ద్రవ్యోల్బణం పెరుగుతున్న తీరు ప్రజానీకాన్ని కలవ రపెడుతోంది. తాజా గణాంకాల ప్రకారం ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతానికి చేరింది. జులై నెలతో పోలిస్తే ఇది 0.21 శాతం ఎక్కువ. ఆ నెలలో 6.71 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. దేశ వ్యాప్తంగా తిండిగింజలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆగస్టులో చుక్కలను దాటాయి. ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వినియోగదారుల ధరల సూచీ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ) ప్రకారం ఆగస్టులో నిత్యావసర వస్తువుల ధరలు 7.62 శాతం పెరిగాయి.