ఆర్టికల్స్

రెండు పార్టీలు నాలుగు నాలుకలు..

నవ్యాంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై బిజెపి, టిడిపిలు చేస్తున్న విన్యాసాలు జుగుప్స కలిగిస్తున్నాయి. అధికారంలోకొచ్చి సంవత్సరం దాటినా హోదాపై స్పష్టం చేయకుండా ప్రజలను డోలాయమానంలో పడేసేందుకు రెండు పార్టీలు నాలుగు నాల్కలతో మాట్లాడుతున్నాయి. ప్రత్యేక హోదా సహా పునర్విభజన చట్టంలో పొందుపర్చిన, ఆ సందర్భంగా పార్లమెంటు చర్చలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామని బిజెపి, టిడిపి సంయుక్తంగా ప్రజలను నమ్మించి ఓట్లేయించుకొని గద్దెనెక్కాయి. వాగ్దానాల అమలులో రెండు పార్టీలూ కప్పదాట్లకు దిగడం జనానికి వెన్నుపోటు పొడవడమే. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కానీ, కనీస పరిశీలన కానీ కేంద్రం చేయట్లేదని మంత్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ లోక్‌సభలో...

ప్రజల కోసం ప్రజాశక్తి

ప్రజల పత్రిక ప్రజాశక్తి నేటితో 34 సంవత్స రాలు ముగించుకుని 35వ వసంతంలోకి అడుగిడు తున్నది. ఈ సందరర్భంగా విజయవాడలో నేడు ప్రజాశక్తి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో 'సమకాలీన పరిస్థితులలో మీడియా' అనే అంశంపై సదస్సు జరుగుతున్నది. పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకులు కామ్రేడ్‌ ప్రకాశ్‌ కరత్‌, వివిధ తెలుగు దినపత్రికల సంపాదకులు, మాజీ సంపాదకులు శ్రీ కె రామచంద్ర మూర్తి, శ్రీ కె శ్రీనివాస్‌, శ్రీ రాఘవాచారి, శ్రీ ఈడ్పుగంటి నాగేశ్వరరావు, శ్రీ ఎస్‌ వీరయ్య, శ్రీ తెలకపల్లి రవి, ప్రజాశక్తి సాహితీ సంస్థ ఛైర్మన్‌ శ్రీ వి కృష్ణయ్య ప్రభృతులు సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. సుమారు 20 సంవత్సరాల తరువాత ప్రజాశక్తి హెడ్‌ ఆఫీసు విజయవాడలో మళ్లీ ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంగా...

మహిళా ప్రాతినిధ్యం

'అతివలు ఆకాశంలో సగం. అవనిపై సగం' అన్న మాటలు వింటే చాలు మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. కాని అభివృద్ధిలో వారి వెనుకబాటునూ, కట్టుబాట్లమధ్య నలిగిపోతున్న వారి పరిస్థితినీ చూస్తే మనసు దుఖంతో చలించిపోతుంది. బీహార్‌ మహిళలు సరిగ్గా ఈ స్థితిలోనే ఉన్నారు. జనాభా రీత్యా దేశంలోకెల్లా మూడవ అతి పెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్‌లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లను మించిపోయింది. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల గణాంకాలు ప్రపంచానికి చాటిచెప్పిన వాస్తవమిది. వారు వెలువరించిన తీర్పుపై ఆయా కుటుంబాల్లోని పురుషుల ప్రభావం ఉన్నప్పటికీ పితృస్వామిక భావజాలం వేళ్లూనుకుపోయిన ఆ రాష్ట్రంలో తండ్రి చాటు బిడ్డలు, భర్త చాటు భార్యలు బయటకు వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం...

మరో ఆధార్‌ దేనికి..?

రాష్ట్రంలో నివసిస్తున్న పౌరులందరినీ ఆధార్‌ తరహాలో గుర్తించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఒక విధానం ప్రకటించి ఇప్పటికే ఉన్న కేంద్ర ఆధార్‌ను ప్రశ్నార్థకం చేసింది. ఆధార్‌తోనే నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ఆధార్‌ మరిన్ని తలనొప్పులు, గందరగోళం తెచ్చిపెట్టడం ఖాయం. ప్రజల సమస్త వివరాలనూ సేకరించేందుకు ఎపి యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్స్‌ పాలసీ తెస్తూ ఎపి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిపార్టుమెంట్‌ బుధవారం వెలువరించిన 16వ నెంబర్‌ జీవోలో పేర్కొన్న పలు అంశాలు పేదలనూ, ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న వారినీ మరింతగా వడపోసి తగ్గించేందుకు, పథకాలకు దూరం చేసేందుకు ఉద్దేశిం చినవి. అరకొర లబ్ధితో బతుకీడుస్తున్న పేదలకు ఆ మాత్రం సాయం సైతం దక్కకుండా...

