిల్లా పోలాకిలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అడ్డదార్లు తొక్కుతోంది. ఎనిమిది గ్రామాల్లోని సుమారు రెండు వేల ఎకరాల భూములు గుంజుకోజూస్తున్నది. రైతులు సుక్షేత్రాలైన భూములను కోల్పోతే వ్యవసాయ కార్మికులు, వృత్తిదార్ల జీవనోపాధి పోతుంది. ప్లాంట్ నిర్మాణం చేపట్టడానికి ముందుగా చేయాల్సిన కనీస నియమ నిబంధనలను పాటించకపోవడమేగాక సాధారణ ప్రజాతంత్ర హక్కులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యుత్‌రంగ పరిస్థితి అంటే ఇప్పుడు పని చేస్తున్న, నిర్మాణంలో ఉన్న, ఇప్పటికే ప్రకటించిన ప్లాంట్లు, విద్యుత్ డిమాండ్, సరఫరా, తదితర వివరాలు చూద్దాం. ప్రపంచమంతటా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో అణు...
యుద్ధం ఎవరిపైన?
Wed, 2015-08-19 15:32
ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా మధ్య ప్రాచ్యంలోని సిరియాలోదురాక్రమణపూరిత యుద్ధానికి తెగబడిన నేపథ్యంలో ప్రధాని నరేందర్ మోడీ దుబాయిలోని క్రికెట్ స్టేడియం వేదిక నుంచి ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు పిలుపునిచ్చారు. ఇది కాకతాళీయంగా జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగానే జరిగిందా? అన్న విషయం అలా వుంచితే మోడీ ఈ విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, యుద్ధోన్మాది జార్జి డబ్ల్యు బుష్ నుంచి ప్రేరణపొందినట్లుగా కనిపిస్తోంది . మోడీ ప్రసంగం నాటి బుష్ ప్రసంగానికి నకలుగా కనిపిస్తోంది. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచమా నీవెటు అని బుష్ వల్లించిన డైలాగునే ఇప్పుడు మోడీ వల్లెవేశారు. ఆ మాటకొస్తే ఉగ్రవాదంపై యుద్ధం అనే పదం కూడా అమెరికా మాజీ అధ్యక్షులవారు వాడినదే. సెప్టెంబరు 11...
ప్రమాదకరం..
Wed, 2015-08-19 13:29
విద్యలో మితిమీరిన కేంద్ర జోక్యానికి, హిందూత్వ భావాలు చొప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతుండడం పట్ల ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ వెలిబుచ్చిన ఆందోళన మామూలు విషయం కాదు. అమర్త్యసేన్ రాజకీయ నాయకుడు కాదు. ప్రతిపక్షానికి చెందినవాడు అసలే కాదు. ప్రభుత్వ ప్రమాదకర పోకడను చాలా దగ్గర నుంచి పరిశీలించిన ఆర్థికవేత్త. అలాంటి వ్యక్తి ఎన్‌డిఎ ప్రభుత్వ ధోరణిని నిలదీశారంటే పరిస్థితులు ఎంతగా చేజారాయో ఆలోచించాలి. తాజాగా తాను రచించిన 'ది కంట్రీ ఆఫ్ ఫస్ట్ బార్సు' గ్రంథంలో సర్కారు వైఖరిని సేన్ నిరసించారు. విద్యా విషయాల్లో రాజకీయ జోక్యం పరాకాష్టను దాటిందని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలన్నింటినీ హిందూత్వ...
GST నష్టదాయకం..
Tue, 2015-08-18 14:21
జిఎస్‌టి(గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) వ్యవస్థకు మారటం వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించటం గురించి మాత్రమే ఇప్పటి వరకు చర్చ పరిమిత మైంది. అంతర్రాష్ట్ర వాణిజ్యం జరిగినప్పుడు జిఎస్‌టిని అంతిమంగా ఉపయో గించుకునేవారు మాత్రమే కడతారు. దీనితో ఆ సరుకులను ఉత్పత్తి చేసే రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం రాదు. ఇది రాష్ట్రాల ఖజానాలకు నష్టదాయకం. అంతర్రాష్ట్ర వాణిజ్యం జరగనప్పుడు కూడా ప్రస్తుత పన్ను వ్యవస్థ నుంచి జిఎస్‌టి వ్యవస్థకు మారటం నష్టదాయకమే. రాష్ట్రాలకు వచ్చే అలాంటి నష్టాలకు పరిహారం చెల్లించనున్న కాల వ్యవధి, అలాంటి నష్టాలను అంచనావేసే పద్ధతి వంటి విషయాల గురించి చర్చ జరుగుతున్నది. రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించటం అనేది నిస్సందేహంగా చాలా...
