పార్టీ కార్యక్రమాలు

Tue, 2022-03-29 11:30

సార్వత్రిక సమ్మె తొలిరోజు దేశవ్యాప్తంగా విజయవంతమైంది. కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల సమ్మెలో భాగంగా తొలిరోజైన సోమవారం కార్మికలోకం కదం తొక్కింది. ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొడతామని, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకుంటామని ప్రతిన చేసింది. దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో భాగస్వాములయ్యారు.విజయవాడతో పాటు అన్ని జిల్లాల్లోనూ కార్మికులు ప్రదర్శనలు, సభలు నిర్వహించారు.సమ్మె కారణంగా దేశ వ్యాప్తంగా పారిశ్రామిక నగరాలు, వాడల్లో సాధారణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కోల్‌కత్తా, ముంబాయి వంటి నగరాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులూ సమ్మెలో భాగస్వాములయ్యారు. సింగరేణిలో దాదాపు నూరుశాతం...

Wed, 2022-03-16 16:51

రాజధాని నిడమర్రు గ్రామంలో ప్రజా బాటను ప్రారంభించిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి మధు..నిర్మాణమై వృధాగా పడి ఉన్న టీడ్కో గృహాలను సందర్శించారు

Thu, 2022-02-03 17:30

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనగా సుందరయ్య సర్కిల్ నుండి RTC బస్టాండ్ వరకు ర్యాలి చేసి బస్టాండ్ సర్కిల్ లో కేంద్ర ప్రభుత్వ దిస్టిబోమ్మను దగ్ధం చేయడం జరిగింది...

Tue, 2022-01-18 12:35

సిపిఎం ఆధ్వర్యంలో ఒంగోలులో థర్డ్ వేవ్ కోవిడ్- ఒమిక్రాన్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం -హోమ్ ఐసోలేషన్లో ఉన్న పాజిటివ్ పేషేంట్లకు ఆన్లైన్లో వైద్య సాయం -సేవలందించనున్న 14 మంది వైద్య బృందం -హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా 24 గంటలు అందుబాటులో ఉండనున్న వాలంటీర్లు - పేదరోగులకు ఉచితంగా మందులు ఇవ్వనున్న హెల్ప్ లైన్ సెంటర్ నిర్వాహకులు కరోనా , ఒమిక్రాన్ జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న వేళ ప్రజలకు సేవచేయాలనే తలంపుతో సిపిఎం హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటుచేసింది .

Mon, 2021-12-27 17:51

సిపిఎం 26 వ రాష్ట్ర మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచికగా సీనియర్‌ నేత బిఆర్‌ తులసీరావు జెండా ఆవిష్కరణ చేశారు. పార్టీ నేతలు, మహాసభల ప్రతినిధులంతా అమరవీరులకు నివాళులర్పించారు. చిన్నారులు సాంస్కృతిక కళలతో అలరించారు. మహిళలు కోలాటంతో సంబరాలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఎం కార్యకర్తలు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు నిర్వహించబోతున్నారు. భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధికి సిపిఎం రూపొందించబోతున్న కార్యాచరణకు సంసిద్ధులయ్యే దిశలో మహాసభ జరగబోతోంది.

Pages