ప్రతిష్టంభనకు తెరదించాలి!

లలిత్‌ గేట్‌, వ్యాపం కుంభకోణాలు ఊహించిన విధంగానే పార్లమెంటును కుదిపేశాయి. వర్షాకాల సమావేశాలు తొలి రోజున మొదలైన ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్లమెంటు పదే పదే వాయిదా పడడానికి ఎవరు కారకులు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ప్రతిపక్షాలే పార్లమెంటును అడ్డుకుంటున్నాయని, చర్చ జరగడం ఇష్టం లేకే ఇలా చేస్తున్నాయని బిజెపి, మోడీ ప్రభుత్వం చేస్తున్న వాదన పసలేనిది. ప్రతిపక్షాలు పార్లమెంటులో కోరుతున్నదేమిటి? అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతున కూరుకుపోయిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు వసుంధరా రాజే, శివరాజ్‌ చౌహాన్‌లపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని అవి డిమాండ్‌ చేస్తున్నాయి. దర్యాప్తు సాగినంత కాలం...

పశ్చాత్తాపం - ఫలితం?

జులై 30వ తేదీకి ఉరిశిక్ష విధించిన బాంబు పేలుళ్ళ కేసు నిందితుడు యాకూబ్‌ మెమన్‌ ఇప్పటి వరకు 21 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నాడు. జీవిత ఖైదీకి మనదేశంలో విధించే శిక్ష 14 నుంచి 20 సంవత్సరాలు. ఆ విధంగా చూస్తే యాకూబ్‌ మెమన్‌ ఇప్పటికే ఒక జీవిత ఖైదు అనుభవించాడు. పోనీ నిందితుణ్ణి మన చట్టబద్ధ సంస్థలు శోధించి బంధించాయా? దానికి ఎంత పరిశోధన చేశాయి? ఎలా పట్టుకున్నాయి? అని ప్రశ్నించు కుంటే అలాంటిదేం లేదు. మెమన్‌ తనకు తానుగా లొంగిపోయాడు. లొంగిపోయిన అతణ్ణి అరెస్టు చేసి ఆయన ఇచ్చిన సమాచారంతోనే విచారణ సాగించిన సంస్థలు సుదీర్ఘ విచారణ చేసిన మేరకు అతడే నిందుతుడని తేల్చిన టాడా కోర్టు ఉరిశిక్ష విధించింది. వెనక్కి తిరిగి చూస్తే 20 ఏళ్ళు పైన గడిచిపోయాయి. వృత్తిరీత్యా...

ప్రభుత్వరంగరక్షణకు మరో స్వాతంత్య్రపోరాటం

ఫిక్కీ (పారిశ్రామిక యజమానుల సంస్థ) సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా చెప్పిన మాటలివి. సాక్షాత్తు ప్రధాన మంత్రి చెప్పిన దానికి అనుగుణంగానే బిజెపి ప్రభుత్వ విధానాలున్నాయని స్పష్టంగా అర్థమౌతుంది. నవరత్న ప్రభుత్వరంగ పరిశ్రమల్లోని రూ.69 వేల కోట్ల విలువ కలిగిన వాటాలను అమ్మాలని 2015-16 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. వాస్తవానికి వీటి విలువ నాలుగు రెట్లకుపైగానే ఉంటుంది. ఉదహరణకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 10 శాతం వాటాలు రూ.489 కోట్లకు అమ్మాలని నిర్ణయించారు. వాస్తవ విలువ దీనికి 10 రెట్లుపైగానే ఉంటుంది. ప్రభుత్వరంగ పరిశ్రమలను బలహీనపరిచే చర్యలన్నీ చేపట్టారు. హిందూస్థాన్‌ పెట్రోలియం వాటాలను ఇప్పటికే 49 శాతం ప్రైవేట్‌ వారికి అమ్మారు. గతంలో ప్రతి...

ప్రమాద ఘంటికలు

సేద్యం గిట్టుబాటు కాక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక, రుణగ్రస్తులై నిరాశా నిస్ప్రుహలతో జీవితాలు చాలిస్తున్న రైతులను ఇప్పటి వరకు చూశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వ వేధింపులు భరించలేక రోజుకో రైతు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న దుర్మార్గం మన రాష్ట్రంలో కనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కింద భూమి కోల్పోయిన ఒక రైతు కనీసం ఇస్తామన్న పరిహారం కూడా ఇవ్వకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాశిత రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చిత్తూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు బాధితులదీ అదే దారి. రాజధాని అమరావతిలో ఒకరిద్దరు ఆత్మహత్యలకు ప్రయత్నించినా ప్రభుత్వం బయటికి రానీయలేదు. ప్రభుత్వ శాఖల నిర్వాకం వలన...