విలువైన సమయం వృథా..
Sat, 2015-08-15 13:02
పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు ముందుగా ఊహించిన రీతిలోనే ఎలాంటి ప్రజా ప్రయోజన అంశాలపై చర్చకు నోచుకోకుండానే ముగిసిపోయాయి. లలిత్‌గేట్, వ్యాపమ్ సంబంధిత అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభా కాలం హరించుకుపోవడమే కాక 260 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు రావాలనుకున్న భూ సేకరణ బిల్లు మొదలుకొని వస్తు సేవల పన్ను బిల్లు వరకు ఏదీ చర్చకు నోచుకోలేదు. ఇటు లోక్‌సభలోనూ, అటు రాజ్యసభలోనూ దాదాపు మూడు వారాల పాటు ప్రతిష్టంభన రాజ్యమేలింది. మున్నెన్నడూ లేనివిధంగా సభా కార్యక్రమాలకు ఆటంకంగా తయారయ్యారంటూ పాతికమంది సభ్యులను స్పీకర్ ఐదు రోజులపాటు సస్పెండ్ చేయడం, వారికి సంఘీభావంగా పలువురు ప్రతిపక్ష్ష సభ్యులు సమావేశాలను...
అఖిల భారత సమ్మెలు సంస్కరణలకు బ్రేకులు..
Sat, 2015-08-15 11:54
''ఇప్పటి వరకూ జరిగిన మానవ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే'' అని మార్క్ప్ మహానీయుడు నిర్వచించాడు. బానిసలు-బానిస యజమానులు, ప్యూడల్ ప్రభువులు-రైతాంగానికి మధ్య జరిగిన పోరాటాలు చరిత్రగతినే మార్చివేశాయి. ప్రస్తుతం నడుస్తున్న పెట్టుబడి దారీయుగంలోనూ కార్మిక వర్గపోరాటాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. భారత కార్మికవర్గం కూడా ఉన్నత పోరాట లెన్నింటినో నిర్వహించింది. 1862 హౌరా రైల్వే కార్మికులు ఎనిమిది గంటల పనికోసం ప్రారంభించిన తొలి సమ్మెతో కార్మిక వర్గం దుర్భరమైన పని పరిస్థితులపై సమరశంఖం పూరించింది. 1908లో స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్ అరెస్టుకు నిరసనగా బొంబాయిలో ఆరు రోజులు జరిగిన సమ్మె నుంచి ప్రారంభించి నేటి వరకూ తమ ఆర్థిక కోర్కెల పైనే కాక దేశ...
నియంతృత్వ పోకడ..
Fri, 2015-08-14 13:20
శ్రీకాకుళం జిల్లా పోలాకిలో నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వాసితులతో మాట్లాడే ప్రయత్నం చేసిన సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి మధు అక్రమ నిర్బంధం ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంలో పెరుగుతున్న అసహనానికి పరాకాష్ట. పోలాకికి పాతిక కిలోమీటర్ల ముందే ఆముదాలవలన రైల్వే స్టేషన్‌లోనే మధును పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకోవడం హేయమైన చర్య. పైగా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియనీయకుండా చేసేందుకు ఆయన సెల్ ఫోన్ గుంజుకోవడం, మారు మూల ప్రాంతానికి తరలించడం ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తున్నాయి. బుధవారం ఉదయం ఆరు గంటలకు మధును అరెస్టు చేసిన పోలీసులు సాయంత్రం ఏడు గంటల వరకు ఆయనను స్టేషన్‌లో నిర్బంధించారు. తన అరెస్టుకు కారణం అడిగితే పై అధికారుల...
ప్రమాదకర పట్టణ సంస్కరణలు..
Fri, 2015-08-14 10:58
కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పట్టణాలకు ర్యాంకులు ఇస్తోంది. పరిశుభ్రతలో మన రాష్ట్రంలోని నగరాలు దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే వెనుకంజలో ఉన్నాయని ప్రకటించారు. కేంద్ర పథకాలలో ఎంపిక చేయడానికి మన రాష్ట్రంలోని నగరాల మధ్య పోటీపెట్టి స్మార్ట్ నగరాలను గుర్తించారు. ఏ పట్టణాలలో దోమల సైజు ఎక్కువగా ఉంది?(దోమలు ఈగల సైజుకు మారుతున్నాయి). చెత్తకుప్పలు ఏ నగరంలో ఎక్కువగా పేరుకుని ఉన్నాయి? మంచినీరు ఎన్ని రోజులకొకసారి ఇస్తున్నారు? పన్నులు ఏ పట్టణంలో ఎక్కువగా ఉన్నాయి? పై అర్హతలు పెడితే మన పట్టణాలు మొదటి ర్యాంకుల్లో ఉంటాయి. తెలుగుదేశం, బిజెపి పాలనలో ఏ పట్టణం చూసినా ఏమున్నది గర్వకారణం?
