పార్టీ కార్యక్రమాలు

Thu, 2021-07-29 15:57

కార్పొరేటర్ సత్యబాబు దీక్షకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మద్దతు తెలిపారు.

విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద అరెస్ట్ చేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కార్పొరేటర్ సత్యబాబుని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పరామర్శించి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి ఆధారిత ఇంటిపన్ను పెంపుపై బుధవారం విజయవాడ కార్పోరేషన్ లో అడ్డగోలుగా వైసిపి ప్రభుత్వం ఆమోదించుకుందని మండిపడ్డారు.

ఈ నిరంకుశ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు కార్పోరేషన్ ఆఫీసులో చేస్తున్న నిరాహారదీక్షను భగ్నం చేస్తూ పోలీసులు బుధవారం అర్ధరాత్రి 2గం.లకు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలతో కానీ,...

Mon, 2021-07-26 13:01

పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజా నిరసన కార్యక్రమంలో భాగంగా విజయవాడలో వామపక్ష పార్టీల ఆందోళన.. మద్సిు తెలిపిన కార్మిక సంఘాలు.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్ మరియు తదితర నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు

Sat, 2021-07-03 16:44

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పెట్రోలు,డీజిల్ ధరల పై ఉన్న పనులను తగ్గించాలని, కరోనా వేళ ప్రజలపై భారాలు ఆపాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో వెంకటేశ్వర సెంటర్లో నిరసన ..

Thu, 2021-06-24 15:06

విశాఖ ప్రజలకు భారంకానున్న ఆస్థి పన్ను, చెత్త పై పన్ను రద్దు చేయాలని శాంతియుతంగా విశాఖ జివిఎంసి కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న సిపిఎం నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్న పోలీసులు.. సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, జగన్, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి.క్రిష్ణారావు, మాజీ కార్పోరేటర్ బొట్టా ఈశ్వరమ్మ సహా పలువురు అరెస్టు. అరెస్టు చేసిన సిపిఎం నాయకులను బేషరత్తుగా విడుదల చేయాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్.

Fri, 2021-06-18 15:55

పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు,మందులు ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వామపక్ష పార్టీల  ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన చేపట్టారు. బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క మే నెలలోనే 22 సార్లు పెంచారని, కరోనా నేపధ్యంలో సామాన్యుల జీవితాలు దుర్బరం అయ్యాయని, ఇటువంటి సమయంలో ప్రజలను ఆదుకోవడానికి చర్యలు చేపట్టకపోగా ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమన్నారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని వాపోయారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు రోజుగడవని పరిస్థితి దాపురించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Tue, 2021-06-08 11:30

ఈ నెల రోజుల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోలు ధరలను 20 సార్లు పెంచింది. ఫలితంగా డీజిల్ పెట్రోల్ ధరలకు తేడా లేకుండా పోయింది. ప్రజలు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తుంటే ప్రజలపై కేంద్ర ప్రభుత్వo భారాలు వేయటం పద్దతి కాదు . డీజిల్ పెట్రోల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన గాని రకరకాల టాక్స్లు వేసి ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం చాలా బాధాకరం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చెసింది.

Fri, 2021-03-05 13:36

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా విశాఖలో  అఖిల పక్ష పార్టీలు బంద్  నిర్వహించాయి..విశాఖ ఉక్కు అమ్మేహక్కు కేంద్రానికి లేదన్నారు. ఎందుకంటే ఎన్నో త్యాగాల పునాదిపై విశాఖ ఉక్కు నిలబడి ఉందన్నారు.కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ బంద్‌ ఉద్యమానికి ఆరంభమేనన్నారు. బిజెపి నేతలు రాష్ట్ర ప్రజలను ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 

Fri, 2021-02-26 15:17

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ మద్దిలపాలెం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వామపక్ష పార్టీల నేతల అరెస్ట్..

Mon, 2021-02-08 16:02

కేంద్ర బడ్జెట్టులో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ, ఎఐకెఎస్‌సిసి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే.శోభనాద్రీశ్వరరావు, సిఐటియు రాష్ట్రకార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.కేశవరావు, అఖిల భారత కిసాన్‌సభ జాతీయ ఉపాధ్యక్షులు రావుల.వెంకయ్య, వివిధ రాజకీయ, ట్రేడ్‌ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. కేంద్రం అవలంభిస్తున్న కార్పొరేటీకరణ విధానాలను ఖండించారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఆపకుంటే బిజెపిని రాష్ట్రప్రజలు...

Sat, 2021-01-30 16:10

 

 తిరుపతి సి.పి.యం.ఆఫీసు నందు 'రైతు జీవితం' షార్ట్ ఫిలిమ్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, యండపల్లి శ్రీనివాసరెడ్డి (MLC) , ఆర్పీఐ నాయకులు అంజయ్య తదితరలు

Fri, 2020-11-13 10:45

బిజెపి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టి, మత కలహాలు సృష్టించి, ప్రజల శవాలపై రాజకీయాలు చేస్తోందని, దీనిని ప్రజలు ఎన్నడూ క్షమించరని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సిపిఎం రాష్ట్ర కమిటీ చేపట్టిన రాజకీయ ప్రచార యాత్ర కార్యక్ర‌మంలో భాగంగా గురువారం చిత్తూరు జిల్లా పలమనేరు అంబేద్కర్‌ సర్కిల్‌ నుండి బస్టాండ్‌ కూడలిలోని ఎటిఎం సర్కిల్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి గిరిధర్‌ గుప్త అధ్యక్షతన జరిగిన సభలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బిజెపి, దాని అనుబంధ సంస్థలు చిన్నచిన్న గుడులు, మసీదులు ఎంచుకొని మతకలహాలు సృష్టించడానికి ప్రయత్సిస్తున్నాయని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం...

Fri, 2020-11-13 10:43

ఇటీవల ముగిసిన బీహార్‌ ఎన్నికల్లో చాలా స్వల్ప తేడాతో బిజెపి-జెడి(యు) కూటమి గెలుపొందింది. ఈ కూటమికి 125సీట్లు రాగా, మహాగత్‌బంధన్‌కు 110సీట్లు వచ్చాయి. అయితే, ఈ రెండు కూటములు మధ్య ఓట్ల వాటా తేడా చాలా తక్కువగా కేవలం 0.2శాతం మాత్రమే వుంది. ఈ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ఎన్‌డిఎకు చాలా ఎదురుదెబ్బలు తగిలాయని పీపుల్స్‌ డెమోక్రసీ తన సంపాదకీయంలో పేర్కొంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి బిజెపి కూటమి 12.4శాతం ఓట్లు పోగొట్టుకుందని పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకత, నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం పట్ల నెలకొన్న అసంతృప్తి కారణంగా గత ఎన్నికల్లో ఏకంగా 71సీట్లు సాధించిన జెడి(యు)కి ఈసారి కేవలం 43సీట్లే లభించాయని సంపాదకీయం వ్యాఖ్యానించింది. మహాగత్‌బంధన్‌...

Pages