అమ్మకానికి గ్రీస్‌

గ్రీస్‌ తన అప్పును సాంతం చెల్లించగలదని ఆశించటం అవాస్తవికమని గ్రీస్‌కు అప్పులిచ్చిన సంస్థలలో ఒకటైన ఐఎంఎఫ్‌ కూడా బహిరంగంగా గుర్తించిన విషయాన్ని కాసేపు మర్చిపోదాం. గ్రీస్‌కు అప్పును చెల్లించటంలో ఎలాంటి ఉపశమనాన్నీ ఇవ్వలేదనుకుంటే ఆ దేశం ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఏదిఏమైనా గ్రీస్‌ను రెండు మార్గాలలో తన అప్పును చెల్లించేలా చేయవలసి ఉంటుంది. మొదటిది, గ్రీస్‌ సరుకులను, సేవలను ఋణదాతలు కొనుగోలుచేసి ఇచ్చిన అప్పుకు సర్దుబాటు చేసుకోవాలి. విదేశీ చెల్లింపుల సమతూకానికి సంబంధించిన కరెంటు ఖాతాలో మిగులు ఉండాలి. అలా ఏర్పడిన మిగులును గ్రీస్‌ తన అప్పు తీర్చటానికి వినియోగిస్తుంది. రెండవది, గ్రీస్‌ తన ఆస్తులను ఋణదాతలకుగానీ లేక మరెవరికైనా...

డిగ్రీలో సెమిస్టర్‌ ఎవరి కోసం?

డిగ్రీ కళాశాలలను అభివృద్ధి చేసి, ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేసి అంతర్జాతీయ ప్రమాణా లతో నూతన కోర్సులను ప్రవేశపెట్టి, ప్రమాణాలు పెంచాల్సిన ప్రభుత్వం ఆ దిశగా అలోచనలకు ఆమడ దూరంలో ఉంది. ఇప్పటి దాకా డిగ్రీలో ఉన్న మూడు సంవత్సరాల పరీక్షల స్థానంలో ఆరు సార్లు పరీక్షలు నిర్వహించే ''సెమిస్టర్‌ విధానాన్ని'' అమలు చేయడానికి సిద్ధం అవుతున్నది. ఈ విధానాన్ని ఎవరి ప్రయోజనాల కోసం అమలు చేస్తున్నారు? విద్యార్థుల చదువుల్లో ప్రమాణాలు పెరుగుతాయా లేక ప్రైవేట్‌ కళాశాలల్లో ఫీజులు దండుకోవడానికా లేక ప్రైవేట్‌ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలను అడ్డుకట్టవేయడానికా లేక కొత్తగా రాష్ట్రంలోకి ఆహ్వానిస్తున్న ప్రైవేట్‌ యూనివర్శిటీల్లో ప్రవేశార్హత...

వ్యూహాత్మకంగానే వివాదాల పెంపు

హైదరాబాదును తామే అభివృద్ధి చేశామన్న ప్రచార వ్యూహం మానుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. ఆయన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా కొట్టిపారేయడం లేదా తెలుగుదేశంపై విమర్శకు పరిమితం కావడం వల్ల తనకు రాజకీయంగా కలిగే ప్రయోజనం ఉండదని చంద్రశేఖర రావు భావిస్తారు. అందువల్ల వాటిని ఖండించడంతో ఆగరు. అనివార్యంగా 'ఆంధ్రోళ్లు' అంటూ పల్లవి జోడిస్తారు. ఆఖరుకు మునిసిపల్‌ సమ్మెను కూడా ఆంధ్రా పార్టీలు నడిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించడం ఇందుకు పరాకాష్ట.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాల సందడి ముగిసింది గనక రాజకీయ, పాలనా వ్యవహారాలూ, సవాళ్లూ ముందుకొస్తున్నాయి. రాజమండ్రిలో తొక్కిసలాట కారణంగా తీవ్ర విమర్శల నెదుర్కొన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్నుంచి బయిట పడేందుకు...

లౌకిక ప్రభుత్వాలకు తగని పని

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న గోదావరి పుష్కరాల శాస్త్రీయత, హేతుబద్ధతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దగ్గరుండి మరీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టడం విమర్శలకు దారి తీస్తోంది. లౌకికవాదానికి కట్టుబడి ఉండాల్సిన ప్రభుత్వాలు చాలా రోజుల ముందు నుంచే పుష్కరాలపై దృష్టి సారించాయి. కొద్దిరోజులుగా పుష్కరాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ రోజువారీ కార్యక్రమాలను విస్మరించడం సహేతుకం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నిరంతరం ప్రవహించే నదులకు ఫలానా కాలంలో మంచిరోజులు వస్తాయని, మిగిలిన కాలమంతా మంచివి కావని ఎలా నిర్ధారించగలుగుతారన్న వాదోపవాదాలు తలెత్తాయి. కొద్ది రోజులుగా...

Pages