రాష్ట్రంలోని 111 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రాష్ట్ర జనాభాలో 30 శాతం...
స్మార్ట్ సిటీ: ప్రజాస్వామ్యం శూన్యం
Thu, 2015-08-13 13:23
''స్మార్ట్ సిటీ'' ఇది అత్యంత ఆకర్షణీయమైన పేరు. భ్రమలకు వేదిక. ఆకాశాన్నంటే భవంతులు, విశాలమైన రోడ్లు, రయ్యిన దూసుకు వెళ్ళే కార్లు, మెట్రో రైళ్ళు, ఆఫీసులకు వెళ్ళకుండా ఇంట్లోకూర్చునే ఏ పనైనా సమకూర్చుకునే విధంగా పధ్ధతులు, అందమైన పార్కులు, నీటి ఫౌంటైన్లు, ఈత కొలనులూ, పచ్చటి చెట్లు, జిగేల్ మనే లైట్లు- 'వావ్' ఎంత అందమైన నగరం. ఇలాంటి నగరం కావాలని ఎవరికి మాత్రం ఉండదూ? ఇవన్నీ స్మార్ట్ సిటీలో ఉంటాయని చాలామంది భావిస్తున్నారు. నిజంగా ఇవన్నీ స్మార్ట్ సిటీలో ఉంటాయా లేక స్మార్ట్ సిటీ అన్న భ్రమలో మరేమైనా జరగబోతోందా? ఈ విషయాలను తెలుసుకోవాలంటే ప్రధాన మంత్రి 2015 జూన్ 25న విడుదలచేసిన స్మార్ట్ సిటీ మార్గదర్శకాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిందే.
...
నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలు!
Wed, 2015-08-12 14:24
ఆ గ్రామాలు కాలుష్యానికి చిరునామాలు....! రోగాలకు నిలయాలు.....!! నీటి యుద్ధాలకు నిలువుటద్దాలు....!!! అవి ఎక్కడా అనుకుంటున్నారా! అత్యంత కాలుష్య నగరంగా రికార్డుల కెక్కిన విశాఖ సమీపంలోని సింహాద్రి ఎన్‌టిపిసి విద్యుత్ కర్మాగార చుట్టుప్రక్కల గ్రామాలు. వివిధ పరిశ్రమల విషవాయువుల వల్ల కాలుష్య కోరల్లో కూరుకుపోతున్న గ్రామాలు, వాటి వల్ల బలౌతున్న ప్రాణుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తీర ప్రాంతంలో సెజ్‌లు, పిసిపిఐఆర్‌లు, విద్యుత్ ప్లాంట్లతో ముంచెత్తనున్నట్లు ప్రభుత్వాలు ఆర్భాటంగా చెప్పుకుంటున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న పరిశ్రమల వల్ల అక్కడ పరిస్థితులు ఏమిటి? అక్కడ ప్రజల జీవితాలు ఏవిధంగా ఛిద్రమయ్యాయి? వారిని ఏవిధంగా కాపాడాలనే కనీసం ఆలోచనలేని ఈ...
ప్రజావంచన..
Tue, 2015-08-11 13:41
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాంక్షిస్తూ బెంగళూరు ముని కామకోటి ఆత్మ బలిదానం అత్యంత విషాదకరం. శనివారం తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరం కాగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఒక రోజల్లా కొట్టుమిట్టాడి మరణించడం కలచివేసే అంశం. కోటి ఆత్మార్పణం అతని వ్యక్తిగత, కుటుంబ వ్యవహారంతో ముడిపడలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిన బిజెపి, టిడిపిల విద్రోహ వైఖరికి నిరసనగా తన ప్రాణాలను పణంగా పెట్టాడు. హోదాపై పూటకో మాట రోజుకో అబద్ధం వల్లిస్తూ ప్రజలను గందరగోళంలో అమోమయంలో పడేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధీశులు, వారి పార్టీలే కోటి మృతికి ముమ్మాటికీ బాధ్యులు....