ఈరోజు (02 మార్చి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
స్థానిక సమస్యలపై
మార్చి 8 నుండి ప్రజాచైతన్య యాత్రలు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
22 నుండి మహాజర్లు, ధర్నాలు
రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కుల కోసం ఈ యాత్రలు గళం విప్పుతాయి. రెండురోజులపాటు విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం అధ్యక్షతన జరిగిన...