రాష్ట్రాల ఆర్థిక అధికారాలపై తీవ్ర ప్రభావం చూపనున్న జిఎస్‌టి బిల్లు విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. రాష్ట్రాల సేల్స్‌టాక్స్‌ను కేంద్రం తమ గుప్పెట్లోకి తీసుకునే జిఎస్‌టి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ అవసరమన్నారు. దేశంలో 50 శాతం కంటే ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. అందుకే ఆయా రాష్ట్రాలతోనూ, అన్ని పార్టీలతోనూ కేంద్రం మాట్లాడాలని తాము కోరుతున్నామన్నారు.