సిపిఎం 26 వ రాష్ట్ర మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచికగా సీనియర్ నేత బిఆర్ తులసీరావు జెండా ఆవిష్కరణ చేశారు. పార్టీ నేతలు, మహాసభల ప్రతినిధులంతా అమరవీరులకు నివాళులర్పించారు. చిన్నారులు సాంస్కృతిక కళలతో అలరించారు. మహిళలు కోలాటంతో సంబరాలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఎం కార్యకర్తలు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు నిర్వహించబోతున్నారు. భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధికి సిపిఎం రూపొందించబోతున్న కార్యాచరణకు సంసిద్ధులయ్యే దిశలో మహాసభ జరగబోతోంది.
పార్టీ కార్యక్రమాలు
ఆస్తిపన్ను పెంపు, చెత్తపన్ను విధింపుకు వ్యతిరేకంగా విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం నిరసన.. కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి..కేంద్రం రాష్ట్రం మీద ఆదేశించటం, రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ను ఆదేశించడంతో 1200 కోట్లరూపాయల పన్నుల భారం పెంచారు - పన్నులు పెంచడం తప్ప అభివృద్ధి లేదు. అధికారపార్టీ కార్పరేటర్లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాధ్, సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, తూర్పు కార్యదర్శి బోజడ్ల నాగేశ్వరరావు, మాజీ కార్పోరేటర్ గాదె ఆదిలక్ష్మి...
వరద ప్రాంతాల్లో సిపిఎం నాయకుల పర్యాటన.. ప్రకాశం జిల్లా ఉప్పుగుందూరులో గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న మిర్చి, మినుము పంటను రైతులతో కలిసి పరిశీలించిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు.వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు పెంట్యాల హనుమంతరావు, షేక్ మాబు, జయంతి బాబు, మండల కార్యదర్శి తూబాటి శ్రీకాంత్ తదితరులు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారాలు మోపే బిజెపి విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అరెస్ట్.
ఘనంగా అనంతగిరి మండల జెడ్పిటిసీ అభినందన సభ...
జెడ్పిటిసీ ఎన్నికల్లో సీపీఎం పార్టీ అభ్యర్థి అనంతగిరి మండల జెడ్పిటిసీ గా గెలిచిన దీసరి గంగరాజు అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జి.కోటేశ్వరరావు, కీల్లో సురేంద్ర, ఉమ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు...
దేశంలో పాలనంతా అంబానీ, అదానీలకు మోడీ ఇచ్చిన వాగ్దానాల చుట్టే తిరుగుతోంది. 2014, 2019 ఎన్నికల్లో దేశ ప్రజలకిచ్చిన వాగ్దానాలేవీ అమలుకు నోచుకోవడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి డొలిచేస్తోంది. మోడీని గద్దెదింపే అతి పెద్ద పోరాటం దేశంలో సమీప భవిష్యత్తులో విశాఖ నుంచే ఉంటుంది' అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ అన్నారు. 'బిజెపి విధానాలను ప్రతిఘటిద్దాం - విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం' అనే నినాదంతో విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ కాన్వోకేషన్ హాల్‌లో సిపిఎం ఆధ్వర్యాన నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికులు పోరాడుతున్న తీరును అభినందించారు. భారత...
విజయవాడ లెనిన్ సెంటర్ లో స్టేట్ గెస్ట్ హౌస్ స్థలాన్ని అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా ,స్టేట్ గెస్ట్ హౌజ్ సందర్శన... ఒక వైపున కేంద్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే, మరోవైపున రాష్ట్రప్రభుత్వం విలువైన ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటు.విజయవాడ నగరంలో రాజ్ భవన్ సమీపంలో వందలాది కోట్ల రూపాయల విలువైన స్టేట్ గెస్ట్ హౌస్ స్థలాన్ని బిల్డ్ ఏపీ పేరుతో తెగ నమ్మటం సిగ్గుచేటు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమ్మకాన్ని వ్యతిరేకించిన వైసిపి నేడు అధికారంలో రాగానే మాట మార్చి అమ్మకానికి పెడుతోంది.ప్రజల ఆస్తులు అమ్మకాన్ని వ్యతిరేకిస్తాం, ప్రతిఘటిస్తాం, ప్రజల ఆస్తులు కాపాడుకుంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్...
విశాఖ నగరంలోను, జిల్లాలో పలు మండలాల్లో బషీర్ బాగ్ విద్యుత్ అమరులకు నివాళ్ళు అర్పించారు.
విశాఖ నగరంలో జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నరసింగరావు మాట్లాడుతూ 21 సంవత్సరాల క్రితం విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ బషీర్ బాగ్ వద్ద ఆందోళన చేసిన వారిపై అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్పులు జరిపించి రామకృష్ణ ,బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి లను పొట్టనపెట్టుకుందని. వందలాది మంది గాయపర్చారన్నారు. ఆనాటి పోరాటం ఫలితంగా, తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీల పెంచలేదు. అయితే రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణల బిల్లును అమలు చేయడానికి అంగీకరించింది. ఇది అత్యంత...
కార్పొరేటర్ సత్యబాబు దీక్షకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మద్దతు తెలిపారు.
విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద అరెస్ట్ చేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కార్పొరేటర్ సత్యబాబుని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పరామర్శించి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి ఆధారిత ఇంటిపన్ను పెంపుపై బుధవారం విజయవాడ కార్పోరేషన్ లో అడ్డగోలుగా వైసిపి ప్రభుత్వం ఆమోదించుకుందని మండిపడ్డారు.
ఈ నిరంకుశ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు కార్పోరేషన్ ఆఫీసులో చేస్తున్న నిరాహారదీక్షను భగ్నం చేస్తూ పోలీసులు బుధవారం అర్ధరాత్రి 2గం.లకు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలతో కానీ,...
పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజా నిరసన కార్యక్రమంలో భాగంగా విజయవాడలో వామపక్ష పార్టీల ఆందోళన.. మద్సిు తెలిపిన కార్మిక సంఘాలు.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్ మరియు తదితర నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పెట్రోలు,డీజిల్ ధరల పై ఉన్న పనులను తగ్గించాలని, కరోనా వేళ ప్రజలపై భారాలు ఆపాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో వెంకటేశ్వర సెంటర్లో నిరసన ..
విశాఖ ప్రజలకు భారంకానున్న ఆస్థి పన్ను, చెత్త పై పన్ను రద్దు చేయాలని శాంతియుతంగా విశాఖ జివిఎంసి కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న సిపిఎం నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్న పోలీసులు.. సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, జగన్, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి.క్రిష్ణారావు, మాజీ కార్పోరేటర్ బొట్టా ఈశ్వరమ్మ సహా పలువురు అరెస్టు. అరెస్టు చేసిన సిపిఎం నాయకులను బేషరత్తుగా విడుదల చేయాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్.